మూడు విభాగాల్లో డ్రగ్స్ చిచ్చు!
♦ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయంటూ డిప్యూటీ సీఎం మండిపాటు
♦ దర్యాప్తు సంస్థ తీరుపై రాష్ట్ర పోలీసు బాస్‌కు ఫిర్యాదు
♦ టు విద్యాశాఖ, అటు పోలీస్ శాఖపై పెరుగుతున్న ఒత్తిడి
♦ లీకులతో గందరగోళంగా మారిన కేసు
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసు మూడు ప్రభుత్వ విభాగాల మధ్య చిచ్చు రేపుతోంది. ఎక్సైజ్ శాఖ పట్టుకున్న డ్రగ్స్ కేసులో స్కూళ్లు, కాలేజీలు, హోటళ్లు, సాఫ్ట్‌వేర్ సంస్థలు, బహుళజాతి కంపెనీలు, సినీ పరిశ్రమ.. ఇలా ఎన్నో రంగాలకు చెందినవారి భాగస్వామ్యం బయటపడుతోంది. దీంతో డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతోపాటు.. పోలీసు శాఖ, విద్యా శాఖలను కూడా ఈ కేసు ఉక్కిరిబిక్కిరి చేస్తోం ది. కొందరు విద్యార్థులు డ్రగ్స్‌ను వినియో గిస్తే మొత్తం పాఠశాలల ప్రతిష్ట దెబ్బతినేలా లీకులివ్వడంపై విద్యాశాఖ తీవ్రంగానే స్పందిస్తోంది.
ఇక అసలే సరిపడా సిబ్బంది లేని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఈ కేసులో భారీ స్థాయిలో లింకులు బయట పడుతున్నా కూడా పోలీసుల సహాయం తీసుకోకపోతుండడం చర్చనీ యాంశమైంది. విచారణ సంస్థ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అత్యుత్సాహం ప్రదర్శిస్తోం దని స్వయంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండి పడ్డారు కూడా. అనవసరపు లీకులిచ్చి విద్యా సంస్థల పేర్లు బయటకు చెప్పడం వల్ల విద్యా ర్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో మునిగి పోతున్నారని ఆయన పేర్కొన్నారు. స్కూల్ లో ఒకరిద్దరు పిల్లలు డ్రగ్స్ తీసుకుంటే మిగతా విద్యార్థుల తల్లిదండ్రులంతా ఆందో ళన చెందుతారని.. ఇలాంటి సున్నితమైన విషయాల్లో సంయమనం పాటించాలని సూచించారు. అంతేగాకుండా దర్యాప్తు సంస్థ, అధికారుల అత్యుత్సాహంపై డీజీపీకి, ఉన్న తాధికారులకు కడియం ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
లీకులతో ఒత్తిళ్లు..
డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖ కాలే జీలు, స్కూళ్ల విద్యార్థులు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు లీకులివ్వడంతో.. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగినట్టు కనిపిస్తోంది. స్కూల్‌లో ఒకరో ఇద్దరో విద్యార్థులు డ్రగ్స్ తీసు కుంటే.. నోటీసుల పేరుతో తమను బజారుకీడ్చారంటూ ప్రముఖ ఇంటర్నేషన ల్ స్కూళ్లు విద్యాశాఖకు ఫిర్యాదులు చేయ డం గమనార్హం. డ్రగ్స్ తీసుకున్న విద్యార్థుల ను, వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తే సరిపోయేదనే అభిప్రాయం వ్యక్త మవుతోంది.
అనవసరపు హడావుడితో..
డ్రగ్స్ అనగానే సాధారణంగా టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ కంట్రోల్ విభాగాలు గుర్తుకువస్తాయి. అయితే ఎక్సైజ్ శాఖకు కూడా కేసులు వేసి, దర్యాప్తు చేసే అధికారం ఉండటంతో... తొలిసారిగా భారీ కేసును చేపట్టింది. కానీ దర్యాప్తులో మాత్రం అత్యుత్సాహం ప్రద ర్శించిందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో పోలీసు శాఖ కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ కేసులు పట్టుకుని.. రెండు మూడు రోజుల్లోనే పూర్తి లింకులను ఛేదించాక బయటకు వెల్లడించేది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మాత్రం పూర్తి స్థాయిలో లింకులను ఛేదించకుండానే హడావుడిగా డ్రగ్స్ కేసును బయటపెట్టి అత్యుత్సాహం ప్రదర్శించిందనే విమర్శలు వస్తున్నాయి. ఇంత భారీ కేసులో పోలీసులు, నార్కో టిక్ కంట్రోల్ బ్యూరో సహాయం కోరాల్సి ఉన్నా.. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పట్టించు కోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.