సాక్షి, హైదరాబాద్: ఉల్లాసం సంగతేమోగానీ ఐపీఎల్ మ్యాచ్‌ల వల్ల కొందరి జీవితాలు సర్వనాశనం అవుతున్నాయని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తోన్న 12 మందిని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర్నుంచి రూ.15.50 లక్షల నగదు, 22 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు.
‘‘డిజిటల్ నెట్‌వర్క్ ద్వారా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. గోవా, బెంగళూరు, ముంబైలు కేంద్రంగా జరుగుతోన్న ఈ దందాలో హైదరాబాద్‌కు చెందిన పలువురికి భాగస్వామ్యం ఉంది. ఈస్ట్‌జోన్‌లోని కొన్ని ప్రాంతాల్లో తిష్టవేసిన గ్యాంగ్‌లు భారీ స్థాయిలో బెట్టింగ్‌కు పాల్పడుతున్నారన్న సమాచారం మేరకు దాడులు చేసి నిందితులను పట్టుకున్నాం. వీళ్ల వెనకున్న సూత్రధారుల కోసం వేట ప్రారంభించాం’’ అని సీపీ అజనీ కుమార్ చెప్పారు.
ఈజీ మనీ కోసమే: కాగా, అరెస్టైన నిందితులు వేర్వేరు వృత్తుల్లో కొనసాగుతున్నప్పటికీ ఈజీ మనీ కోసమే బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని కమిషనర్ తెలిపారు. చట్టవ్యతిరేక కలాపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని, యువత ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌ల జోలికి పోయి, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవుపలికారు.
Comments
Please login to add a commentAdd a comment