ఇంటర్, డిగ్రీ ప్రైవేట్ కళాశాలల్లో బుధవారం విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రైవేటు కళాశాలల తనిఖీల్లో భాగంగా మండలంలోని గౌతమి డిగ్రీ కళాశాల, భద్రాద్రి ఒకేషనల్ అండ్ డిగ్రీ కళాశాల, కాకతీయ ఒకేషనల్ కళాశాలల్లో తనికీ బందాలు పరిశీలించారు. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు,
చర: చర్లలోని ఇంటర్, డిగ్రీ ప్రైవేట్ కళాశాలల్లో బుధవారం విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రైవేటు కళాశాలల తనిఖీల్లో భాగంగా మండలంలోని గౌతమి డిగ్రీ కళాశాల, భద్రాద్రి ఒకేషనల్ అండ్ డిగ్రీ కళాశాల, కాకతీయ ఒకేషనల్ కళాశాలల్లో తనికీ బందాలు పరిశీలించారు. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, వసతులు, అధ్యాపకులు, తరగతి గదుల వివరాలను తనిఖీ బందాలు పరిశీలించి వివరాలు నమోదు చేశారు. తనిఖీ బందంలో విజిలెన్స్ అధికారులు అరవింద్‌బాబు, భానుకుమార్, అహ్మద్‌మియా ఉన్నారు.
దుమ్ముగూడెంలో..
దుమ్ముగూడెం : మండలంలో ప్రైవేటు కళాశాలలో విజిలెన్స్ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. శ్రీకష్ణ గౌతమి డిగ్రీ కళాశాల, టెక్నో ఒకేషనల్ జూనియర్ కళాశాలలను వారు తనిఖీ చేశారు. విజిలెన్స్ అధికారి వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. కళాశాలల్లో మౌలిక వసతులు, తదితర అంశాలపై తనిఖీలు నిర్వహించారు. కాగా ఈ తనిఖీ బందానికి నిర్వాహకులు వివరాలు తెలుపడానికి నిరాకరించారు. ఏఈ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ విష్ణుమూర్తి, లెక్చరర్ శ్రీనివాస్, వరరాజులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.