విజయవాడ : విజయవాడ భారతీనగర్ సమీపంలో 100 కేజీల గంజాయిని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. లారీలో గంజాయిని తరలిస్తుండగా పటమట పోలీసులు పట్టుకున్నారు. అయితే శుక్రవారం ఇబ్రహీంపట్నం వద్ద పోలీసుల తనిఖీల్లో మూడు టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. ఆ క్రమంలో భారతీనగర్లో టన్ను గంజాయి నిల్వ ఉన్నట్లు పోలీసులకు నిందితులు చెప్పారు. ఈ సమాచారం మేరకు దాడి చేసేందుకు సదరు ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. కాగా టన్ను గంజాయిని లారీలో అక్కడి నుంచి తరలించే క్రమంలో వారిని పోలీసులు పట్టుకున్నారు.