
3 రోజుల పాటు డిగ్రీ కళాశాల బంద్
రాష్ట్ర ప్రభుత్వం 2014–15 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయి స్కాలర్‌షిప్‌లను రిలీజ్ చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తు సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు బంద్ పాటించాలని తెలంగాణ ప్రైవేట్æ డిగ్రీ, పీజీ కళాశాల మేనేజ్‌మెంట్ సంఘం జిల్లా అధ్యక్షుడు బి. సూర్యనారాయణరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు
భువనగిరి అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం 2014–15 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయి స్కాలర్‌షిప్‌లను రిలీజ్ చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తు సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు బంద్ పాటించాలని తెలంగాణ ప్రైవేట్æ డిగ్రీ, పీజీ కళాశాల మేనేజ్‌మెంట్ సంఘం జిల్లా అధ్యక్షుడు బి. సూర్యనారాయణరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం 2016–17 సంవత్సరానికి సంబంధించిన స్కాలర్‌షిప్ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని, ఈ విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్ పొందని విద్యార్థులకు స్కాలర్‌షిప్‌తో కూడిన స్పాట్ అడ్మిషన్‌కు అవకాశం కల్పించాలన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రస్తుతం ఉన్న ఫీజులను సమంజసంగా ఉండే విధంగా పెంచాలన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 3 రోజుల పాటు కళాశాలల బంద్‌ను పాటించాలని కోరారు.