rides in
-
ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ అదనపు కమిషనర్
సాక్షి, అమరావతి/లక్ష్మీపురం (గుంటూరు)/విశాఖ క్రైం/శ్రీకాకుళం/హైదరాబాద్: విజయవాడ వాణిజ్య పన్నుల శాఖలో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న జి. లక్ష్మీప్రసాద్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు చేసింది. గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలతోపాటు హైద్రాబాద్‌లో మొత్తం 20చోట్ల బుధవారం ఏకకాలంలో సోదాలు జరిపింది. దాడుల్లో రూ.1.84 కోట్ల విలువ చేసే చరాస్తులను గుర్తించినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్.పి.ఠాకూర్ వెల్లడించారు. లక్ష్మీప్రసాద్‌తోపాటు ఆయన బంధువులు, బినామీల నివాసాల్లో జరిపిన సోదాల్లో పలు ఇళ్లు, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూమిని గుర్తించారు. వీటికి సంబంధించిన దస్తావేజులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో లక్ష్మీప్రసాద్ అత్త పేరిట రెండు ఎకరాల వ్యవసాయ భూమి, తెలంగాణలోని మహేశ్వరం మండలం అమీర్‌పేటలో ఆయన బంధువు పేరిట రెండెకరాల వ్యవసాయ భూమి, పరిగిలో నాలుగు ప్లాట్లు, 30తులాల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, విలువైన సెల్ఫోన్లు, రూ.34లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో గుర్తించిన చరాస్తుల్లో.. రూ.కోటి విలువ చేసే ప్రాంసరీ నోట్లు, బ్యాంకు నిల్వ రూ.34 లక్షలు, నగదు రూ.32 వేలు, రూ.40 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, గృహోపకరణాలు రూ.10 లక్షలు, మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక లాకర్ ఉన్నాయి. స్థిరాస్తుల విలువ తెలియాల్సి ఉంది. శ్రీకాకుళంలోని లక్ష్మీప్రసాద్ ఇంట్లో తనిఖీలు చేస్తున్న అధికారులు -
ప్రైవేట్ కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు
చర: చర్లలోని ఇంటర్, డిగ్రీ ప్రైవేట్ కళాశాలల్లో బుధవారం విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రైవేటు కళాశాలల తనిఖీల్లో భాగంగా మండలంలోని గౌతమి డిగ్రీ కళాశాల, భద్రాద్రి ఒకేషనల్ అండ్ డిగ్రీ కళాశాల, కాకతీయ ఒకేషనల్ కళాశాలల్లో తనికీ బందాలు పరిశీలించారు. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, వసతులు, అధ్యాపకులు, తరగతి గదుల వివరాలను తనిఖీ బందాలు పరిశీలించి వివరాలు నమోదు చేశారు. తనిఖీ బందంలో విజిలెన్స్ అధికారులు అరవింద్‌బాబు, భానుకుమార్, అహ్మద్‌మియా ఉన్నారు. దుమ్ముగూడెంలో.. దుమ్ముగూడెం : మండలంలో ప్రైవేటు కళాశాలలో విజిలెన్స్ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. శ్రీకష్ణ గౌతమి డిగ్రీ కళాశాల, టెక్నో ఒకేషనల్ జూనియర్ కళాశాలలను వారు తనిఖీ చేశారు. విజిలెన్స్ అధికారి వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. కళాశాలల్లో మౌలిక వసతులు, తదితర అంశాలపై తనిఖీలు నిర్వహించారు. కాగా ఈ తనిఖీ బందానికి నిర్వాహకులు వివరాలు తెలుపడానికి నిరాకరించారు. ఏఈ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ విష్ణుమూర్తి, లెక్చరర్ శ్రీనివాస్, వరరాజులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. -
మద్యం షాపుపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు
భద్రాచలంలో అనధికార నిల్వలు స్వాధీనం మద్యం దుకాణం సీజ్ భద్రాచలం : ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్రస్థాయి అధికారులు భద్రాచలంలో మంగళవారం రాత్రి దాడులు చేశారు. ఐటీడీఏ రోడ్లోగల సాయి తిరుమల వైన్ షాపు పక్కనున్న గదిలో ఎటువంటి అనుమతుల్లేకుండా భారీగా మద్యం నిల్వలను అధికారులు గుర్తించి, స్వాధీనపర్చుకున్నారు. ఆ వైన్ షాపును సీజ్ చేశారు. భద్రాచలంలోని మద్యం దుకాణాదారులు సిండికేట్‌గా ఏర్పడి మద్యాన్ని పెద్దఎత్తున అక్రమంగా నిల్వలు చేయడంతోపాటు కల్తీ కూడా చేస్తున్నారని అందిన ఫిర్యాదులతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ దాడులు చేశారు. సాయి తిరుమల వైన్ షాపు పక్కనున్న గదిని సిండికేట్ కార్యాలయంగా ఉపయోగిస్తున్నట్టు సమాచారం. అక్కడున్న అక్రమ నిల్వలను వాహనంలో స్థానిక ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. ఎన్ఫోర్స్మెంట్ దాడులపై స్థానిక ఎక్సైజ్ శాఖ అధికారులకు ఎటువంటి సమాచారం లేకపోవడం గమనార్హం. భద్రాచలంలోని మద్యం దుకాణదారులంతా సిండికేట్‌గా ఏర్పడి, మద్యం నిల్వలను కూడా ఒకేచోట నుంచి సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. ఎన్ఫోర్స్మెంట్ దాడుల నేపథ్యంలో భద్రాచలం పట్టణంలోని మిగతా మద్యం దుకాణాల్లో లూజు విక్రయాలను నిలిపివేశారు. కల్తీ మద్యం విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులతో సాయి తిరుమల వైన్ షాపుపై గతంలో కూడా అధికారులు దాడులు చేశారు. కల్తీ మద్యంగా భావించిన సీసాలను పరీక్షలకు కూడా పంపించారు. ఆ తరువాత దానిపై ఎటువంటి పురోగతి లేదు. ఇదే దుకాణంపై అధికారులు మంగళవారం దాడులు జరిపి సీజ్ చేశారు.