సాక్షి, అమరావతి: స్కిల్ కాలేజీలు, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానం చేసి ఆయా కంపెనీలకు అవసరమైన కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో నైపుణ్యశాఖపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 15కల్లా పరిశ్రమలతో అనుసంధాన ప్రక్రియను పూర్తిచేయాలని నిర్దేశించారు. స్కిల్‌హబ్‌లలో శిక్షణ కోసం ఇప్పటివరకు 15,559 మంది నమోదు చేసుకున్నట్లు నైపుణ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ మంత్రికి వివరించారు. ఇప్పటి వరకు మొత్తం 3,636 మందికి ఉపాధి అవకాశాలు అందించినట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ వినోద్‌కుమార్ చెప్పారు. స్కిల్ కాలేజీలు, స్కిల్‌హబ్‌లకు సంబంధించి కొత్త విధానంలో బ్రాండింగ్ చేయాలని మంత్రి బుగ్గన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment