అల్లాడిస్తున్న అప్రకటిత ‘కోత’
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : వాన రాకడా.. ప్రాణం పోకడా అనే చందంగా విద్యుత్ సరఫరా పరిస్థితి ఉందని ప్రజానీకం వాపోతున్నారు. కొద్ది రోజులుగా పల్లెల్లో, పట్టణాల్లో అప్రకటిత విద్యుత్ కోతలతో అలాం్లడిపోతున్నారు. విజయవాడ, నగరంతో పాటు, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల్లో వారం రోజులుగా ఈఎల్‌ఆర్ (ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో ) రోజుకు మూడు విడతలుగా కోత విధిస్తున్నారు. రాత్రిపూటకూడా ఎప్పుడు, కరెంటు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
మూతపడుతున్న రక్షిత మంచినీటి పథకాలు...
కాగా అప్రకటిత విద్యుత్ కోత వల్ల జిల్లా వ్యాప్తంగా రక్షిత మంచినీటి పథకాలు మూతపడుతున్నాయి. త్రీఫేజ్ సరఫరా లేకపోవటంతో మోటార్లు పనిచేయక మున్సిపల్, గ్రామపంచాయతీల్లో నీటిసరఫరా పథకాలు పనిచేయడంలేదు. ఫలితంగా విజయవాడ నగరంలో కొండ ప్రాంతాల్లో కొద్ది రోజులుగా మున్సిపల్ వాటర్ సరఫరా నిలిచిపోయింది. మెరక ప్రాంతాలకు మున్సిపల్ నీరు సరిగా రావటం లేదని ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు.
జిల్లాలో పెడన, గుడివాడ, ఉయ్యూరు, నూజివీడు, తిరవూరు,. జగ్గయ్యపేట, నందిగామ మున్సిపాలిటీలో కరెంటు కష్టాలతో ప్రజలు తల్లఢిల్లుతున్నారు. ఈక్రమంలో జిల్లా వ్యాప్తంగా 929 గ్రామ పంచాయతీల్లో, 49 మండలాల్లో మంచినీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుత్నుట్లు అధికారులు చెబుతున్నారు. మున్సిపల్ కేంద్రాలు, మండలాలు, గ్రామ పంచాయతీల్లో కొద్ది రోజులుగా నిర్ణీత సమయాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా కోత విధిస్తున్నారని ప్రజలువాపోతున్నారు.
అన్నదాతల అవస్థలు...
కాగా విద్యుత్ కోత వల్ల అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. త్రీపేజ్ సరఫరా సరిగా లేకపోవటంతో రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. పంటపొలాలకు సరిగా నీరు అందడం లేదని వాపోతున్నారు.
అప్రకటిత కోతలు అనివార్యం
విద్యుత్ ఉత్పత్తి, వినియోగం మధ్య వ్యతాసం రావటంతో ఎమర్జెన్సీలోడ్ రిలీప్ పేరుతో కోతలు విధించాల్సి వస్తోందని ఏపీఎస్‌పీడీసీఎల్ ఎస్.ఇ. మోహన్ కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. వేసవి ఎండలు, వాడ కం పెరగటం కొన్ని సందర్బాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కల్గినప్పుడు ఈఎల్‌ఆర్ విధించటం అనివార్యమన్నారు. విజయవాడ, మచిలీపట్నంలో మారిన షెడ్యూల్ ప్రకారం విద్యుత్ అధికారిక కోతలు ఈ విధంగా ఉన్నాయి.
విద్యుత్ కోత వేళలివే..
విజయవాడ నగరంలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు, తిరిగి రాత్రి 7-45 గంటల నుంచి 8-45 గంటల వరకు మడు విడతలుగా విద్యుత్ అదికారికంగా కోత విధిస్తారు.
జిల్లా ప్రధాన కేంద్రమైన మచిలీపట్నంలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటలవరకు, సాయంత్రం 6-45 గంటల నుంచి రాత్రి 7-45 గంటల వరకు కోత విధిస్తారు.