
రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్
చెన్నై: రాష్ట్ర ఖజానాకు రూ.21 కోట్లు నష్టం కలిగించిన సూపర్ స్టార్ రజనీకాంత్, 'లింగా' చిత్ర నిర్మాత రాక్‌లింగ్ వెంకటేశ్‌లపై కేసు నమోదు చేయాల్సిందిగా చెన్నై పోలీస్ కమిషనర్‌ను ఆదేశించాలని శుక్రవారం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మెరైన్ పిక్చర్స్ భాగస్వామి సింగరవడివేలన్ ఈ పిటిషన్ వేశారు. రజనీ తన పలుకుబడి ఉపయోగించి 'లింగా'కు వినోదపు పన్ను మినహాయింపు ఇప్పించారని, తమిళ సంస్కృతి అభివృద్ధికి దోహదపడే చిత్రాలకు మాత్రమే వినోదపు పన్ను రాయితీ వర్తిస్తుందన్నారు. 'లింగా' చిత్రం టైటిల్ సంస్కృతంలో ఉన్నందున దీనికి రాయితీ వర్తించదన్నారు.