దక్షిణాదిలో కాలు మోపుతూనే సోనాక్షి సిన్హా మంచి అవకాశమే సంపాదించింది. రజనీకాంత్ తాజా సినిమా లింగాలో హీరోయిన్‌గా ఎంపికయింది. దక్షిణాది సూపర్‌స్టార్‌తో నటించాలంటే మొదట్లో చాలా భయమేసిందని చెప్పింది. ‘ఆయన అద్భుతమైన మనిషి. రజిని సినిమాలు నేను ఎక్కువగా చూడలేదు కానీ ‘హమ్’ సినిమా నుంచి ఆయన తెలుసు.
ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. నటుడిగా ఎంత ఎత్తుకు ఎదిగినా వినమ్రంగా ఉండడం రజిని గొప్పతనం’ అని వివరించింది. లింగా షూటింగ్ తొలి రోజున సోనాక్షి రజిని కలుసుకొని ‘మీతో కలసి పనిచేస్తున్నందుకు గర్వంగా ఉన్నా.. కాస్త కంగారుగానూ ఉంద’ని చెప్పింది. దీనికి రజనీ నవ్వేసి ‘నీతో నటిస్తున్నందుకు నేను భయపడాలి. ఎందుకంటే నువ్వు నా స్నేహితుడి (శత్రుఘన్ సిన్హా) కూతురివి’ అంటూ నవ్వేశాడు. దీంతో ఇద్దరి మధ్య కాస్త చనువు పెరిగింది. ఇక సోనాక్షి అప్పటి నుంచి షూటింగులో ఇబ్బందిపడడం లేదు.
దక్షిణాది తొలి సినిమాలోనే రజిని సరసన నటించడం కంటే గొప్ప విషయం ఏమీ లేదని ఈ బ్యూటీ చాలా సంబరపడింది. త్వరలో విడుదల కాబోతున్న ‘హాలిడే’ సినిమా ప్రచారం కోసం సోనాక్షి ప్రస్తుతం బిజీగా గడుపుతోంది. ఇందులో అక్షయ్ కుమార్ హీరో. రజినిలోని వృత్తినైపుణ్యం, వినమ్రత వల్లే ప్రేక్షకులుగా దగ్గర కాగలిగారని చెప్పింది. షూటింగ్ ముగిసిన వెంటనే ఆయన చుట్టూ అభిమానులంతా గుమిగూడి సందడి చేస్తారని వివరించింది. కేఎస్ రవికుమార్ లింగాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అనుష్క, జగపతిబాబు, వడివేలు, లారెన్ ఇర్విన్ అనే పాశ్చాత్య నటి ఇందులో కీలక పాత్రల్లో కనిపిస్తారు. అన్నట్టు. నయనతార కూడా ఒకటి రెండు సీన్లలో మెరిసిపోనుందని లింగా యూనిట్ సభ్యుడు ఒకరు చెప్పారు.
ఆయనంటే భయపడ్డా...
Published Sat, May 31 2014 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM
Advertisement
Advertisement