అనుమతి లేని కాలేజీ హాస్టళ్లకు షోకాజ్ నోటీస్‌లు
Published Mon, May 1 2017 11:06 PM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM
– సాక్షి కథనానిక స్పందన
కర్నూలు సిటీ: జిల్లాలో అనుమతి లేకుండా ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీలతో పాటు హస్టళ్లను సైతం నిర్వహిస్తున్న కాలేజీలపై గత నెల 29న ‘వసతి కిరికిరి’ అనే కథనానికి ఇంటర్మీడియేట్ బోర్డు అధికారులు స్పందించారు. ఈ మేరకు బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి వై.పరమేశ్వరరెడ్డి నారాయణ కాలేజీలకు చెందిన మూడు, శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన 4 కాలేజీలకు, మరో 13 సాధారణ కాలేజీలకు షోకాజ్ నోటీస్‌లు జారీ చేశారు. జిల్లాలో రావూస్ కాలేజీకి హాస్టల్ అనుమతి ఉందన్నారు. ఏడాదికి రెండు సార్లు ప్రైవేటు కాలేజీలను తనిఖీలు చేస్తామన్నారు. ఈ నెల 5వ తేదిలోపు నిర్దిష్టమైన సమాధానం ఇవ్వాలని.. లేని పక్షంలో ఆయా కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని పరమేశ్వరరెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement