మూడోరోజు 8 మ్యాచ్‌లు
మూడోరోజు 8 మ్యాచ్‌లు
Published Wed, Mar 22 2017 10:46 PM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM
భానుగుడి(కాకినాడ) : ఎన్టీఆర్ వైద్య విద్యాలయం ఆధ్వర్యంలో రంగరాయ మెడికల్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న అంతర్ వైద్యకళాశాలల క్రికెట్ పోటీల్లో మూడో రోజైన బుధవారం వివిధ కళాశాలల జట్ల మధ్య 8 మ్యాచ్‌లు జరిగాయి. 20–20 పద్ధతిలో జరుగుతున్న ఈ పోటీలలో 8 జట్లు ఇంటిబాట పట్టాయి. రంగరాయ మెడికల్ కళాశాల పీడీ డాక్టర్ స్పర్జన్ రాజు పోటీలను పర్యవేక్షిస్తున్నారు. మూడో రోజు పోటీలను రంగరాయ ప్రిన్సిపాల్ ఆర్.మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాఘవేంద్రరావు ప్రారంభించారు.
మూడోరోజు విజేతలు వీరే
మమత డెంటల్ కళాశాల( కర్నూలు)పై రంగరాయ వైద్య కళాశాల (కాకినాడ), నారాయణ మెడికల్ కాలేజ్ (నెల్లూరు) పై ఆశ్రం వైద్య కళాశాల( ఏలూరు), కోనసీమ మెడికల్ కళాశాల (అమలాపురం)పై కాటూరి మెడికల్ కాలేజ్ ( గుంటూరు), సీకేఎస్ తేజ డెంటల్‌కాలేజ్ తిరుపతిపై గుంటూరు మెడికల్ కళాశాల, నిమ్‌రా మెడికల్ కళాశాల (విజయవాడ)పై శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల (తిరుపతి), ప్రభుత్వ డెంటల్ కళాశాల విజయవాడపై ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాల విశాఖ పట్నం, లెనోరా డెంటల్ కాలేజ్(రాజానగరం)పై ఉస్మానియా మెడికల్ కళాశాల (హైదరాబాద్)లు, రిమ్స్ కాకతీయ మెడికల్ కళాశాల వరంగల్‌పై రిమ్స్ కడప విజయం సాధించాయి. రేపటి నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు స్పర్జన్‌రాజు పేర్కొన్నారు.
Advertisement
Advertisement