
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరానికి గాను కళాశాలల గుర్తింపు, అదనపు సెక్షన్లు, సీట్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే గడువును ఇంటర్మీడియెట్ బోర్డు పెంచింది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫిబ్రవరి 12 లోపు కళాశాలల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ.అశోక్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
రూ.3 వేల అపరాధ రుసుముతో ఫిబ్రవరి 25 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో మార్చి 8 వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో మార్చి 20 వరకు దర ఖాస్తు చేసుకోవచ్చన్నారు. కళాశాలల ప్రాంగణాల మార్పు, సొసైటీలు, కళాశాలల పేర్ల మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా మార్చి 20 లోపు అందజేయాలని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment