PVP Mall
-
ఖాదీ వాక్.. కిర్రాక్స్
-
పీవీపీలో మన్నర చోప్రా సందడి
విజయవాడ(లబ్బీపేట) : ఇటీవల విడుదలైన జక్కన సినిమాలోని నటి మన్నర చోప్రా గురువారం నగరంలోని పీవీపీ మాల్లో సందడి చేసింది. అక్కడ అప్పో ఎఫ్ 1ఎస్ మొబైల్‌ను ఆవిష్కరించేందుకు వచ్చిన ఆమెను చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపారు. మన్నర చోప్రా అప్పో ఎఫ్ 1ఎస్ మొబైల్‌ను ఆవిష్కరించి, ఆ మొబైల్‌తో సెల్ఫీ తీసి సందడి చేసింది. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకూ తాను చూసిన మొబైల్స్‌లో అప్పో ఎఫ్ 1ఎస్ అద్భుతంగా ఉందన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో సెల్ఫీలో చక్కటి ఆనందాన్ని ఈ ఫోన్ అందిస్తుందన్నారు. కెమెరా ఫోన్ టెక్నాలజీలో అప్పో అత్యుత్తమంగా ఉందన్నారు. కార్యక్రమంలో అప్పో జీఎం రే, హెడ్ కిమ్, డిస్ట్రిబ్యూటర్ భరత్‌కుమార్ పాల్గొన్నారు. -
చిన్న నగరాల్లోనూ సినీ పొలిస్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సినిమా ప్రదర్శన సంస్థల్లో ఒకటైన సినీపొలిస్ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో బహుముఖంగా విస్తరించనుంది. 2017 నాటికి దక్షిణ భారత రాష్ట్రాల్లో 180 కొత్త స్క్రీన్లు (థియేటర్లు) ప్రారంభించనున్నట్లు సినీపొలిస్ ఇండియా ఎండీ జవీర్ సొటోమెయర్ తెలిపారు. శుక్రవారమిక్కడ రామచంద్ర సీసీఎల్ మాల్లో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రోజురోజుకూ మల్టీప్లెక్స్‌కు ఆదరణ మెట్రో నగరాలకే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ విస్తరిస్తుందని అందుకే మధురై, హుబ్లి, కోయంబత్తూర్, వరంగల్ వంటి పట్టణాల్లోనూ సినీపొలిస్ మల్టీప్లెక్స్‌లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విజయవాడలోని పీవీపీ మాల్లో సినీపొలిస్‌కు 4 స్క్రీన్లున్నాయని.. ఇదే ప్రాంతంలో మరో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించడంతో పాటుగా విశాఖపట్నానికీ విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా సినీపొలిస్‌కు ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లలో అత్యథికంగా సందర్శకుల సంఖ్యను నమోదు చేస్తున్న మొదటి పది మల్టీప్లెక్స్ థియేటర్లలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందన్నారు. -
ఏపీ రాజధానిపై ఆరా తీసిన సచిన్!
భారతరత్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ విజయవాడ నగరం గురించి వాకబు చేశాడు. నగరంలో శుక్రవారం పీవీపీ మాల్ ప్రారంభోత్సవ కార్యాక్రమానికి అతడు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాను 20 ఏళ్ల కిందట క్రికెట్ ఆడటానికి వచ్చానని, అప్పటి బెజవాడకు, ఇప్పటికి ఉన్న తేడాను గమనిస్తూ సచిన్ ...పీవీపీని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం విడిపోయాక పరిస్థితులు, కొత్త రాజధానిపై సచిన్ ఆరా చేసినట్లు సమాచారం. కాగా కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరిలో సచిన్ పెద్ద ఎత్తున భూములు కొన్నట్లు ఓ రూమర్ హల్చల్ చేసింది. రాజధాని విజయవాడ - గుంటూరు మధ్యే ఉంటుందని ప్రచారం జోరందుకోవటంతో అతడు ఇక్కడ భూములు కొన్నాడని ప్రచారం జరిగింది. అయితే సచిన్ స్నేహితులు మాత్రం ఈ వార్తను కొట్టిపారేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సచిన్ ఒక్క సెంటు భూమి కూడా కొనలేదని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ వర్గాలు భూముల ధరను పెంచడానికే ఈ ప్రచారం చేసినట్లు వారు తెలిపారు. అయితే దీనిపై సచిన్ మాత్రం పెదవి విప్పలేదు. కాగా గతంలో నెల్లూరు జిల్లాలో సచిన్ భూములు కొన్న విషయం తెలిసిందే. -
విజయవాడలో సందడి చేసిన సచిన్, అనుష్క
విజయవాడ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, హీరోయిన్ అనుష్క శుక్రవారం విజయవాడ నగరంలో సందడి చేశారు. నగరంలోని పీవీపీ మాల్‌ను వారిద్దరు ప్రారంభించారు. సచిన్, అనుష్కలను చూసేందుకు వారి అభిమానులు భారీగా తరలివచ్చారు. దాంతో పీవీపీ మాల్ పరిసర ప్రాంతాలు సచిన్, అనుష్క అభిమానులతో కిక్కిరిసి పోయాయి. ఈ సందర్బంగా సోదరిసోదరీమణులారా అంటూ విజయవాడ ప్రజలను సచిన్ తెలుగులో పలకరించారు. సచిన్ వస్తున్న సందర్బంగా ట్రాఫిక్ పోలీసులు నగరంలో ఏటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో విజయవాడలోని బందరు రోడ్డు పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ తీవ్ర అటంకం ఏర్పడింది.