Seniors raging
-
వరంగల్ కేఎంసీలో ర్యాగింగ్!
ఎంజీఎం: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)ను ర్యాగింగ్ భూతం వెంటాడుతోంది. ఈ కళాశాలలో పీజీ వైద్యవిద్య చదువుతున్న ప్రీతి మృతి చెందిన విషయాన్ని ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న క్రమంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కేఎంసీలో రాజస్తాన్‌కు చెందిన మనోహర్ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 14న కళాశాల లైబ్రరీలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు చదువుకుని హాస్టల్ గదికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఓ సీనియర్ విద్యార్థి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న 15 మంది విద్యార్థుల కళ్లు మనోహర్‌పై పడ్డాయి. అతడిని దగ్గరికి పిలిచి మద్యం తాగించి, నృత్యాలు చేయించారు. సీనియర్లు ఎంతకీ వదలకుండా వేధిస్తుండగా ఎదురుతిరిగాడు. దీంతో అతడిని వారు దారుణంగా చితకబాదారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థి ఈ నెల 15న తల్లిదండ్రుల సహాయంతో ప్రిన్సిపాల్‌కు, మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ ర్యాగింగ్ ఘటనలో గాయపడ్డ మనోహర్‌ను వెంటనే ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చారు. ర్యాగింగ్ విషయాన్ని ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ డీఎంఈకి వివరించగా కళాశాల అంతర్గత కమిటీతో విచారణ చేపట్టారు. 10 మంది విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు విచారణలో నిర్ధారించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సదరు విద్యార్థులను సంవత్సరంపాటు సస్పెండ్ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కేఎంసీ అధికారులపై ఒత్తిళ్లు మొదలైనట్లు తెలుస్తోంది. ఘటనపై అంతర్గత విచారణ చేస్తున్నామని, ర్యాగింగ్ జరిగినట్లు రుజువైతే ఆ విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలిపారు. -
IBS ర్యాగింగ్ కేసులో వెలుగు చూస్తున్న మరిన్ని నిజాలు
-
వీళ్లా డాక్టర్లయ్యేది? ర్యాగింగ్ చేసినందుకు కెరీర్ నాశనం
భోపాల్: ర్యాగింగ్ నెపంతో జూనియర్లను లైన్లో నిల్చోబెట్టి చెంపదెబ్బలు కొట్టిన సీనియర్ వైద్య విద్యార్థులపై కేసు నమోదైంది. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఏడుగురు విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది కాలేజీ యాజమాన్యం. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జులై 28న మధ్యప్రదేశ్ రత్లాంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన జరిగింది. సీనియర్ విద్యార్థులు జూనియర్లను వరుసగా నిల్చోబెట్టి చెంపదెబ్బలు కొట్టారు. వారితో దారుణంగా ప్రవర్తించారు. వద్దని చెప్పేందుకు వెళ్లిన హాస్టల్ వార్డెన్‌పైకి వాటర్ బాటిల్స్ విసిసారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇలాంటి విద్యార్థులా డాక్టర్లయ్యేది అని విమర్శలు వెల్లువెత్తాయి. How these idiots are going to become doctors? Who gave rights to these seniors to slap their Junior's ? & we are saying #ragging in banned? These so called seniors immediately needs to be put behind the bars😡 Video: #Ratlam #Medical #Collage of #MP#MBBS #MedTwitter #NEETUG2022 pic.twitter.com/Z3KNRxmn0u — Vivek pandey (@Vivekpandey21) July 30, 2022 ర్యాగింగ్ ఘటనపై హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు మేరకు ఏడుగురు సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం వీరందరినీ ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్లు కాలేజ్ డీన్ ప్రకటించారు. అంతకుముందు ఇండోర్‌లోని మహాత్మాగాంధీ మెడికల్ కాలేజీలో దారుణమైన ర్యాగింగ్ ఘటన వెలుగుచూసింది. సీనియర్ విద్యార్థులు తమపై వికృత చర్యలకు పాల్పడ్డారని జూనియర్ విద్యార్థులు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్‌కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఘటనపై సీరియస్ అయిన యూజీసీ.. ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చదవండి: ‘హ్యాపీడేస్’ మూవీని మించిన ర్యాగింగ్.. జూనియర్ అమ్మాయిలతో ఇంత దారుణమా.. -
ర్యాగింగ్ చేస్తే...
సాక్షి, రాజమహేంద్రవరం క్రైం: విద్యాలయాల్లో ర్యాగింగ్ వెర్రితలలు వేస్తోంది. కొత్తగా కళాశాలలకు వచ్చే విద్యార్థులను సీనియర్లు వేధించడం షరా మామూలుగానే మారింది. ర్యాగింగ్ పేరుతో వేధింపులకు పాల్పడకూడదని చట్టాలున్నా అవి అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో ర్యాగింగ్ మహమ్మారిని అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. విద్యాసంవత్సరం మొదలు కావడంతో ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ర్యాగింగ్ వల్ల కలిగే దుష్ఫలితాలను వివరిస్తున్నారు. ర్యాగింగ్ అంటే.. 1997 చట్టం ప్రకారం ర్యాగింగ్ అంటే విద్యార్థికి అవమానం, బాధ, భయం, భీతి, దిగులు, జడుపు, దురుద్దేశపూరితమైన పనులు, గాయాలకు కారణమైన, కారణం కాబోయే చర్యలు చేస్తే ర్యాగింగ్ కిందకు వస్తుంది. సెక్షన్ 4 ఏపీ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ 1997 ప్రకారం ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్షార్హులు అవుతారు. మహిళా చట్టాలు.. ⇔ సెక్షన్ 509 ఐపీసీ: మహిళలతో మాటలతో, సైగలతో, చేష్టలతో, అవమానపరిచినా, అల్లరి పెట్టినా ఒక సంవత్సరం నుంచి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా. రెండూ పడే అవకాశం. ⇔ సెక్షన్ 294 ఐపీసీ: అశ్లీల, అభ్యంతరకరమైన ప్రవర్తన, పాటలు పాడడం, ⇔ సెక్షన్ 354 ఐపీసీ : అత్యాచారం కు ప్రయత్నించడం లేదా మర్యాదకు భగం కలిగేలా ప్రవర్తించడం ⇔ మహిళలను దురుద్దేశంతో తాకినా, కోరిక తీర్చమని అడిగినా, లైంగికపరమైన చిత్రాలు, వీడియోలు, చూపించినా మూడేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. ⇔ మహిళలపై దాడి చేసినా లేదా బల ప్రయోగం చేసినా, అత్యాచార యత్నం చేసినా, దురుద్దేశంతో వస్త్రాలు తొలగించినా ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ⇔ ఎవరైనా మహిళ అంతరంగికమైన జీవితానికి ప్రైవేటు(లైఫ్)కు సంబందించిన దృశ్యాలను రహస్యంగా చూసినా, చిత్రీకరించినా ఏడాది నుంచి ఏడేళ్ల జైలు శిక్ష , జరిమానా విధిస్తారు. ⇔ మహిళ అభీష్టానికి వ్యతిరేకంగా ఆమెను అనుసరించినా, తాకడానికి ప్రయత్నించినా ఈమెయిల్, ఇంటర్నెట్, తదితర సాధనాల ద్వారా ఆమెను సంప్రదించినా మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ప్రొటక్షన్ ఆఫ్ చిల్ట్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్ యాక్ట్ 2012 బాలికలను లైంగికపరమైన ఉద్దేశంతో తాకినా, వేధింపులకు గురి చేసినా, దాడి చేసినా, శరీరంలోకి చొచ్చుకుపోయే ఆయుధాలు, వస్తువులు, అగ్నివంటి వాటితో దాడికి గురి చేసినా, మారణాయుధాలతో దాడి చేసినా, గాయపరిచినా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో అసభ్యంగా చిత్రీకరించినా, శరీరకంగా, మానసికంగా ఎవరైనా నేరాలను ప్రోత్సహించినా ఏడాది నుంచి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తారు. బాధితులు సంప్రదించాల్సి నంబర్లు.. పోలీస్ కంట్రోల్ రూమ్ : 100, 1090, 1091 డీఎస్పీ మహిళా పోలీస్ స్టేషన్ 9490760792 ర్యాగింగ్‌కు పాల్పడితే.. ⇔ వేధించడం, అవమానించడం చేస్తే ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. వెయ్యి జరిమానా లేదా రెండూ విధిస్తారు. కొట్టడం, బలవంతం చేయడం, హెచ్చరించడం చేస్తే సంవత్సరం జైలు శిక్ష లేదా రూ. 2000 జరిమానా, రెండూ విధించవచ్చు. అక్రమ నిర్బంధం, అడ్డుకోవడం, గాయపరచడం చేస్తే రెండేళ్ల జైలు శిక్ష, రూ.ఐదు వేల జరిమానా లేదా రెండూ విధిస్తారు. ⇔ హత్య చేయడం, ఆత్మహత్యకు ప్రేరేపించడం చేస్తే పదేళ్ల జైలు శిక్ష రూ.50 వేలు జరిమానా విధిస్తారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తాం ప్రతి కాలేజీలో, విద్యా సంస్థల్లో య్యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఆ సంస్థలో చదివే విద్యార్థులతో ఒక కమిటీ వేసి ఒకవేళ ర్యాగింగ్ లాంటి సంఘటనలు జరిగితే ఎవరి పాత్ర ఎంత ఉంది అనేది దర్యాప్తు చేస్తాం. విద్యార్థుల పట్ల ర్యాగింగ్‌కు పాల్పడితే కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. – లతా మాధురి, అడిషనల్ ఎస్పీ, రాజమహేంద్రవరం -
ఫార్మసీ కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్..
నల్లగొండ: సూర్యాపేట వికాస్ ఫార్మసీ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ వ్యవహారం కలకలం సృష్టించింది. థర్డ్ ఇయర్ స్టూడెంట్ సాయికిరణ్‌పై సీనియర్లు ర్యాంగింగ్కు పాల్పడ్డారు. సీనియర్లు కొట్టడంతో విద్యార్థి సాయికిరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. దాంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.