హెల్త్ మినిస్టర్ తనిఖీలు ... డాక్టర్లు డుమ్మా | AP Health Minister Kamineni Srinivas visits Old Government Hospital in vijayawada city | Sakshi
Sakshi News home page

హెల్త్ మినిస్టర్ తనిఖీలు ... డాక్టర్లు డుమ్మా

Published Wed, Dec 17 2014 11:12 AM | Last Updated on Sat, Aug 18 2018 8:10 PM

హెల్త్ మినిస్టర్ తనిఖీలు ... డాక్టర్లు డుమ్మా - Sakshi

హెల్త్ మినిస్టర్ తనిఖీలు ... డాక్టర్లు డుమ్మా

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం విజయవాడలోని పాత ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా వైద్యులు సమయానికి ఆసుపత్రి రావడం లేదన్న విషయాన్ని కామినేని గుర్తించారు. ఈ విషయంపై ఆసుపత్రి ఆర్ఎంవోను నిలదీశారు. దాంతో ఆయన నీళ్లు నమిలారు.

దీంతో ఆగ్రహించిన కామినేని ఇలాంటి చర్యలు పునరావృతమైతే క్షమించేది లేదని మండిపడ్డారు.  మొత్తం 13 మంది వైద్యుల్లో 9 మంది విధులకు హాజరుకాలేదని మంత్రి కామినేని గుర్తించారు. వారందరికి ఛార్జి మెమో ఇవ్వాలని ఆర్ఎంవోను ఆదేశించారు. రికార్డులను కూడా కామినేని తనిఖీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement