మన్మోహన్, షీలాలపై నిప్పులు చెరిగిన నరేంద్రమోడీ | Narendra modi fires PM Manmohan Singh and Sheila Dikshit | Sakshi
Sakshi News home page

మన్మోహన్, షీలాలపై నిప్పులు చెరిగిన నరేంద్రమోడీ

Published Sun, Sep 29 2013 2:31 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

మన్మోహన్, షీలాలపై నిప్పులు చెరిగిన నరేంద్రమోడీ - Sakshi

మన్మోహన్, షీలాలపై నిప్పులు చెరిగిన నరేంద్రమోడీ

కేంద్రంలోని యూపీఏ సర్కార్ను గద్దెదించేందుకు ప్రతినబూనాలిని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమెడీ యువతకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో ఉంది యూపీఏ డర్టీ టీమ్ అని అభివర్ణించారు. 2014 ఎన్నికల తర్వాత దేశానికి డ్రీమ్ టీమ్ రావాలని ఆయన ఆకాంక్షించారు. ఆదివారం న్యూఢిల్లీలోని జపనీస్ పార్క్లో బీజేపీ ఏర్పాట్ చేసిన వికాస్ ర్యాలీలో మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ యూపీఏ సర్కార్తోపాటు న్యూఢిల్లీలోని షీలా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.


మన్మోహన్ సింగ్ అసమర్థ ప్రధాని అని ఆయన ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పించడంలో యూపీఏ దారుణంగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వ అవినీతిని సుప్రీం కోర్టు ఎన్ని సార్లు తప్పుపట్టిన, తన తీరు మార్చుకోలేదన్నారు. అవినీతి అనేది యూపీఏ సర్కార్కు అలవాటుగా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

యూపీఏ పాలనలో భారత్ను చూసీ ప్రపంచ దేశాలు అపహాస్యం చేస్తున్నాయన్నారు. కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో ప్రభుత్వం పలు అక్రమాలకు పాల్పడి దేశం పరువు గంగలో కలిపారని అన్నారు. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా పర్యటనలో భాగంగా వ్యహారించిన తీరును మోడీ తప్పు పట్టారు. మన్మోహన్ యూఎస్ పర్యటనలో పేదరికాన్ని మార్కెట్ చేసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పేదరికాన్ని సినిమాల్లో చూపించి అవార్డులు అందుకునేవారిలా ప్రధాని వ్యవహారించారని మోడీ వ్యాఖ్యానించారు.

 

అలాగే ఆ పర్యటనలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్తో మన్మోహన్ భేటీని మోడీ ఈ సందర్బంగా ప్రశ్నించారు. నవాజ్ షరీఫ్ ప్రధాని మన్మోహన్ను అవమానించేలా మాట్లాడారని అన్నారు. భారతదేశాన్ని వేలెత్తి చూపే సత్తా ప్రపంచంలో ఏ దాశానికి లేదన్నారు. ప్రధానికి సొంత పార్టీలోనే గౌరవం లభించకపోతే బయట వారు ఎలా గౌరవిస్తారని ఆయన ప్రశ్నించారు. యూపీఏ సర్కార్ను గద్దెదించేందుకు ప్రతినబూనాలిని మోడీ యువతకు పిలుపునిచ్చారు. యూపీఏ డర్టీ టీమ్ అని ఆయన అభివర్ణించారు.

 

బొగ్గు, గ్యాస్ అందుబాటులో లేక అనేక విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డాయని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. యూపీఎ ప్రభుత్వ విఫలం అవడం వల్లే దేశంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందన్నారు. రైల్వేల అభివృద్దిలో జపాన్తో చైనా పోటీ పడుతోంది. మనం మాత్రం రైల్వే అభివృద్ధిలో ఎక్కడ ఉన్నం అని ఆయన ప్రశ్నించారు.

యూపీఏ భాగస్వామ్య పార్టీలు సొంత ప్రభుత్వాలు నడుపుతున్నాయని ఆయన ఆరోపించారు. మోడీ న్యూఢిల్లీలోని షీలా ప్రభుత్వంపై విరుచుకుప్పడ్డారు. తల్లిదో ప్రభుత్వం, కొడుకుదో ప్రభుత్వం, అల్లుడిదో ప్రభుత్వం షీలాపై వ్యంగాస్త్రాలను సంధించారు. ఢిల్లీలో ఏం జరిగినా షీలా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహారిస్తోందని ఆరోపించారు. ఏలాంటి తప్పు జరిగిన అంతా కేంద్రంపైనే నెట్టివేస్తోందని అన్నారు. షీలా ప్రభుత్వానికి అది ఓ అలవాటు అని ఆయన వ్యాఖ్యానించారు.   


బయటకు వెళ్లిన ఆడపిల్లలు సాయంత్రం త్వరగా ఇంటికి చేరుకోవాలని షీలాదీక్షిత్ సలహా ఇస్తున్నారని మోడీ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అంతేకాని మహిళలపై దాడులను అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి పక్షవాతం వచ్చింది, అందుకే ఏ పనీ చేయట్లేదని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీ ఎంపికైన తర్వాతా న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న మొట్టమొదటి సభకు దాదాపు 5 లక్షల మంది ప్రజలు హాజరైయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement