ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్‌లో విద్యా రుణాలు(ఎడ్యుకేషన్ లోన్స్)ను వేగంగా అందించేందుకు చర్యలు చేపట్టింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే వినియోగదారులకు రూ.10లక్షల నుంచి కోటి రూపాయలు అందించే ప్రణాళికను రూపకల్పన చేసింది. ‘ఇన్‌స్టా ఎడ్యుకేషన్ లోన్’ పేరిట నిబంధనలు, షరతులతో కొద్ది నిమిషాల్లోనే విద్యా రుణాలను అందించనుంది. పూర్తిగా డిజిటల్ పద్దతిలో విద్యా రుణాల ప్రక్రియను చేపట్టనుంది. దేశీయ, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు బ్యాంక్ రుణాలను మంజూరు చేస్తుంది. అయితే వినియోగదారులు తమ స్థిర డిపాజిట్ల(ఫిక్సడ్ డిపాజిట్స్)లో 90శాతం బ్యాంక్ రుణాలు పొందవచ్చు అని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. వేగంగా మంజూరు చేసే రుణాల వల్ల విద్యార్థులు ఎంతో ప్రయోజనం పొందుతారని ఐసీఐసీఐ తెలిపింది.
కాగా రుణాలు చెల్లించడానికి పది సంవత్సరాల కాలపరిమితిని బ్యాంక్ విధించింది. మరోవైపు ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80 ఇ ప్రకారం.. 8 సంవత్సరాల వరకు బ్యాంక్‌లో విద్యా రుణాలకు ఆదాయపు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. కాగా అంతర్జాతీయ సంస్థలలో ప్రవేశం పొందే విద్యార్థుల కోసం, బ్యాంక్ రుణాలు రూ. 10 లక్షల నుంచి రూ.కోటి వరకు, దేశీయ సంస్థలలో రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పొందవచ్చు.కాగా విద్యారుణాలను అప్లై చేయాలంటే..మొదటగా వినియోగదారులు ఐసీఐసీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అవ్వాలి.
ఆ తర్వాత బ్యాంక్ సైట్‌లో రుణాలకు సంబంధించిన ఆఫర్‌ను అధ్యయనం చేయాలి. వినియోగదారులకు కావాల్సిన రుణం, చెల్లించే కాలపరిమితి, ప్రవేశం పొందిన విశ్వవిద్యాలయం పేరు తదితర వివరాలను అప్లికేషన్ ఫార్మ్‌లో నమోదు చేయాలి. తరువాత విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్థితో సంబంధం వంటి వివరాలను నమోదు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాంక్‌కు సంబంధించిన నిబంధనలు, షరతులను అంగీకరిస్తే వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) ద్వారా బ్యాంక్ దృవీకరించిన నెంబర్ వస్తుంది. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాక, విద్యారుణాలు పొందిన మంజూరు లేఖను బ్యాంక్ వినియోగదారులకు అందిస్తుంది. (చదవండి: ‘బోగస్’తో బ్యాంక్‌కు టోకరా!)
Comments
Please login to add a commentAdd a comment