
అప్పడే పుట్టిన శిశువు ... చంపేసిన తల్లి
విజయవాడ: విజయవాడలోని కొత్త ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఓ నిండు గర్భిణి ప్రసవానికి బుధవారం ఉదయం ఆసుపత్రికి వచ్చింది. దాంతో సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో చేర్పించుకున్నారు. ఇంతో నొప్పులు మొదలు కావడంతో టాయిలెట్ అంటూ బాత్రూమ్కి వెళ్లింది. అక్కడ ఆడ శిశువును ప్రసవించింది. అనంతరం అక్కడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయింది. టాయిలెట్ వద్ద రక్తపు మడుగులో శిశువు మృతదేహం పడి ఉండటంతో సిబ్బంది వెంటనే ఆసుపత్రి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
యువతి కోసం సిబ్బంది ఆసుపత్రి పరిసర ప్రాంతాలలో గాలించిన ఫలితం కనిపించకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందనే కోపంతో యువతి శిశువును చంపేసి వెళ్లి పోయిందని పోలీసులు భావిస్తున్నారు. యువతి 108 వాహనంలో ఆసుపత్రికి వచ్చిందని సిబ్బంది తెలిపారు. దాంతో ఆ దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.