సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీల్లో ర్యాగింగ్‌పై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీవ్రంగా స్పందించింది. కాలేజీల ఆవరణలో ర్యాగింగ్ నిరోధానికి, ర్యాగింగ్‌కు పాల్పడే వారిని గుర్తించి కఠినంగా శిక్షించేందుకు అవసరమైన పక్కా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లోని యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లకు ఆదేశాలు జారీ చేసింది. ర్యాగింగ్ నిరోధానికి గతంలో జారీ చేసిన నిబంధనలకు సవరణలు చేసింది. ప్రతి విద్యార్థి ర్యాగింగ్ నిరోధానికి కట్టుబడి ఉంటామని ప్రతి విద్యార్థి, వారి తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో విద్యాసంస్థలకు ప్రతి విద్యా సంవత్సరం అండర్‌టేకింగ్ ఇచ్చేలా కచ్చితమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఇటీవల రాష్ట్రంలోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో (ఇఫ్లూ) విద్యార్థినిపై రేప్ జరగడం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ ర్యాగింగ్ నిరోధానికి కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. యూజీసీ ఆదేశాలను పక్కాగా అమలు చేసేలా విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు.
కాలేజీల్లో ర్యాగింగ్‌పై యూజీసీ ఆగ్రహం
Published Mon, Nov 10 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM
Advertisement