మురుగు నుంచి విద్యుత్‌ | Sewage to electricity | Sakshi
Sakshi News home page

మురుగు నుంచి విద్యుత్‌

Published Wed, Aug 23 2023 4:38 AM | Last Updated on Wed, Aug 23 2023 4:38 AM

Sewage to electricity - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయవాడ: మురుగునీటి శుద్ధికి విజయవాడ నగర పాలక సంస్థ ప్రణాళిక ప్రకా­రం ముందుకెళ్తోంది. ఇప్పటికే ఉన్న మురు­గు­నీటి శుద్ధి ప్లాంట్ల(ఎస్టీపీ)ను ఆధునికీకరిస్తూనే.. పెరుగుతున్న జనాభాకు అను­గుణంగా కొత్త ప్లాంట్లను నెలకొల్పుతోంది. మరోవైపు ఈ ప్లాంట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ ఆదాయాన్ని ఆదా చేసుకునేలా ఏర్పాటు చేస్తోంది. నగరంలో 150 ఎంఎల్‌డీ సామర్థ్యంతో అజిత్‌సింగ్‌ నగర్, ఆటోనగర్, జక్కంపూడి, రామలింగేశ్వర్‌నగర్‌­లో రెండు ఎస్టీపీలు­న్నా­యి.

పెరుగుతున్న జనా­భా­కు అనుగుణంగా కొత్త­గా రామలింగేశ్వర్‌ నగర్‌లో 20 ఎంఎల్‌డీ, ఆటోనగర్‌లో 10 ఎంఎల్‌డీ సామర్థ్యంతో రెండు ఎస్టీపీలను నిర్మి­స్తున్నారు. ఈ ప్లాంట్లలో నీరు శుద్ధి చేసే సమ­యంలో వచ్చే మిథేన్‌ గ్యాస్‌ను స్క్రబ్బర్‌ మెషిన్ల ద్వారా శుద్ధి చేస్తారు. అందులోని తేమ, ఆమ్లాల­ను తీసేయగా వచ్చే మిథేన్‌ గ్యాస్‌కు టర్బెయి­న్‌లను అనుసంధానం చేస్తారు.

తద్వారా వి­ద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్‌ను అక్క­డ ఎస్‌టీపీలలోనే విని­యోగించుకోను­న్నా­రు. ప్రస్తుతం సింగ్‌నగర్, జక్కంపూడి, రామలింగేశ్వర్‌ నగర్‌లోని నాలుగు ఎస్‌­టీ­పీలకు స్క్రబ్బర్‌ మెషిన్లు ఏర్పాటు చేసి, మిథేన్‌ గ్యా­స్‌ను శుద్ధి చేయడం ద్వారా గ్యాస్‌ టర్బె­యిన్‌లకు అనుసంధానం చేస్తు­న్నా­రు. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి.

యునిడో సహకారంతో..
రామలింగేశ్వర్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన ఎస్టీపీ పాతది కావడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) సూచించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా దానిని ఆధునికీకరిస్తున్నారు. ఈ పనుల కోసం రూ.14.93 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందుకు యునైటెడ్‌ నేషన్స్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (యునిడో) సహకారం అందిస్తోంది. విజయవాడ కార్పొరేషన్‌కు రూ.10 కోట్ల నిధులను అందించింది. ఈ నిధులు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు బయో గ్యాస్‌ ప్లాంట్లను స్థాపించడంలో ఈ నిధులు కీలక భూమిక పోషిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థ నుంచి వచ్చిన స్థిరమైన పద్ధతులను అవలంబించడంతోపాటు, పర్యావరణ సవాళ్లను తగ్గించడంలో విజయవాడ కార్పొరేషన్‌కు ప్రత్యేక గుర్తింపు వస్తోంది.

నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాం
ఎస్టీపీల ఆధుని­కీ­కర­ణ పనులు నాణ్యతా ప్రమాణాలతో చేస్తు­న్నాం. సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వైపు విజయ­వాడ కార్పొరేషన్‌ అడుగులు వేస్తోంది. రూ.135 కోట్లతో ఎస్టీపీలను ఆధునికీ­కరిస్తున్నాం. మురుగు­నీటి నిర్వహణ క్లిష్టమైన సమస్య. దీనిని అధిగమించేందుకు ప్రయత్ని­స్తున్నాం. స్వచ్ఛమైన ఇంధన పరిష్కా­రాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎస్టీపీల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, ఆ విద్యుత్‌ను వాటికే వినియోగిస్తాం. – స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, కమిషనర్, విజయవాడ

ఎస్టీపీల ఆధునికీకరణ
గతంలో నిర్మించిన పాత ఎస్టీపీలను అమృత్, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.135 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ప్ర­తి ప్లాంట్‌ను ఆహ్లాదకరమైన ఇండస్ట్రియల్‌ వా­తా­వరణం కలిగి ఉండేలా తీర్చి­దిద్దు­తు­న్నా­రు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్లాంట్‌లలో సీసీ రోడ్లు, కాంపౌండ్‌ వాల్స్‌ నిర్మిస్తున్నారు. మరోవైపు నగరం పరిశుభ్రంగా ఉండేందుకు ప్రజల సహకారం తీసుకుంటున్నారు. రోడ్లు, డ్రెయిన్‌లలో చెత్త, వ్యర్థాలు వేయ­కుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement