Gang busted
-
దొంగనోట్ల ముఠా గుట్టురట్టు: 6 గురు అరెస్టు
పశ్చిమగోదావరి: బుట్టాయిగూడెంలో దొంగనోట్లను చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా జంగారెడ్డి గూడెం, పోలవరం ప్రాంతంలో నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి దగ్గరి నుంచి రూ.12 లక్షల నకిలీ కరెన్సీ, 3 బైకులు, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో ఎవరిపైనా ఒత్తిడిలేదు: మంత్రి అవంతి -
ఈజీ మనీ ఆశతోనే ఇలా..
సాక్షి, హైదరాబాద్: ఉల్లాసం సంగతేమోగానీ ఐపీఎల్ మ్యాచ్‌ల వల్ల కొందరి జీవితాలు సర్వనాశనం అవుతున్నాయని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తోన్న 12 మందిని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర్నుంచి రూ.15.50 లక్షల నగదు, 22 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. ‘‘డిజిటల్ నెట్వర్క్ ద్వారా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. గోవా, బెంగళూరు, ముంబైలు కేంద్రంగా జరుగుతోన్న ఈ దందాలో హైదరాబాద్‌కు చెందిన పలువురికి భాగస్వామ్యం ఉంది. ఈస్ట్‌జోన్‌లోని కొన్ని ప్రాంతాల్లో తిష్టవేసిన గ్యాంగ్‌లు భారీ స్థాయిలో బెట్టింగ్‌కు పాల్పడుతున్నారన్న సమాచారం మేరకు దాడులు చేసి నిందితులను పట్టుకున్నాం. వీళ్ల వెనకున్న సూత్రధారుల కోసం వేట ప్రారంభించాం’’ అని సీపీ అజనీ కుమార్ చెప్పారు. ఈజీ మనీ కోసమే: కాగా, అరెస్టైన నిందితులు వేర్వేరు వృత్తుల్లో కొనసాగుతున్నప్పటికీ ఈజీ మనీ కోసమే బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని కమిషనర్ తెలిపారు. చట్టవ్యతిరేక కలాపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని, యువత ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌ల జోలికి పోయి, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవుపలికారు. -
రైస్ పుల్లింగ్ పేరుతో సైబరాబద్లో మోసాలు
-
పేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు
-
గుప్తనిధుల ముఠా సభ్యులు అరెస్ట్
భూపాలపల్లి: గుప్త నిధుల ముఠా సభ్యుల గుట్టును కొయ్యూరు పోలీసులు ఆదివారం రట్టు చేశారు. ముఠాకు చెందిన 9 మంది సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆచార్య జయశంకర్ జిల్లాలోని మల్హార్ మండలం పెద్దతూండ్ల అటవీప్రాంతంలో భారీగా తవ్వకాలు జరిపినట్లు వారు పోలీసుల విచారణ తెలిపారు. -
దొంగనోట్ల ముఠా గుట్టురట్టు
నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్లలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు గురువారం రట్టు చేశారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులకు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కిరాణా దుకాణంలో నకిలీ నోట్లు మారుస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని... తమదైన శైలిలో విచారించారు. దీంతో సదరు నిందితుడు.. ముగ్గురు పేర్లను వెల్లడించాడు. దాంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ముఠాలోని సభ్యులంతా గుంటూరు జిల్లా జంగులకుంటకు చెందిన వారని పోలీసులు వివరించారు. అలాగే నిందితుల నుంచి 3 లక్షల నకిలీ నోట్లతోపాటు ముద్రణ యంత్రాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
నకిలీ ఐఫోన్ల తయారీ ముఠా అరెస్టు
హైదరాబాద్ : నకిలీ ఐఫోన్ల తయారి చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాగుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం రట్టు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీకి చెందిన ప్రిన్స్ మల్హోత్రా అలియాస్ సోను (22), అమన్ నాగ్‌పాల్ అలియాస్ అర్మాన్ మాలిక్ (23), జితిన్ మున్ని, ధ్రువ్, నాకుల్, సత్యం తదితరులు ఏడుగురు నెలన్నరగా నగరంలోని మాదాపూర్‌లో నివసిస్తున్నారు. ఐఫోన్లను పోలిన నకిలీ ఫోన్లు తయారు చేస్తూ వాటికి పత్రాలు కూడా సృష్టించి వివిధ షాపులలో రీప్లేస్మెంట్ చేస్తూ కొత్త వాటిని తీసుకుని.... వాటిని కూడా విక్రయిస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్- 45లోని ఆప్ట్రానిక్స్‌లో ఇటీవల ఓ నకిలీ ఐ ఫోన్‌ను రీప్లేస్ చేస్తూ సదరు వ్యక్తులు దొరికిపోయారు. షాపు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో... వారిని అదుపులోకి తీసుకుని ... పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం పట్టుబడిన సోను, అమన్నాగ్పాల్ను విచారించగా తాము ఢిల్లీలోని జఫర్‌మార్కెట్ నుంచి వాటిని తీసుకొస్తున్నామని వెల్లడించారు. వారిద్దరి నుంచి దాదాపు 20 నకిలీ ఐఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా అయిదుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనంతలో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు
అనంతపురం: అనంతపురం నగరంలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు బుధవారం రట్టు చేశారు. ముఠాకు చెందిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు. -
నకిలీ శొంఠి తయారీ ముఠా గుట్టురట్టు
వికారాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లిలో నకిలీ శొంఠి తయారు చేస్తున్న ముఠా గుట్టును ఎస్వోటీ పోలీసులు మంగళవారం రట్టు చేశారు. 1000 కిలోల అల్లం, ఫెవికాల్తోపాటు నీలి రంగు కిరోసిన్‌ను పోలీసులు సీజ్ చేశారు. అయితే యజమాని పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ శొంఠి తయారు చేస్తున్నట్లు పోలీసులు ఆగంతకులు ఫోనులో సమాచారం అందించారు. దీంతో పోలీసులు దాడులు చేశారు. -
తాడిపత్రిలో నకిలీ నోట్ల ముఠాగుట్టు రట్టు
అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో నకిలీ నోట్ల ముఠా గుట్టును శనివారం పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ప్రింటర్, స్క్యానర్తోపాటు రూ. 2 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బెజవాడలో పైరసీ సీడీల ముఠా గుట్టురట్టు
విజయవాడ : పైరసీ సీడీల ముఠా గుట్టును విజయవాడ నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. విజయవాడ వన్‌టౌన్‌లోని కొత్తపేట డ్రెయిన్ వీధిలో పైరసీ సీడీల తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 5 వేల పైరసీ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో తాజాగా విడుదలైన జతకలిసే, సౌఖ్యం సినిమాలతోపాటు బెంగాల్ టైగర్, శంకరాభరణం తదితర చిత్రాలకు చెందిన పైరసీ సీడీలు ఉన్నాయి. అలాగే త్వరలో విడుదలయ్యే సినిమాలకు సంబంధించిన సీడీ కవర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పైరసీ సీడీల నిర్వాహకుడు టి సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
నకిలీ బంగారం విక్రయించే ముఠా గుట్టు రట్టు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో నకిలీ బంగారం, వజ్రాలు విక్రయించే ముఠా గుట్టును శుక్రవారం పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 134 నకిలీ బంగారం బిస్కెట్లు, 57 నకిలీ వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్లోచైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్ : అంతరాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా గుట్టును సోమవారం ఎల్బీనగర్ పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన నలుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సైబరాబాద్ పరిధిలో పలు చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు ముఠా సభ్యులు చెప్పారని పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
టోఫెల్ ప్రశ్నాపత్రాన్ని హ్యాక్ చేసిన ముఠా అరెస్ట్
హైదరాబాద్ : టోఫెల్ పరీక్ష ప్రశ్నాపత్రం హ్యాక్ చేసిన ముఠా గుట్టును హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం రట్టు చేశారు. ప్రధాన నిందితుడు అభిషేక్ రెడ్డితోపాటు నలుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్ష నగదు. కంప్యూటర్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ట్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. టోఫెల్ పరీక్షకు దాదాపు 10 గంటల ముందే పరీక్ష పత్రాన్ని ఈ ముఠా డౌన్లోడ్ చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకోసం 78 సర్వర్లను వీరు హ్యాక్ చేసినట్లు పోలీసులు చెప్పారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని పోలీసులు వెల్లడించారు. -
దొంగనోట్ల కేసులో అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్
దొంగ నోట్ల ముఠా గుట్టును విశాఖపట్నం నగర పోలీసులు బుధవారం రట్టు చేశారు. దొంగనోట్లను చలామణి చేస్తున్న సినీ అసిస్టెంట్ డైరెక్టర్ భూపతి తేజతోపాటు మరో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.4 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసు కమిషనరేట్‌కు తరలించి విచారిస్తున్నారు. నిందితులపై వివిధ సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.