ర్యాగింగ్‌ చేస్తే... | Academic Year Begins, Ragging Awareness Programs Underway | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్‌ చేస్తే...

Published Wed, Jun 19 2019 11:59 AM | Last Updated on Wed, Jun 19 2019 12:02 PM

Academic Year Begins, Ragging Awareness Programs Underway - Sakshi

ఇలా స్నేహహస్తం అందించాలి.. : జూనియర్లకు స్వాగతం పలుకుతున్న సీనియర్లు 

సాక్షి, రాజమహేంద్రవరం క్రైం: విద్యాలయాల్లో ర్యాగింగ్‌ వెర్రితలలు వేస్తోంది. కొత్తగా కళాశాలలకు వచ్చే విద్యార్థులను సీనియర్లు వేధించడం షరా మామూలుగానే మారింది. ర్యాగింగ్‌ పేరుతో వేధింపులకు పాల్పడకూడదని చట్టాలున్నా అవి అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో ర్యాగింగ్‌ మహమ్మారిని అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. విద్యాసంవత్సరం మొదలు కావడంతో ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమాలు  చేపడుతున్నారు. ర్యాగింగ్‌ వల్ల కలిగే దుష్ఫలితాలను వివరిస్తున్నారు.
                                                                                       
ర్యాగింగ్‌ అంటే..
1997 చట్టం ప్రకారం ర్యాగింగ్‌ అంటే విద్యార్థికి అవమానం, బాధ, భయం, భీతి, దిగులు, జడుపు, దురుద్దేశపూరితమైన పనులు, గాయాలకు కారణమైన, కారణం కాబోయే చర్యలు చేస్తే ర్యాగింగ్‌ కిందకు వస్తుంది. సెక్షన్‌ 4 ఏపీ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ర్యాగింగ్‌ యాక్ట్‌ 1997 ప్రకారం ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్షార్హులు అవుతారు. 

మహిళా చట్టాలు.. 
⇔ సెక్షన్‌ 509 ఐపీసీ: మహిళలతో మాటలతో, సైగలతో, చేష్టలతో, అవమానపరిచినా, అల్లరి పెట్టినా ఒక సంవత్సరం నుంచి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా. రెండూ పడే అవకాశం. 
⇔ సెక్షన్‌ 294 ఐపీసీ: అశ్లీల, అభ్యంతరకరమైన ప్రవర్తన, పాటలు పాడడం, 
⇔ సెక్షన్‌ 354 ఐపీసీ : అత్యాచారం కు ప్రయత్నించడం లేదా మర్యాదకు భగం కలిగేలా ప్రవర్తించడం 
⇔ మహిళలను దురుద్దేశంతో తాకినా, కోరిక తీర్చమని అడిగినా, లైంగికపరమైన చిత్రాలు, వీడియోలు, చూపించినా మూడేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. 
⇔ మహిళలపై దాడి చేసినా లేదా బల ప్రయోగం చేసినా, అత్యాచార యత్నం చేసినా, దురుద్దేశంతో వస్త్రాలు తొలగించినా ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. 
⇔ ఎవరైనా మహిళ అంతరంగికమైన జీవితానికి ప్రైవేటు(లైఫ్‌)కు సంబందించిన దృశ్యాలను రహస్యంగా చూసినా, చిత్రీకరించినా ఏడాది నుంచి ఏడేళ్ల జైలు శిక్ష , జరిమానా విధిస్తారు. 
⇔ మహిళ అభీష్టానికి వ్యతిరేకంగా ఆమెను అనుసరించినా, తాకడానికి ప్రయత్నించినా ఈమెయిల్, ఇంటర్నెట్, తదితర సాధనాల ద్వారా ఆమెను సంప్రదించినా మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు          శిక్ష విధిస్తారు. 

ప్రొటక్షన్‌ ఆఫ్‌ చిల్ట్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫెన్సెస్‌ యాక్ట్‌ 2012
బాలికలను లైంగికపరమైన ఉద్దేశంతో తాకినా, వేధింపులకు గురి చేసినా, దాడి చేసినా, శరీరంలోకి చొచ్చుకుపోయే ఆయుధాలు, వస్తువులు, అగ్నివంటి వాటితో దాడికి గురి చేసినా, మారణాయుధాలతో దాడి చేసినా, గాయపరిచినా, ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలో అసభ్యంగా చిత్రీకరించినా, శరీరకంగా, మానసికంగా ఎవరైనా నేరాలను ప్రోత్సహించినా ఏడాది నుంచి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తారు. 

బాధితులు సంప్రదించాల్సి నంబర్లు..
పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ : 100, 1090, 1091 
డీఎస్పీ మహిళా పోలీస్‌ స్టేషన్‌  9490760792

ర్యాగింగ్‌కు పాల్పడితే..
⇔ వేధించడం, అవమానించడం చేస్తే ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. వెయ్యి జరిమానా లేదా రెండూ విధిస్తారు. కొట్టడం, బలవంతం చేయడం, హెచ్చరించడం చేస్తే సంవత్సరం జైలు శిక్ష లేదా రూ.           2000 జరిమానా, రెండూ విధించవచ్చు. అక్రమ నిర్బంధం, అడ్డుకోవడం, గాయపరచడం చేస్తే రెండేళ్ల జైలు శిక్ష, రూ.ఐదు వేల జరిమానా లేదా రెండూ విధిస్తారు.
⇔ హత్య చేయడం, ఆత్మహత్యకు ప్రేరేపించడం చేస్తే పదేళ్ల జైలు శిక్ష రూ.50 వేలు జరిమానా విధిస్తారు.

యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు ఏర్పాటు చేస్తాం 
ప్రతి కాలేజీలో, విద్యా సంస్థల్లో య్యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఆ సంస్థలో చదివే విద్యార్థులతో ఒక కమిటీ వేసి ఒకవేళ ర్యాగింగ్‌ లాంటి సంఘటనలు జరిగితే ఎవరి పాత్ర ఎంత ఉంది అనేది దర్యాప్తు చేస్తాం. విద్యార్థుల పట్ల ర్యాగింగ్‌కు పాల్పడితే కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. 
– లతా మాధురి, అడిషనల్‌ ఎస్పీ, రాజమహేంద్రవరం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement