విజయవాడలో యూఎస్ కాన్స్లేట్ | American consulate setup in Vijayawada city says Puneet talwar | Sakshi
Sakshi News home page

విజయవాడలో యూఎస్ కాన్స్లేట్

Published Tue, Dec 2 2014 12:09 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

విజయవాడలో యూఎస్ కాన్స్లేట్ - Sakshi

విజయవాడలో యూఎస్ కాన్స్లేట్

విజయవాడ:  విజయవాడలో అమెరికన్ కాన్స్లేట్ కార్యాలయం ఏర్పాటుకు ఆ దేశ రాజకీయ, మిలటరీ వ్యవహారాల కార్యదర్శి పునీత్ తల్వార్ సంసిద్ధత వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పునీత్ తల్వార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రంలో కాన్స్లేట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని చంద్రబాబు... పునీత్కు విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.

రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. డిసెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు పునీత్ భారత్లో పర్యటిస్తున్నారు. భారత్ పర్యటనలో భాగంగా పునీత్... భారత్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, రక్షణ మంత్రులతో కానున్నారు. ప్రాంతీయ, తీర రక్షణ భద్రత, వాణిజ్యంతోపాటు మరిన్ని అంశాలపై వ్యూహాత్మక సహకారంపై భారత్ ఉన్నతాధికారులతో పునీత్ చర్చలు జరపనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement