cricket betting mafia
-
క్రికెట్ బెట్టింగ్ మాఫియాలో జనసేన నాయకులు
-
క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ డాన్ అమీత్ గుజరాతీని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న అమిత్.. గత కొన్నేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. అంతేకాదు.. క్రికెట్ బెట్టింగ్తో కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. పీటీ వారెంట్‌పై అమిత్‌ను పోలీసులు హైదరాబాద్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆపై మీడియా ముందు, కోర్టులోనూ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా బూకీలను ఏర్పాటు చేసి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్స్ కు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. దేశవ్యాప్తంగా బుకీలను ఏర్పాటు చేసుకుని బెట్టింగులకు పాల్పడుతున్నాడని అమిత్ గురించి పక్కా ఇన్ఫర్మేషన్ సేకరించారు హైదరాబాద్ పోలీసులు. అంతేకాదు.. క్రికెట్ బెట్టింగుల కోసం వాడే లైవ్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: విశాఖలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠాల గుట్టు రట్టు -
ఐపీఎల్ బెట్టింగ్ ముఠాల గుట్టు రట్టు
పెదవాల్తేరు(విశాఖ తూర్పు)/చిత్తూరు అర్బన్: రాష్ట్రంలోని చిత్తూరు, విశాఖల్లో సాగుతున్న భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. చిత్తూరులో తొమ్మిదిమందిని, విశాఖలో ఇద్దరిని అరెస్టు చేసి వారినుంచి బెట్టింగ్ సామగ్రిని, నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఆయా పోలీసు కార్యాలయాల్లో సంబంధిత అధికారులు వివరాలు వెల్లడించారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాపై అందిన ఫిర్యాదు మేరకు విశాఖ నగర పోలీస్‌కమిషనర్ శ్రీకాంత్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మూడో పట్టణ పోలీసులు సంయుక్తంగా ఆర్కే బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోని మహారాజా టవర్స్ అపార్ట్మెంట్లో ఒక అద్దె ఫ్లాట్‌పై దాడులు నిర్వహించారు. అక్కడ 16 లైన్ల కమ్యూనికేషన్ వ్యవస్థతో నిర్వహిస్తున్న బెట్టింగ్ ప్రక్రియను చూసి పోలీసులు నివ్వెరపోయారు. భీమవరం ప్రాంతానికి చెందిన రాంబాబు (30), గంజి వీరవెంకట సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు (36)ను అరెస్టు చేశారు. త్రీటౌన్ సీఐ కోరాడ రామారావు దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరులో.. చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. సంతపేటకు చెందిన టి.శేఖర్, పూతలపట్టు మండలం నొచ్చుపల్లికి చెందిన యుగంధర్‌బాబు మరికొంతమంది కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న టూటౌన్ సీఐ యుగంధర్, ఎస్ఐ మల్లికార్జున, సిబ్బందితో కలిసి ఓబనపల్లి సమీపంలోని సివిల్ సప్లయ్ గోదాము వద్ద బెట్టింగ్‌కు పాల్పడుతున్న 9 మందిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.12.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సంతపేటకు చెందిన శేఖర్(41), రమేష్(46), పాంచాలీపురానికి చెందిన సెంథిల్‌కుమార్ (38), పాకాల మండలం గాంధీనగర్‌కు చెందిన నరేంద్ర(30), పూతలపట్టు మండలం నొచ్చుపల్లి గ్రామానికి చెందిన యుగంధర్‌బాబు(40), కుమార్‌బాబు(39), బండపల్లికి చెందిన లోకేష్(31), మనోహర్(30), మునిస్వామి(42)పై కేసు నమోదు చేశారు. -
టీ20 మ్యాచ్‌లు ఉన్నాయంటే చాలు...
క్రికెట్ అంటే ఒకప్పుడు ప్యాషన్.. ఇప్పుడు వ్యసనం.! ప్రధానంగా టీ20 మ్యాచ్‌లు ఉన్నాయంటే చాలు బెట్టింగ్ జోరుగా సాగుతోంది. దీనిలో ముఖ్యంగా యువతనే ఉంటోంది. ఎక్కడపడితే అక్కడే అడ్డాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. బంతిబంతికి పందెం కాస్తూ రూ.వేలల్లో పోగొట్టుకుంటున్నారు. తద్వారా ఆర్థికంగా చితికిపోతున్నారు. పోలీసులు కూడా వీటిపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో విచ్చలవిడిగా బెట్టింగ్ సాగుతోంది. కామారెడ్డి క్రైం: ప్రస్తుతం క్రికెట్ అంటే ఏస్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు. ప్రధానంగా యువతలోనే క్రికెట్ మోజు వెర్రివెతలు వేస్తోంది. ఆటను ఆటలా చూడలేకపోతున్నారు. యువత బెట్టింగ్ మోజులో పడి పెడదారులు తొక్కుతున్నారు. టీ20 క్రికెట్ మొదలైందంటే చాలు బెట్టింగ్ మాయలో పడి వేలల్లో నష్టపోతున్నారు. చిన్న వయసులో ఎంతోమందికి ఇదొక వ్యసనంగా మారుతోంది. ఈ చర్య ఆందోళనకు గురిచేస్తోంది. ఇదివరకు క్రికెట్ మాచ్ ఉందంటే టీవీల ముందు బైఠాయించి ఇంటికే పరిమితమయ్యేవారు. బెట్టింగ్‌ల కారణంగా ఇటీవలి కాలంలో అందరూ ప్రత్యేక అడ్డాలు వెతుక్కుంటున్నారు. ఎక్కడపడితే అక్కడే పందాలు కాస్తున్నారు. దీంతో కొందరు యువకులు అప్పులబారిన పడుతున్న సందర్భాలున్నాయి. క్రికెట్‌పై యువతలో ఉన్న మోజును కొందరు నిర్వాహకులు తప్పుడు మార్గంలో సొమ్ము చేసుకుంటున్నారు. కామారెడ్డిలో ఇటీవల క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయినా కామారెడ్డిలో పదుల సంఖ్యలో బెట్టింగ్ బృందాలున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలతో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, ఆర్మూర్, బోధన్ వంటి పట్టణాలు, మండలాల్లోని యువతకు బెట్టింగ్ నిర్వాహకులు గాలం వేస్తున్నారు. అలాంటివారిపై పోలీసు శాఖ నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిఘా పెంచాల్సిందే.. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై పోలీసులు మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. బెట్టింగ్తో కలిగే నష్టాలపై సరైన అవగాహన లేక యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఆర్థికంగా సమస్య లు తలెత్తితే ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలోకి వెళ్తున్నా రు. బెట్టింగ్ కారణంగా భవిష్యత్తును పాడు చేసుకో కుండా ఉండాలంటే వారికి విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. బంతి బంతికి బెట్టింగ్.. బెట్టింగ్ వ్యవహారం రకరకాలుగా సాగుతోంది. టీవీలో వచ్చే మ్యాచ్‌లో ఈరోజు ఎవరు గెలుసారో అనేది మాత్రమే కాకుండా, బంతిబంతికి ఏం జరుగుతుందో అనే విషయంపై బెట్టింగ్ చేస్తున్నారు. బెట్టింగ్ ముఠాలే కాకుండా చాలాచోట్ల యువకులు తామే స్వయంగా గ్రూప్‌గా ఏర్పడి పందాలు కాస్తున్నారు. ఇది వరకు బెట్టింగ్ నిర్వహించడం అంటే ప్రత్యేకంగా అడ్డాలు ఉండేవి. ఇటీవలి కాలంలో ఎక్కడి పడితే అక్కడే బృందాలుగా కూర్చుని ఫోన్ల ద్వారా నిర్వాహకులతో మాట్లాడుతూ ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. ఈనెల 7న జరిగిన భారత్–న్యూజిల్యాండ్ టీ20 మ్యాచ్‌పై కూడా జోరుగా బెట్టింగ్ సాగినట్లు సమాచారం. నష్టపోతున్న యువత... జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. గతంలో బెట్టింగ్‌లో పాల్గొని నష్టపోయిన ఓ యువకుడు అప్పులు బారిన పడి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఇలాంటి సంఘటనలు ఆయా గ్రామాల్లో మరెన్నో చోటు చేసుకుంటున్నాయి. బెట్టింగ్ కోసం ఇండ్లు, హోటళ్లు, రెస్టారెంట్ వంటి ప్రదేశాల్లో అడ్డాలుగా చేసుకుంటున్నారు. పోలీసుల నిఘా పెరగడంతో ఎప్పటికప్పుడు అడ్డాలు మారుస్తూ బెట్టింగ్ కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై పలుసార్లు పోలీసులు దాడులు చేయగా జిల్లా కేంద్రంలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో టీ20 క్రికెట్ మ్యాచ్‌లు వచ్చే సమయాల్లో క్రికెట్ ఛానళ్లను పెట్టడం లేదు. -
ఆన్లైన్లో వీడియో కలకలం
-
ఆన్లైన్లో వీడియో కలకలం
అహ్మదాబాద్: క్రికెట్ బెట్టింగ్ మాఫియా తనను చంపేస్తామని బెదిరిస్తోందని, సాయం చేయాలని దీపక్ ధాననీ అనే వ్యక్తి ప్రధాని మోదీని, రాజ్‌కోట్ పోలీసులను అర్ధిస్తున్న వీడియో ఆన్లైన్లో కలకలం రేపుతోంది. ఈ వీడియోను దీపక్ తన సెల్ఫోన్లో రికార్డు చేసిన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ‘రాజ్‌కోట్‌లోని బుకీలు, నేరస్తులు నన్ను, నాకుటుంబాన్ని హతమారుస్తామని బెదిరిస్తున్నారు. నేను తీవ్రమైన తప్పు చేశాను. క్రికెట్లో బెట్టింగ్కోసం నా ఇంటిని సైతం అమ్మేశాను. ఇప్పుడు నాదగ్గర ఏమీ లేదు’ అని దీపక్ వాపోయాడు. సదరు బుకీ పేరును వీడియోలో వెల్లడించిన దీపక్ తాను ఇప్పటికే రూ.7 కోట్లు చెల్లించానని, ఇంకా రూ.1.7 కోట్లు బాకీ ఉన్నట్లు తెలిపాడు. ఈ వీడియో వైరల్ కావడంతో రాజ్‌కోట్ పోలీసులు దీపక్ ఇంటికి రక్షణ కల్పించారు. ఇన్స్పెక్టర్ ఆర్ఆర్ సోలంకీ ఈ ఘటనపై మాట్లాడుతూ దీపక్ క్రికెట్ బుకీగా పనిచేస్తున్నాడని, గతంలోనూ చాలా కేసుల్లో అరెస్టయ్యాడని తెలిపారు.