
ఇక్కడ నిల్లు... అక్కడ ఫుల్లు!
బాహుబలి చిత్రం రిలీజ్ ఎఫెక్ట్ కళాశాలలపై పడింది. శుక్రవారం ఆ సినిమాను జోగిపేట థియేటర్‌లో కూడా రిలీజ్ చేయడంతో స్థానిక, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాలలు విద్యార్థులు లేక బోసిపోయాయి. తరగతి గదుల్లో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులే కనిపించారు. శుక్రవారం ఉదయం నుంచి రోడ్లపై విద్యార్థులు ఎవరూ కనిపించలేదు. ఉదయం 6 గంటలకే షో ప్రారంభించడంతో వారంతా ఉదయం నుంచే థియేటర్ల వద్ద బారులు తీరారు.