ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలు, ఇంటర్మీడియెట్ కోర్సు నిర్వహించే కాంపోజిట్ డిగ్రీ కాలేజీలకు ఈ నెల 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులుంటాయని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.
పాఠశాలలకు 11 నుంచి.. జూనియర్ కాలేజీలకు 13 నుంచి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలు, ఇంటర్మీడియెట్ కోర్సు నిర్వహించే కాంపోజిట్ డిగ్రీ కాలేజీలకు ఈ నెల 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులుంటాయని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. 16వ తేదీన కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సెలవుల్లో ప్రైవేటు యాజమాన్యాలు తరగతులు నిర్వహించడానికి వీల్లేదని, నిర్వహిస్తే కాలేజీ యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలలకు ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు అకడమిక్ క్యాలెండర్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 16వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది.