
సాక్షి, అమరావతి/లక్ష్మీపురం (గుంటూరు)/విశాఖ క్రైం/శ్రీకాకుళం/హైదరాబాద్: విజయవాడ వాణిజ్య పన్నుల శాఖలో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న జి. లక్ష్మీప్రసాద్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు చేసింది. గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలతోపాటు హైద్రాబాద్‌లో మొత్తం 20చోట్ల బుధవారం ఏకకాలంలో సోదాలు జరిపింది. దాడుల్లో రూ.1.84 కోట్ల విలువ చేసే చరాస్తులను గుర్తించినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్.పి.ఠాకూర్ వెల్లడించారు.
లక్ష్మీప్రసాద్‌తోపాటు ఆయన బంధువులు, బినామీల నివాసాల్లో జరిపిన సోదాల్లో పలు ఇళ్లు, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూమిని గుర్తించారు. వీటికి సంబంధించిన దస్తావేజులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో లక్ష్మీప్రసాద్ అత్త పేరిట రెండు ఎకరాల వ్యవసాయ భూమి, తెలంగాణలోని మహేశ్వరం మండలం అమీర్‌పేటలో ఆయన బంధువు పేరిట రెండెకరాల వ్యవసాయ భూమి, పరిగిలో నాలుగు ప్లాట్లు, 30తులాల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, విలువైన సెల్‌ఫోన్లు, రూ.34లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు.
సోదాల్లో గుర్తించిన చరాస్తుల్లో.. రూ.కోటి విలువ చేసే ప్రాంసరీ నోట్లు, బ్యాంకు నిల్వ రూ.34 లక్షలు, నగదు రూ.32 వేలు, రూ.40 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, గృహోపకరణాలు రూ.10 లక్షలు, మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక లాకర్ ఉన్నాయి. స్థిరాస్తుల విలువ తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళంలోని లక్ష్మీప్రసాద్ ఇంట్లో తనిఖీలు చేస్తున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment