పంచాయతీ కార్యదర్శి పరీక్ష నేడే పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో శనివారం జరగనున్న పంచాయతీ కార్యదర్శుల పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ 29 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మెత్తం 14,984 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు 29 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 10 మంది లైజనింగ్ అధికారులను, 29 మంది సహాయ లైజనింగ్ అధికారులను, 6 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామని వివరించారు. సుమారు 670 మంది ఇన్విజిలేటర్లను పరీక్షల నిర్వహణకు నియమించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశావుని పేర్కొన్నారు. పరీక్షలను లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అభ్యర్థులకు సూచనలివీ...
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 10 గంటల లోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి
10 గంటల తరువాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు
అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్ కలిగి ఉండాలి
హాల్‌టికెట్‌లో ఫొటో ప్రింట్ సరిగా లేకపోయినా, సరిగా కనపడకపోయినా గెజిటెడ్ అధికారి ఎటెస్ట్ చేసిన 3 పాస్‌పోర్టు సైజు ఫొటోలు తన వెంట పరీక్షా కేంద్రానికి తీసుకురావాలి
అభ్యర్థులు ప్యాడ్, బ్లూ లేక బ్లాక్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకురావాలి
సెల్‌ఫోన్‌లు, వైట్‌నర్, ఎరేజర్, బ్లేడు, చాక్‌పీసులు, కాలిక్యులేటర్ వంటి వాటిని పరీక్షా కేంద్రంలోకి తీసుకురాకూడదు
ఓఎంఆర్ ఒరిజినల్ షీట్లు తప్పనిసరిగా ఇన్విజిలేటర్లకు అందజేయాలి