న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం దేశంలోని కాలేజీలు, విశ్వవిద్యాలయాలు సహా ఇతర విద్యాసంస్థలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. రానున్న విద్యాసంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఫీజుల్ని నగదు రూపంలో స్వీకరించరాదని కేంద్రం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సాహమిచ్చే దిశగా ఈ ఆదేశాలిచ్చింది. ఇకపై అన్ని ద్రవ్య లావాదేవీలు డిజిటల్ మోడల్ చెల్లింపుల ద్వారా పూర్తి చేయాలని అన్ని ఉన్నత విద్యా సంస్థలనను నరేంద్ర మోదీ ప్రభుత్వం కోరింది. క్యాంపస్‌లోని అన్ని క్యాంటీన్లు, ఇతర వ్యాపార సంస్థలు వారి బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో కలిపి భీమ్ యాప్ ఉపయోగించాలని సూచించింది.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిజిటల్ విధానంలో ఫీజుల్ని చెల్లించే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర మానవవనరుల శాఖ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ను ఆదేశించింది. క్యాంటీన్‌తో పాటు హాస్టల్‌లో అందిస్తున్న సేవలకు చెల్లింపుల కోసం ‘భీమ్’ యాప్‌ను వాడేలా విద్యార్థులను ప్రోత్సహించాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం యుపిసికి ఓ నోడల్ అధికారిని నియమించి, యూజీసీకి నెలవారీ రిపోర్టులు పంపాలని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది.
విద్యాసంస్థలకు కేంద్ర కీలక ఆదేశాలు
Published Wed, Jun 7 2017 8:23 PM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM
Advertisement