![Minister Suresh Said False Propaganda On Anantapur College Incident - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/9/adimulapu-suresh2.jpg.webp?itok=8L87pvSE)
సాక్షి, విజయవాడ: అనంతపురంలో కాలేజీ ఘటనపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. విద్యార్థుల ధర్నాలో కొందరు దుండగులు చొరబడ్డారన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీసులపై రాళ్లు రువ్వి విద్యార్థిని గాయపర్చారన్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని వివరించారు.
చదవండి: అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ: సజ్జల
కొన్ని రాజకీయ పార్టీలు వీటిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అవాస్తవ ప్రచారానికి కొన్ని మీడియా సంస్థలు మద్దతు పలుకుతున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. విద్యార్థినిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు లాఠీచార్జ్ చేయలేదంటూ బాధిత విద్యార్థినే చెబుతోందని మంత్రి అన్నారు. దుండగులు వేసిన రాళ్ల దాడిలోనే విద్యార్థిని గాయపడిందన్నారు. రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థల పనితీరుపై కమిటీ వేశామని.. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆదిమూలపు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment