కళాశాలల్లో బంద్‌లపై నిషేధం
కళాశాలల్లో బంద్‌లపై నిషేధం
Published Sat, Apr 1 2017 8:11 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM
లక్నో: ఉద్యోగులు, ఉపాధ్యాయులు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో బంద్‌లు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్మా చట్టం కింద ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది జూన్ 30 వరకూ నిషేధం కొనసాగనుంది. ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించిన వారిని పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్టు చేయోచ్చు. పబ్లిక్ ఇన్‌ట్రస్ట్‌తోనే మూడు నెలల పాటు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో నిరసన కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్లు హైయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేంద్ర కుమార్ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 18 విశ్వవిద్యాలయాలు, దాదాపు నాలుగు వేల ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి.
Advertisement