Puneet Talwar
-
'3 నెలల్లో రాజధాని నిర్మాణం ప్రారంభిస్తాం'
హైదరాబాద్ : మూడు నెలల్లో రాజధాని నిర్మాణం ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజధాని నిర్మాణానికి అమెరికా డిఫెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకుంటామని ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. మరోవైపు అమెరికన్ రాజకీయ, మిలటరీ వ్యవహారాల కార్యదర్శి పునీత్ తల్వార్ ...ఇవాళ చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన విషయం తెలిసిందే. -
విజయవాడలో యూఎస్ కాన్స్లేట్
విజయవాడ: విజయవాడలో అమెరికన్ కాన్స్లేట్ కార్యాలయం ఏర్పాటుకు ఆ దేశ రాజకీయ, మిలటరీ వ్యవహారాల కార్యదర్శి పునీత్ తల్వార్ సంసిద్ధత వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పునీత్ తల్వార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రంలో కాన్స్లేట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని చంద్రబాబు... పునీత్‌కు విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. డిసెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు పునీత్ భారత్‌లో పర్యటిస్తున్నారు. భారత్ పర్యటనలో భాగంగా పునీత్... భారత్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, రక్షణ మంత్రులతో కానున్నారు. ప్రాంతీయ, తీర రక్షణ భద్రత, వాణిజ్యంతోపాటు మరిన్ని అంశాలపై వ్యూహాత్మక సహకారంపై భారత్ ఉన్నతాధికారులతో పునీత్ చర్చలు జరపనున్నారు. -
పునీత్‌ను కీలక పదవికి నామినేట్ చేసిన ఒబామా
యూఎస్ పోలిటికల్ మిలటరీ ఎఫైర్స్‌లో అసిస్టెంట్ సెక్రటరీ పదవికి భారతీయ అమెరికన్ పునీత్ తల్వార్‌ను ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా నామినేట్ చేశారు. ఈ మేరకు అధ్యక్ష భవనం వైట్ హౌస్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. పునీత్‌ను ఆ పదవిలో నియమిస్తూ ఒబమా మంగళవారం నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ఆయన నియమాకాన్ని సెనేట్ ఆమోదించవలసి ఉందని పేర్కొంది. ఆయనతోపాటు మరో 29 మందిని ఒబామా దేశంలోని వివిధ ఉన్నతస్థానాల్లో నియమించారని చెప్పింది. వీరంతా తమ విధులను అంకితభావంతో పని చేస్తూ, వారివారి ప్రతిభ పాటవాల ద్వారా దేశ పురోగతికి పాటుపడతారని ఒబామా ఈ సందర్బంగా ఆకాంక్షించారని వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దేశంలో అత్యంత కీలకమై అటువంటి పదవిలో నియమితులైన రెండవ వ్యక్తిగా పునీత్ రికార్డు సృష్టించారు. గతంలో భారతీయ సంతతికి చెందిన నిషా దేశాయ్ బిశ్వాల్‌ను దక్షిణ మరియ మధ్య ఆసియా దేశాల అసిస్టెంట్ సెక్రటరీగా ఒబామా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.అంతర్జాతీయ భద్రత, మిలటరీ ఆపరేషన్స్, డిఫెన్స్ స్ట్రాటజీ, ప్రణాళిక, రక్షణ వాణిజ్యం తదిరత అంశాలను పునీత్ తల్వార్ పర్యవేక్షించనున్నారు. మధ్య ప్రాచ్యా దేశ వ్యవహారాల ముఖ్య సలహాదారునిగా గత నాలుగేళ్లుగా ఒబామా వద్ద పునీత్ విధులు నిర్వహించారు.