Japanese Park
-
'నగరంలో ట్రాఫిక్ తగ్గించేందుకు కృషి'
-
నగరంలో ట్రాఫిక్ తగ్గించేందుకు కృషి : కేటీఆర్
హైదరాబాద్ : నగరంలో ట్రాఫిక్ తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లో జపనీస్ పార్కును వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో కలసి కేటీఆర్ ప్రారంభించారు. ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేదుకు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. అలాగే కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వరంలో రూ. 71 లక్షల వ్యయంతో జపనీస్ పార్కును నిర్మాణం చేశారు. అలాగే కేబీఆర్ పార్క్ వద్ద మల్టీ లెవల్ ఫ్లైఓవర్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. -
మన్మోహన్, షీలాలపై నిప్పులు చెరిగిన నరేంద్రమోడీ
కేంద్రంలోని యూపీఏ సర్కార్‌ను గద్దెదించేందుకు ప్రతినబూనాలిని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమెడీ యువతకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో ఉంది యూపీఏ డర్టీ టీమ్ అని అభివర్ణించారు. 2014 ఎన్నికల తర్వాత దేశానికి డ్రీమ్ టీమ్ రావాలని ఆయన ఆకాంక్షించారు. ఆదివారం న్యూఢిల్లీలోని జపనీస్ పార్క్‌లో బీజేపీ ఏర్పాట్ చేసిన వికాస్ ర్యాలీలో మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ యూపీఏ సర్కార్‌తోపాటు న్యూఢిల్లీలోని షీలా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మన్మోహన్ సింగ్ అసమర్థ ప్రధాని అని ఆయన ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పించడంలో యూపీఏ దారుణంగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వ అవినీతిని సుప్రీం కోర్టు ఎన్ని సార్లు తప్పుపట్టిన, తన తీరు మార్చుకోలేదన్నారు. అవినీతి అనేది యూపీఏ సర్కార్‌కు అలవాటుగా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. యూపీఏ పాలనలో భారత్‌ను చూసీ ప్రపంచ దేశాలు అపహాస్యం చేస్తున్నాయన్నారు. కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో ప్రభుత్వం పలు అక్రమాలకు పాల్పడి దేశం పరువు గంగలో కలిపారని అన్నారు. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా పర్యటనలో భాగంగా వ్యహారించిన తీరును మోడీ తప్పు పట్టారు. మన్మోహన్ యూఎస్ పర్యటనలో పేదరికాన్ని మార్కెట్ చేసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పేదరికాన్ని సినిమాల్లో చూపించి అవార్డులు అందుకునేవారిలా ప్రధాని వ్యవహారించారని మోడీ వ్యాఖ్యానించారు. అలాగే ఆ పర్యటనలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో మన్మోహన్ భేటీని మోడీ ఈ సందర్బంగా ప్రశ్నించారు. నవాజ్ షరీఫ్ ప్రధాని మన్మోహన్‌ను అవమానించేలా మాట్లాడారని అన్నారు. భారతదేశాన్ని వేలెత్తి చూపే సత్తా ప్రపంచంలో ఏ దాశానికి లేదన్నారు. ప్రధానికి సొంత పార్టీలోనే గౌరవం లభించకపోతే బయట వారు ఎలా గౌరవిస్తారని ఆయన ప్రశ్నించారు. యూపీఏ సర్కార్‌ను గద్దెదించేందుకు ప్రతినబూనాలిని మోడీ యువతకు పిలుపునిచ్చారు. యూపీఏ డర్టీ టీమ్ అని ఆయన అభివర్ణించారు. బొగ్గు, గ్యాస్ అందుబాటులో లేక అనేక విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డాయని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. యూపీఎ ప్రభుత్వ విఫలం అవడం వల్లే దేశంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందన్నారు. రైల్వేల అభివృద్దిలో జపాన్‌తో చైనా పోటీ పడుతోంది. మనం మాత్రం రైల్వే అభివృద్ధిలో ఎక్కడ ఉన్నం అని ఆయన ప్రశ్నించారు. యూపీఏ భాగస్వామ్య పార్టీలు సొంత ప్రభుత్వాలు నడుపుతున్నాయని ఆయన ఆరోపించారు. మోడీ న్యూఢిల్లీలోని షీలా ప్రభుత్వంపై విరుచుకుప్పడ్డారు. తల్లిదో ప్రభుత్వం, కొడుకుదో ప్రభుత్వం, అల్లుడిదో ప్రభుత్వం షీలాపై వ్యంగాస్త్రాలను సంధించారు. ఢిల్లీలో ఏం జరిగినా షీలా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహారిస్తోందని ఆరోపించారు. ఏలాంటి తప్పు జరిగిన అంతా కేంద్రంపైనే నెట్టివేస్తోందని అన్నారు. షీలా ప్రభుత్వానికి అది ఓ అలవాటు అని ఆయన వ్యాఖ్యానించారు. బయటకు వెళ్లిన ఆడపిల్లలు సాయంత్రం త్వరగా ఇంటికి చేరుకోవాలని షీలాదీక్షిత్ సలహా ఇస్తున్నారని మోడీ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అంతేకాని మహిళలపై దాడులను అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి పక్షవాతం వచ్చింది, అందుకే ఏ పనీ చేయట్లేదని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీ ఎంపికైన తర్వాతా న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న మొట్టమొదటి సభకు దాదాపు 5 లక్షల మంది ప్రజలు హాజరైయ్యారు. -
మోడీ ర్యాలీ కోసం కసరత్తు.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి హోదాలో నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ నెల 29న ఢిల్లీలో నిర్వహించనున్న ర్యాలీని విజయవంతం చేసేం దుకు స్థానిక పార్టీ నాయకులు కసరత్తును మొదలెట్టారు. ఇందుకోసం ఉత్తర ఢిల్లీ రోహిణిలోని జపనీస్ పార్క్‌లో రోజూ సమావేశమవుతున్నారు. ‘ప్రతి రోజు సమావేశమవుతున్నాం. ఈ ర్యాలీ సన్నాహాల్లో అందరూ నాయకులతో పాటు వాలంటీర్లు కూడా పాల్గొంటున్నార’ని ర్యాలీ ఏర్పాట్ల నిర్వాహకుడు, బీజేపీ సీనియర్ నాయకుడు విజేందర్ గుప్తా శనివారం విలేకరులకు తెలిపారు. ఇక్కడ ఏర్పాట్ల కోసం 2,000 మంది వాలంటీర్లు సహాయసహకారాలు అందిస్తున్నారు. భారీ మొత్తంలో ఎల్ఈడీ స్క్రీన్లు, సీసీ టీవీ కెమెరాలు, బ్యానర్లు, పార్కింగ్ స్థల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని చెప్పారు. ‘పార్క్ మొత్తం 25 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటుచేస్తున్నాం. స్టేజీకి దూరంగా ఉండే ప్రజలు కూడా నరేంద్ర మోడీని స్క్రీన్ ద్వారా చూసే అవకాశముంటుంద’ని గుప్తా వివరించారు. రోహిణికి రాని వారి కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో, మార్కెట్ ప్రదేశాల్లో 100 స్క్రీన్లు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. పార్క్‌కు సమీపంలో 5,000 కారులు, బస్సులు నిలిపేలా తాత్కాలిక పార్కింగ్ వసతి కల్పిస్తున్నామని తెలిపారు. భద్రత చర్యలకు ప్రాధాన్యమిస్తున్నామని, సీసీటీవీ కెమెరాలు, ప్రైవేట్ భద్రతాసిబ్బంది సహాయం తీసుకుంటున్నామని వివరించారు. భద్రత కారాణాల రీత్యా మోడీ విమానంలో వేదికకు చేరుకునే అవకాశముందన్నారు. ‘ఈ ర్యాలీకి కనీసం నాలుగు లక్షల మంది వస్తారని భావిస్తున్నాం. ఈ పార్క్ సామర్థ్యం నాలుగు నుంచి ఐదు లక్షల మేర ఉంటుంద’ని గుప్తా తెలిపారు. ఈ ర్యాలీలో అవినీతి, ధరల పెరుగుదల, శాంతి భద్రతలపైనే ప్రధాన ప్రస్తావన ఉంటుందని వివరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశముందని తెలిపారు.