విజయవాడ నగరంలోని కొత్తపేట చేపల మార్కెట్ ప్రాంతంలో ఆగంతకులు ఆదివారం కుప్పలుగా ఓటరు కార్డులను విడిచి వెళ్లారు. ఆదివారం దూది ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న రెండు బస్తాలను స్థానికులు తెరచి చూచారు. అందులో ఓటరు కార్డులు దర్శనమిచ్చాయి. ఓటరు కార్డులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఓటర్లవిగా స్థానికులు గుర్తించారు. దీనిపై స్థానికులు కార్పొరేషన్ అధికారులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆదివారం కావడంతో అధికారులు ఎవరూ అందుబాటులోకి రాలేదు. బస్తాల్లోని వోటరు కార్డులన్నీ 2009వ సంవత్సరానికి సంబంధించినవని స్థానికులు వెల్లడించారు.
Published Sun, Sep 13 2015 6:28 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement