సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న ఏకకాలంలో తొమ్మిది జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లా కేంద్రాల్లో కనీసం 15 వేల నుంచి 20 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభం నేపథ్యంలో శుక్రవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీ రామారావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ నెల 15న జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఈ నెల 15న ఏదో ఒక చోట కొత్త మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారని, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు కామా రెడ్డిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని కేటీఆర్ తెలిపారు. దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. మంత్రి హరీశ్ మాట్లాడుతూ ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లను కలిగి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment