దుర్గ గుడి వద్ద 4 నెలలు ట్రాఫిక్ మళ్లింపు
Published Tue, Sep 12 2017 1:55 AM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM
విజయవాడ: కనకదుర్గ గుడి వద్ద ప్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో విజయవాడలో ఈనెల 11వ తేదీ నుంచి సుమారు 4 నెలల పాటు ఘాట్ రోడ్డు నుంచి గొల్లపూడి వైపు వెళ్లే అన్ని వాహనాలను మళ్లిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ డి.గౌతం సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ఆ దారిలో ఎటువంటి వాహనాలను అనుమతించబోమన్నారు. వాహన డ్రైవర్లు సహకరించాలని కోరారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా...
1. గొల్లపూడి, పున్నమిఘాట్, భవానీపురం నుంచి విజయవాడ సిటీలోకి వచ్చే ఇతర వాహనాలు..
► గొల్లపూడి–కబేళా–సి.వి.ఆర్ ఫ్లైఓవర్ –ఫ్లైఓవర్ మధ్య నుంచి డైవర్షన్ తీసుకుని చిట్టినగర్–కె.ఆర్.మార్కెట్ మీదుగా ప్రయాణించాలి.
► గొల్లపూడి–కబేళా–సి.వి.ఆర్. ఫ్లైఓవర్ మధ్య నుంచి డైవర్షన్ తీసుకుని చిట్టినగర్–ఎర్రకట్ట–బి.ఆర్.టి.ఎస్. రోడ్డు మీదుగా ప్రయాణించాలి.
► గొల్లపూడి–కబేళా–సి.వి.ఆర్., ఫ్లైఓవర్ – పైపుల రోడ్డు–ఆంధ్రప్రభ కాలనీ–ఎ.యస్. నగర్ ఫ్లైఓవర్ –బుడమేరు–మీదుగా ప్రయాణించాలి.
2. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి గొల్లపూడి వైపు వెళ్లే ఇతర వాహనాలు ..
► పోలీస్ కంట్రోల్ రూమ్–కె.ఆర్. మార్కెట్–చిట్టినగర్–సితార–గొల్లపూడి మీదుగా ప్రయాణించాలి.
► ఏలూరు రోడ్డు–బుడమేరు–ఎ.ఎస్.నగర్ ప్‌లై ఓవర్–ఆంధ్రప్రభ కాలనీ–వై.వి. రావు ఎస్టేట్–గొల్లపూడి మీదుగా రాకపోకలు సాగించాలి.
3. హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు....
► హైదరాబాద్–ఇబ్రహీంపట్నం–మైలవరం– నూజివీడు–హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నంకు మళ్లింపు.
4. ఏలూరు నుంచి హైదరాబాద్ వైపు..
► హనుమాన్ జంక్షన్–నూజివీడు–మైలవరం– ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్‌కు మళ్లింపు.
5. హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు...
► హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్లే భారీ వాహనాలు, లారీలు, బస్సులు–ఇబ్రహీంపట్నం– జి.కొండూరు–కందులపాడు క్రాస్ రోడ్డు– కొత్తూరు తాడేపల్లి–జక్కంపూడి లేఅవుట్– పాము ల కాలువ– వై.వి.రావు ఎస్టేట్ – రామవరప్పాడు రింగ్–బెంజ్సర్కిల్– వారధి మీదుగా ప్రయాణించాలి.
6. గుంటూరు నుంచి హైదరాబాద్ వైపు..
► గుంటూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలు, లారీలు, బస్సులు వారధి–బెంజ్ సర్కిల్–రామవరప్పాడురింగ్–వై.వి.రావు ఎస్టేట్– పాముల కాలువ–జక్కంపూడి లేఅవుట్ కొత్తూరు తాడేపల్లి–కందులపాడు క్రాస్ రోడ్డు–జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మీదుగా ప్రయాణించాలి.
భారీ వాహనాలు, వాహనాల డ్రైవర్లకు సూచన...
► హైదరాబాద్ నుంచి చైన్నై వెళ్లే భారీ వాహనాలు, లారీలు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందున నార్కట్‌పల్లి–మిర్యాలగూడ–పిడుగురాళ్ల–సత్తెనపల్లి మీదుగా ప్రయాణించాలి.
► చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే భారీవాహనాలు, లారీలు ఒంగోలు–మేదరమెట్ల–అద్దంకి–పిడుగురాళ్ల–మిర్యాలగూడ–నల్లగొండ–
నార్కట్‌పల్లి మీదుగా హైదరాబాద్ చేరుకోవాలి.
► విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు, లారీలు దేవరపల్లి–సత్తుపల్లి – తల్లాడ–ఖమ్మం–సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్లాలి.
► విశాఖపట్నం నుంచి చెన్నైకు వెళ్లే భారీ వాహనాలు, లారీలు హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ–పామర్రు–చల్లపల్లి–అవనిగడ్డ–బాపట్ల–ఒంగోలు మీదుగా చెన్నైకు వెళ్లాలి.
Advertisement