
జల్నా (ముంబై): కరోనా మహమ్మారి మూడవ వేవ్ ప్రారంభమైందని, ఇది జనవరి చివరి నాటి కి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే సోమ వారం అన్నారు. జల్నాలో సోమవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడు తూ, ప్రజలు కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. మహారాష్ట్రలో భారీగా కొత్త కేసులు నమోదవుతున్న తరుణంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘జాన్ హై తో జహాన్‌హై’ అన్న సామెతను అందరూ దృష్టి లో పెట్టుకోవాలని ఆయన సూచించారు.
చదవండి: (ఇదే కొనసాగితే లాక్‌డౌన్ అమలు చేయక తప్పదు!)
పెరుగుతున్న కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకునే పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని నిర్ణయించామని, ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు మద్దతునివ్వాలని ఆయన కోరారు. మహమ్మారి తీవ్రత గు రించి సోమవారం వర్చువల్ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాతో కూడా చర్చించినట్టు తోపే చెప్పారు. కరోనా సంసిద్ధతలో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్‌లకు మరమ్మతులు చేస్తున్నామని, 60 ఏళ్లు దాటిన వారికి, వైద్య, ఆరోగ్య సిబ్బందికి బూస్టర్ డోస్‌లను వేగవంతం చేస్తున్నామని ఆయన తెలిపారు.
15–18 సంవత్సరాల మధ్య పిల్లలకు త్వరలోనే టీకాలు వేయడం పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 17 వేల ఆక్సిజన్ పడకల్లో నాలుగు శాతం మాత్రమే ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయని చెప్పారు. 14 రోజుల క్వారంటైన్ వ్యవధిని కూడా ఏడు రోజులకు కుదించినట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment