బెంగళూరు: బెంగళూరులో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.బెంగళూరులోని మూడు ప్రముఖ కాలేజీలకు శుక్రవారం బాంబు బెదిరింపు మెయిల్స్ రావటంతో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. బీఎంఎస్ కాలేజీ, ఎంఎస్ రామయ్య కాలేజీ, బీఐటీ కాలేజీలకు బాంబు బెదిరింపులు రావటంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Bengaluru Bomb Threat: Major Colleges, Including BIT, BMSCE and MSRIT Receive Bomb Threats; Probe Launchedhttps://t.co/BjoVZwox4e#Bengaluru #BIT #BombThreat
— LatestLY (@latestly) October 4, 2024
క్రెడిట్స్: LatestLY
సమాచారం అందిన వెంటనే ఆయా కాలేజీల్లో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ , ఇతర సంబంధిత బృందాలు సెర్చ్ చేస్తున్నాయి. అవి నిజమైన బెదిరింపులా లేదా ఉత్తుత్తి బెదిరింపులా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఈ బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపులకు సంబంధించి.. హనుమంతనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment