హైదరాబాద్ : అంతరాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా గుట్టును సోమవారం ఎల్బీనగర్ పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన నలుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. సైబరాబాద్ పరిధిలో పలు చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు ముఠా సభ్యులు చెప్పారని పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.