ర్యాగింగ్‌కు అడ్డుకట్ట పడేనా?
అదో పైచాచిక క్రీడ.. సైకోయిజం..ఇలా ఎన్ని పేర్లు పెట్టినా ర్యాగింగ్‌కు సరిపోవు. ఎందుకంటే తోబుట్టువుల్లా కలసి మెలసి ఉండాల్సిన విద్యార్థులు జూనియర్లు..సీనియర్లు అన్న తేడా చూపి, ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్నారు. ఈ విష సంస్కృతికి అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకత ఉంది. కళాశాలల యాజమాన్యాలు ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. త్వరలో ఐసెట్, ఎంటెక్, బీఈడీ, ఎంబీబీఎస్ తదితర కోర్సులకు కౌన్సెలింగ్ జరగనుంది. ఈ క్రమంలో అక్కడడక్కడ ర్యాగింగ్ జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ర్యాగింగ్‌పై ప్రత్యేక కథనం.
యూనివర్సిటీ క్యాంపస్: వృత్తి విద్యా కళాశాలల్లో ర్యాగింగ్ అధికంగా జరుగుతోంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, ర్యాగింగ్‌ను తీవ్రంగా పరిగణిస్తూ కఠిన చట్టాలు అమలు పరుస్తున్నా యి. ర్యాగింగ్ నిరోధం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1997లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. విద్యార్థులు కళాశాలలో చేరే సమయంలోనే తాము ఎలాంటి ర్యాగింగ్ కార్యకలాపాలకు పాల్పడబోమని హామీ పత్రాలను కళాశాల యా జమాన్యాలు తీసుకుంటున్నాయి. అయినా ఈ విష సంస్కృతికి పూర్తిగా అడ్డుకట్ట పడలేదు. కళాశాల యాజమాన్యాలు దీని నిరోధానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సివుంది.
విద్యార్థులకు కౌన్సెలింగ్
విద్యార్థుల్లో మానసిక పరివర్తన కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కమిటీలో సభ్యురాలుగా ఉన్నాను. అన్ని కళాశాలలో సందర్శిస్తూ ర్యాగింగ్ నిరోధక చర్యలను తీసుకుంటున్నాం. మహిళా యూనివర్సిటీ, పద్మావతి డిగ్రీ కళాశాల విద్యార్థులకు పలుమార్లు అవగాహన సదస్సులునిర్వహించాం.
- సీహెచ్. అంజూయాదవ్, సీఐ, వెస్ట్ పోలీస్ స్టేషన్
రహస్య నిఘా
విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధానికి ప్రత్యేక బృందాలను నియమించి నిఘా ఏర్పాటు చేశాం. ర్యాగింగ్ బాధితులు సమాచారం ఇవ్వడానికి వీలుగా అన్నిచోట్లా పోలీస్ అధికారుల ఫోన్‌నంబర్లను అందుబాటులో ఉంచాం. ర్యాగింగ్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.
- ఎం. శ్రీనివాసులు, సీఐ, క్యాంపస్ పోలీస్ స్టేషన్
అవగాహన సూచికలు
క్యాంపస్‌లో ర్యాగింగ్‌పై అవగాహన కల్పిస్తూ సూచికలు ఏర్పాటు చేశాం. ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలు, శిక్షలపై అవగాహన కల్పిస్తున్నాం. అధ్యాపకులు, సీనియర్, జూనియర్ విద్యార్థులతో నిరోధక కమిటీ వేశాం. వారి మధ్య సమన్వయం కోసం ప్రారంభంలోనే స్పోర్ట్స్ మీట్ పెడుతున్నాం.
- ఎస్. రవీంద్రనాథ్,
పరిపాలనాధికారి, సిద్ధార్థ ఇంజినీరింగ్
కళాశాల
జూనియర్లకు ప్రత్యేక హాస్టల్
శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ నిరోధ చర్యల్లో భాగంగా జూనియర్లకు ప్రత్యేక హాస్టల్ వసతి కల్పిస్తున్నాం. స్వర్ణముఖి హాస్టల్‌ను పూర్తిగా జూనియర్లకే కేటాయించాం. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు విద్యార్థులపై ప్రత్యేక నిఘా ఉంటుంది. అడ్మిషన్ సమయంలో అండర్‌టేకింగ్ తీసుకుంటున్నాం.-సీ ఈశ్వర్‌రెడ్డి, శ్రీపద్మావతి మహిళా వర్సిటీ, ఇంజినీరింగ్ కళాశాల డెరైక్టర్
ఇలా చేయాలి...
- ర్యాగింగ్ నిరోధానికి కళాశాలలు, ప్రత్యేక బాధ్యత వహించాలి.
- కళాశాలలో చేరే సమయంలో అండర్ టేకింగ్ తీసుకోవాలి.
- సీనియర్‌లు, జూనియర్‌లు కలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. వారికి విడివిడిగా హాస్టల్ వసతి కల్పించాలి.
- సదస్సుల ద్వారా చట్టాలపై అవగాహన కల్పించాలి.
చట్టాలు ఏమి చెబుతున్నాయంటే...
- జూనియర్‌లను టీజ్ చేయడం, అవమానిం చడం చేస్తే ఏడాది జైలు, రూ.వెయ్యి జరి మానా.
- దాడి చేసి గాయపరిస్తే ఏడాది జైలు, రూ.2 వేల జరిమానా.
- బలవంతంగా నిరోధించడం, గాయపరచ డం చేస్తే 2ఏళ్లు జైలు, రూ.5 వేల జరిమానా
- జూనియర్‌లను అపహరించడం, లైంగికం గా వేధిస్తే ఐదు సంవత్సరాల జైలు, 10 వేలు జరిమానా.
- ఆత్మహత్యకు కార ణం అయితే 10 ఏళ్లు జైలుశిక్ష, రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు జరిమానా.