38 కాలేజీల్లో జాబ్‌ గ్యారంటీ కోర్సులు | Job guarantee courses in 38 colleges Telangana | Sakshi
Sakshi News home page

38 కాలేజీల్లో జాబ్‌ గ్యారంటీ కోర్సులు

Published Wed, Sep 25 2024 5:38 AM | Last Updated on Wed, Sep 25 2024 5:38 AM

Job guarantee courses in 38 colleges Telangana

యూజీతోపాటు కొత్తగా నైపుణ్య డిగ్రీ కోర్సు.. బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సులున్న కాలేజీల జాబితా విడుదల  

ఇందులో 18 ఇంజనీరింగ్, 20 నాన్‌ ఇంజనీరింగ్‌  కాలేజీలు.. కోర్సు ముగిశాక ఆన్‌లైన్‌లోనే నేరుగా సెలెక్షన్‌ ప్రక్రియ 

నేడు సీఎం చేతుల మీదుగా ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కచ్చితమైన ఉపాధి కల్పించే ప్రయత్నాల్లో భాగంగా బ్యాంకింగ్, ఫైనాన్స్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ)రంగాల్లో డిమాండ్‌ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణీత కాలేజీల్లో ప్రస్తుత 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జాబ్‌ గ్యారంటీ కోర్సులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. 

రెగ్యులర్‌ డిగ్రీతోపాటు మినీ డిగ్రీ కోర్సుగా ‘బీఎఫ్‌ఎస్‌ఐ’ నైపుణ్య శిక్షణను అందించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 38 కాలేజీల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఉన్నత విద్యామండలి గుర్తించిన 18 ఇంజనీరింగ్‌ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో చదువుతున్న 10వేల మంది విద్యార్థులకు శిక్షణ అందనుంది. ఈ కాలేజీల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. 

ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్‌తో.. 
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ‘బీఎఫ్‌ఎస్‌ఐ’ కోర్సులు అందేవిధంగా కాలేజీలను ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జాబ్‌ డిమాండ్‌ ఉన్న బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ కోర్సు ఉపయోగపడనుంది. ఖరీదైన ఈ కోర్సును డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఉచితంగా అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 

ఈ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణను అందుకోనున్న 10 వేల మంది విద్యార్థుల వివరాలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్‌ను రూపొందిస్తోంది. విద్యార్థుల బయోడేటాతోపాటు చదువుతున్న కాలేజీ, వారి విద్యార్హతలు, సాంకేతిక కోర్సుల అనుభవం వివరాలన్నీ అందులో పొందుపరుస్తారు. బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో పేరొందిన కంపెనీలు తమకు అవసరమైన ఉద్యోగులను ఎంపిక చేసుకునేందుకు ఈ పోర్టల్‌ వారధిగా పనిచేయనుంది. ఆ కంపెనీలు ఈ పోర్టల్‌లో ఉన్న విద్యార్థులతో నేరుగా వీడియో కాల్‌ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ నైపుణ్యాలతో డిగ్రీ, ఇంజనీరింగ్‌లో కోర్సులు చేసిన విద్యార్థులకు ఉద్యోగ భరోసా దక్కనుంది. 

జాబితాలోని నాన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు ఇవే.. 
పింగళి ప్రభుత్వ మహిళా కాలేజీ– వడ్డేపల్లి, హన్మకొండ 
ఎస్‌ఆర్‌–బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ– ఖమ్మం 
నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల– నల్గొండ 
ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ, హైదరాబాద్‌ 
భవన్స్‌ డిగ్రీ అండ్‌ పీజీ కాలేజీ, హైదరాబాద్‌ 
ప్రభుత్వ సిటీ కాలేజీ, హైదరాబాద్‌ 
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సిద్దిపేట 
ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, బేగంపేట 
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఖైరతాబాద్‌ 
ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీ, నాంపల్లి 
నిజాం కాలేజీ, హైదరాబాద్‌ 
ఆర్‌బీవీఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీ, హైదరాబాద్‌ 
సెయింట్‌ ఆన్స్‌ మహిళా డిగ్రీ కాలేజీ, మెహదీపట్నం, హైదరాబాద్‌ 
సెయింట్‌ ఫ్రాన్సిస్‌ మహిళా డిగ్రీ కాలేజీ, హైదరాబాద్‌ 
సెయింట్‌ పియస్‌ ఎక్స్‌ మహిళా డిగ్రీ కాలేజీ, నాచారం హైదరాబాద్‌ 
తారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సంగారెడ్డి 
ఎంవీఎస్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ, మహబూబ్‌నగర్‌ 
ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ, కరీంనగర్‌ 
తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, కోఠి, హైదరాబాద్‌ 
గిరిరాజ్‌ ప్రభుత్వ కాలేజీ, నిజామాబాద్‌ 

జాబితాలోని ఇంజనీరింగ్‌ కాలేజీలు ఇవే.. 
బీవీఆర్‌ఐటీ హైదరాబాద్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ (జేఎన్‌టీయూహెచ్‌) 
జి.నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (జేఎన్‌టీయూహెచ్‌) 
గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్‌– టెక్నాలజీ కాలేజీ (జేఎన్‌టీయూహెచ్‌) 
జేబి ఇంజనీరింగ్‌– టెక్నాలజీ కాలేజీ (జేఎన్‌టీయూహెచ్‌) 
జేఎన్‌టీయూ కూకట్‌పల్లి ప్రధాన క్యాంపస్‌ (జేఎన్టీయూహెచ్‌) 
కేశవ్‌ మెమోరియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (జేఎన్‌టీయూహెచ్‌) 
మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (జేఎన్‌టీయూహెచ్‌) 
వర్ధమాన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ (జేఎన్‌టీయూహెచ్‌) 
వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌–టెక్నాలజీ (జేఎన్‌టీయూహెచ్‌) 
కిట్స్‌ వరంగల్‌ (కాకతీయ వర్సిటీ) 
చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఓయూ) 
మాతృశ్రీ ఇంజనీరింగ్‌ కాలేజీ (ఓయూ) 
మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్‌ కాలేజీ (ఓయూ) 
మెథడిస్ట్‌ ఇంజనీరింగ్‌– టెక్నాలజీ కాలేజీ (ఓయూ) 
ఉస్మానియా వర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ (ఓయూ) 
స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్‌– టెక్నాలజీ కాలేజీ (ఓయూ) 
ఆర్జీయూకేటీ బాసర (ఆర్జీయూకేటీ) 
బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, నర్సాపూర్‌ (జేఎన్టీయూహెచ్‌)   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement