నాణ్యత డొల్ల!
♦ నాణ్యతా ప్రమాణాలు పరిశీలిస్తున్న బృందాలు
♦ తనిఖీల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు
♦ పలు కాలేజీల్లో అధ్యాపకులూ లేని వైనం
♦ రంగంలోకి అదనంగా మరిన్ని బృందాలు
♦ ఈనెల 15న ప్రభుత్వానికి నివేదిక
♦ జిల్లాలో 420 బీటెక్, బీఫార్మసీ కాలేజీలున్నాయి. ఇప్పటికి 80 కాలేజీలను తనిఖీ చేశారు. చాలావరకు కళాశాలల యాజమాన్యాలు మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాసంస్థలను నడపడంలేదని తేలింది.
♦ కొన్ని కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో రెండు, మూడు కాలేజీలకు ఒక అధ్యాపక బృందం పనిచేస్తున్నట్లు బయటపడింది.
♦ ప్రైవేటు విద్యాసంస్థలపై రాష్ర్ట ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. ప్రభుత్వ నియమావళి మేరకు నాణ్యతాప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా అనే అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. ఈ మేరకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను రంగంలోకి దించింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో 1,168 కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఇంటర్మీడియెట్ మొదలు ఇంజనీరింగ్, మెడికల్, పోస్టుగ్రాడ్యుయేషన్ కాలేజీలున్నాయి. కాలేజీల్లో యాజమాన్యాలు నాణ్యతాప్రమాణాలు పాటించడంలేదని, బోధన సిబ్బంది సరిగ్గా ఉండడంలేదని, కనీసం విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు కూడా అందుబాటులో ఉండడంలేదని ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. అంతేకాకుండా వేలకు వేలు ఫీజులు వెచ్చించి.. కాలేజీల్లో చేరితే అక్కడ ల్యాబరేటరీలు, కంప్యూటర్ ల్యాబ్‌లు కూడా ఉండడంలేద ని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యం లోనే ప్రైవేటు కళాశాలలపై దాడులు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ శాఖ దాడులు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా లో తొలి విడతగా ఇంజనీరింగ్, బీ -ఫార్మసీ కాలేజీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీ చేసి.. రికార్డులను పరిశీలించిం ది. ఇందులో విద్యాసంస్థల డొల్లతనం బయటపడింది.
నిబంధనలు గాలికి..
జిల్లావ్యాప్తంగా 420 బీటెక్, బీఫార్మసీ కాలేజీలుండగా వీటిలో గురువారం నాటికీ 80 కాలేజీలను తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో చాలావరకు కళాశాలల యాజమాన్యాలు మార్గదర్శకాలకనుగుణంగా విద్యాసంస్థలను నిర్వహించ డంలేదని తేలింది. 60మంది విద్యార్థులకు అనుగుణంగా ఫ్యాకల్టీ ఉండాలనే నిబంధన ఉన్నా పాటించడంలేదని స్పష్టమైంది. కొన్ని కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో రెండు, మూడు కాలేజీలకు ఒక అధ్యాపక ృందం పనిచేస్తున్నట్లు బయటపడింది. నిపుణులైన అధ్యాపకులుండాలనే యూజీసీ నియమావళిని కూడా బేఖాతరు చేస్తున్నట్లు తేలింది.
అప్పుడప్పుడే పీజీ పూర్తిచేసిన విద్యార్థులు లెక్చరర్లుగా పనిచేస్తున్నట్లు వెలుగులో కి వచ్చింది. పలు విద్యాసంస్థల్లో మౌలిక వసతులు ముఖ్యంగా తరగతి గదులు, భవనాలు కూడా లేవని తని ఖీల్లో గుర్తించారు. మరోవైపు విద్యాసంస్థలపై దాడులను తీవ్రతరం చేసేం దుకు మరిన్ని టీమ్‌లను విజిలెన్స్ శాఖ రంగంలోకి దించింది. జూన్ 15 తేదీ నాటికీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించిన నేపథ్యంలో తనిఖీ లను ముమ్మరం చేయాలని నిర్ణయిం చింది. దీంతో అదనంగా మరో పది ృందాలను దాడులకు మోహరించింది. వచ్చే విద్యాసంవత్సరం నాటికీ విద్యాసంస్థలను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.