విజయవాడ: నగరంలోని కన్యకాపరమేశ్వరీ దేవాలయం సమీపంలోని ఓ నగల దుకాణంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో హుటాహుటిన ఘటన స్థాలానికి చేరుకుని... మంటలార్పుతున్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే షాపులో అగ్రిప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదంలో భారీగానే ఆస్తినష్టం సంభవించినట్లు షాపు యాజమాన్యం వెల్లడించింది.