
నగరంలో ట్రాఫిక్ తగ్గించేందుకు కృషి : కేటీఆర్
హైదరాబాద్ : నగరంలో ట్రాఫిక్ తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లో జపనీస్ పార్కును వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్తో కలసి కేటీఆర్ ప్రారంభించారు. ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని వెల్లడించారు.
నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేదుకు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. అలాగే కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వరంలో రూ. 71 లక్షల వ్యయంతో జపనీస్ పార్కును నిర్మాణం చేశారు. అలాగే కేబీఆర్ పార్క్ వద్ద మల్టీ లెవల్ ఫ్లైఓవర్కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు.