అంతర్‌వైద్య కళాశాలల క్రికెట్ పోటీలు ప్రారంభం
అంతర్‌వైద్య కళాశాలల క్రికెట్ పోటీలు ప్రారంభం
Published Mon, Mar 20 2017 10:42 PM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM
తెలంగాణ, ఆంధ్రా నుంచి పాల్గొన్న 42 జట్లు
భానుగుడి(కాకినాడ) : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంతర్ వైద్యకళాశాలల పురుషుల క్రికెట్ పోటీలు సోమవారం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల క్రీడా మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలను వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు, రంగరాయమెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ ప్రారంభించారు. రెండు రాష్ట్రాల వైద్యకళాశాలల క్రికెట్ పోటీలను ఎన్టీఆర్ యూనివర్సిటీ నిర్వహించడం ఆనందదాయకమన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దక్షిణ భారత క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు నగదు ప్రోత్సాహం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి మాట్లాడుతూ ఈ పోటీలకు ఉభయ రాష్ట్రాలకు చెందిన 42 జట్లు పాల్గొన్నాయని రంగరాయ మెడికల్ కళాశాల అతిపెద్ద క్రీడా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. 20–20 పద్ధతిలో జరుగుతున్న ఈ పోటీల్లో తొలిరోజు 42 జట్లకు 18 జట్లకు మాత్రమే క్రీడా పోటీలు జరిగాయి. ఇందులో గెలిచిన తొమ్మిది జట్లు క్వార్టర్ దశకు చేరాయి. క్రీడాకారులకు, పీడీలకు వసతి, భోజన సౌకర్యాన్ని రాంకోసాలో ఏర్పాటు చేశారు. అనంతరం పతకావిష్కరణ, బెలూన్‌లను గాలిలో వదిలి క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ కే స్పర్జన్‌రాజు,, డీఎస్‌పీ పల్లపు రాజు, పీడీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
తొలిరోజు విజేతలు వీరే..
సిద్ధార్థ మెడికల్ కళాశాల (విజయవాడ) శాంతిరామ్ మెడికల్ కళాశాల(నం«ధ్యాల)పై గెలిచారు. టీఈస్‌ఐఎంఎస్(కుప్పం) మమత వైద్యకళాశాల (ఖమ్మం)పై, రంగరాయ మెడికల కళాశాల(కాకినాడ) వీఎస్‌ఎల్ డెంటల్ కళాశాల (రాజమండ్రి)పై, ఆంధ్రా మెడికల్ కళాశాల(విశాఖ) ఫాతిమా మెడికల్ కళాశాల(కర్నూల్
)పై, డాక్టర్ పికిమ్స్(గన్నవరం) వైద్యకళాశాల ఎంఎన్‌ఆర్( హైదరాబాద్)పై, డాక్టర్ సుధానాగేశ్వరరావు(గన్నవరం) సెయింట్ జోషప్ డెంటల్ కళాశాల(ఏలూరు)పై, మమత డెంటల్ కళాశాల(ఖమ్మం) సిబార్ డెంటల్ కళాశాల(గుంటూరు)పై గెలిచారు. నారాయణ మెడికల్ కళాశాల(నెల్లూరు) ఏసీఎస్‌ఆర్ మెడికల్ కళాశాల (నెల్లూరు)పై గెలిచారు. ఆశ్రమ్ మెడికల్ కళాశాల (ఏలూరు)గాయత్రి మెడికల్ కళాశాల(విశాఖ)పై గెలిచారు.
Advertisement
Advertisement