ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ డాన్ అమీత్ గుజరాతీని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న అమిత్.. గత కొన్నేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. అంతేకాదు.. క్రికెట్ బెట్టింగ్‌తో కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు.
ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. పీటీ వారెంట్‌పై అమిత్‌ను పోలీసులు హైదరాబాద్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆపై మీడియా ముందు, కోర్టులోనూ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా బూకీలను ఏర్పాటు చేసి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్స్ కు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. దేశవ్యాప్తంగా బుకీలను ఏర్పాటు చేసుకుని బెట్టింగులకు పాల్పడుతున్నాడని అమిత్ గురించి పక్కా ఇన్ఫర్మేషన్ సేకరించారు హైదరాబాద్ పోలీసులు. అంతేకాదు.. క్రికెట్ బెట్టింగుల కోసం వాడే లైవ్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment