హైదరాబాద్ : విద్యా సంస్థల్లో డ్రగ్స్ కలకలం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలతో సంబంధమున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. దానికి తోడు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
డ్రగ్స్ కేసు దర్యాప్తులో మీడియాతో పాటు విచారణ సంస్థలు సంయమనం పాటించాలని కోరారు. ఈ విషయంపై కఠినంగా వ్యవహరించాలని డీఈవోలకు కడియం సూచించారు. తప్పంతా విద్యా సంస్థలను నిందించడం సరికాదని కడియం శ్రీహరి అన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై కాలేజీలు, విద్యా సంస్థలు కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. అలాగే పిల్లల విషయంలో తల్లిదండ్రులతో పాటు సూళ్లలో ఉపాధ్యాయులు కూడా ఓ కంట కనిపెట్టాలని ఆయన సూచించారు.