Excise enforcement
-
17కిలోల గంజాయి పట్టివేత
ఖలీల్‌వాడి: వేర్వేరు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 17కిలోల గంజాయిని పట్టుకొని, ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి నుంచి రెండు బైక్‌లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్ తెలిపారు. నగరంలోని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్సైజ్ సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు సోమవారం మధ్యాహ్నం అడవిమామిడిపల్లి వద్ద గంజాయిని తరలిస్తున్న ని స్సార్ నుంచి 15.225 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గంజాయితోపాటు బైక్‌ను, నిస్సార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆర్మూర్‌లోని జిరాయిత్‌నగర్‌లో సోదాలు నిర్వహించగా అక్బర్ అనే వ్యక్తి నుంచి 2కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరు వ్యక్తులు ఒరిస్సా నుంచి నిజామాబాద్‌కు బస్సులో గంజాయిని తరలించినట్లు విచారణలో తేలిందన్నారు. బస్సులలో తీసుకువచ్చిన గంజాయిని స్థానికంగా అమ్ముతారని తెలిపారు. జిల్లాలో గంజాయి అమ్మకాలు సాగిస్తే వివరాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం అందించాలని, వారి వి వరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను అసిస్టెంట్ కమిషనర్ కిషన్ అభినందించారు. సీఐలు స్వప్న, వేణుమాధవరావు, ఎస్సై రాంకుమార్, హెడ్‌కానిస్టేబుల్ శివప్రసాద్, రాజన్న, కానిస్టేబుళ్లు ఉత్తమ్, రాంబచన్, శివ, విష్ణు, భోజన్న, హమీద్, గంగారాం, మంజుల, సుకన్య, అవినాష్ పాల్గొన్నారు. -
డ్రగ్స్ సూత్రధారి ఎబూకా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బ్రెజిల్ నుంచి సముద్ర మార్గం ద్వారా ముంబైకి అటునుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన సూత్రధారి డివైన్ ఎబూకా ఎట్టకేలకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ బృందానికి చిక్కాడు. ఈ మేరకు సోమ వారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆబ్కారీ శాఖ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హైదరాబాద్ డివిజన్ సి.వివేకానందరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ కార్యకలాపాలు నిర్వహిస్తూ.. హైదరాబాద్‌లో కొకైన్ విక్రయించే ప్రధాన సూత్రధారి (ముఠా నాయకుడు) నైజీరియా దేశానికి చెందిన డివైన్ ఎబూకా సుజును నానల్ నగర్‌లోని ఓ ఇంట్లో ఉండగా పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ బృందం పట్టుకుంది. ఎబుకాతోపాటు అతడి ప్రియురాలు ఐవరీ కోస్ట్ దేశానికి చెందిన టోరి అమినాట అనే మహిళను కూడా అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.7.42 లక్షల విలువైన 106 గ్రాముల కొౖకైన్ , రూ.70 వేల నగదు, 4 సెల్ఫోన్లు, డ్రగ్స్ రవాణాకు ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కరు చిక్కడంతో క్లూ.. పది రోజుల క్రితం నానల్ నగర్‌లోని ఎసర్ పెట్రోల్ పంపు వద్ద టాంజానియా దేశానికి చెందిన జాన్‌పాల్ 3 గ్రాముల కొకైన్‌తో ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ బృందానికి పట్టుబడ్డాడు. ఇతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ బృందంమొత్తం కూపీ లాగారు. జాన్‌పాల్ ఇచ్చిన సమాచారంతో జూన్ 24వ తేదీన గోల్కొండ ఖాదర్‌బాగ్‌లోని ఓ ఇంటిపై దాడులు చేయగా ఐవరీ కోస్ట్ పౌరుడు జాడీ పాస్కల్, ఒకోరో ఉచెన్నా శామ్యూల్‌తోపాటు ఎబూకా సోదరుడు చిమ గుడ్లక్లను పట్టుకున్నారు. ఆ సమయంలో వారి నుంచి రికార్డు స్థాయిలో రూ.17.78 లక్షల విలువైన 254 గ్రాముల కొకైన్, నగదు రూ.3.20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత 2 రోజులకు సైనిక్‌పురిలో ఉంటున్న ఘనా పౌరుడు నెల్సన్ శామ్యూల్ స్మిత్, రిపబ్లిక్ ఆఫ్ జాప్రి దేశానికి చెందిన మార్క్ 4 గ్రాముల కొకైన్‌తో పట్టుబడ్డారు. పట్టుబడిన ఒక్కొక్కరి నుంచి పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరించిన ఎన్ఫోర్స్మెంట్ బృందం ఈ ముఠా బెంగళూరు కేంద్రంగా దందా కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. అంతా చిక్కడంతో తానే రంగంలోకి.. డివైన్ ఎబూకా టీం సభ్యులంతా పట్టుబడటంతో హైదరాబాద్‌లోని వినియోగదారులకు కొకైన్ విక్రయించడం ఇబ్బందిగా మారింది. దీంతో చివరకు ఎబూకానే రంగంలోకి దిగాడు. బెంగళూరు నుంచి అతని గర్ల్‌ఫ్రెండ్ టోరి అమినాటతో కలసి హైదరాబాద్‌కు వచ్చి నానల్ నగర్లో ఉంటున్నాడు. ముందే ఇతడిపై నిఘా పెట్టిన ఎన్ఫోర్స్మెంట్ బృందం ఎబూకా అతడి, గర్ల్‌ఫ్రెండ్‌ను పట్టుకున్నారు. వీరి నుంచి 106 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్రెజిల్ నుంచి హైదరాబాద్‌కు ఎబూకాను ఎన్ఫోర్స్మెంట్ బృందం విచా రించగా ఈ దందా మొత్తం బ్రెజిల్ కేం ద్రంగా కొనసాగుతున్నట్లు గుర్తించింది. బ్రెజిల్లో ఉంటున్న నైజీరియన్ పౌరుడు చూస్ సముద్రమార్గం ద్వారా ముంబైకి కొకైన్ స్మగ్లింగ్ చేస్తున్నాడు. అటునుంచి థాగా అనే వ్యక్తి బెంగళూరుకు కొకైన్ సరఫరా చేస్తుండగా దానిని డివైన్ ఎబూకా తన అనుచరులతో కలసి హైదరాబాద్‌కు చేరవేస్తుంటాడు. హైదరాబాద్‌లో వినియోగదారులకు 6 నుంచి 7 వేల రూపాయలకు విక్రయిస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. నెలకు పైగా నిఘా పెట్టి కొకైన్ ముఠాకు చెక్ పెట్టిన బృందాన్ని సి.వివేకానందరెడ్డి అభినందించారు. -
నగరంలో మళ్లీ డ్రగ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. సంపన్నుల పిల్లలు, విద్యార్థులను టార్గెట్ చేస్తూ దందా చేస్తున్న యువతిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ఆమె నుంచి పెద్ద ఎత్తున కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఘనా దేశానికి చెందిన ఆ నిందితురాలు గత కొద్ది నెలలుగా సిటీలో డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లోని వ్యాపారవేత్తల పిల్లలకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు డ్రగ్స్ విక్రియంచినట్టు విచారణలో తేలింది. ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం డ్రగ్స్ కొనుగోలు చేసిన వారందిరికీ త్వరలో నోటీసులు ఇస్తామని అధికారులు చెప్పారు. సిటీకి డ్రగ్స్ ఎలా తీసుకొస్తున్నారు.. ఇంకా ఎవరెవరున్నారు అని పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
గంజాయి గుప్పుమంటోంది
సాక్షి, హైదరాబాద్ : గంజాయి గాండ్రిస్తోంది. విద్యార్థుల మెదళ్లను చిదిమేస్తోంది. గంజాయి మత్తుతో కంపుకొడుతున్నాయి. శివారు ప్రాంతాలకే పరిమితం అయిందనుకున్న గంజాయి ఘాటు ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రముఖ కాలేజీలనూ నిషాలో పడేస్తున్నాయి. నాలుగైదు కాలేజీలు మినహా ప్రతి కాలేజీలోనూ గంజాయి గుప్పుమంటోంది. ఎక్సైజ్ శాఖ వరుసగా ఛేదిస్తున్న కేసుల్లో గంజాయి వ్యవహారం యావత్ విద్యార్థి లోకాన్ని ఆందోళనలో పడేసేలా కనిపిస్తోంది. హైదరాబాద్, శివారు, ప్రాంతాల్లోని డిగ్రీ, ఇంజనీరింగ్, బీబీఏ, హోటల్ మేనేజ్మెంట్, కాలేజీల్లో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిం దని ఎక్సైజ్ శాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రత్యేక బృందాలు దింపిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వేట సాగిస్తూ గంజాయి దందా సాగిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా అనేక సంచలనాత్మక అంశాలను వెలుగులోకి తెచ్చారు. ప్రతి కాలేజీలోని సెక్షన్లలో 15 నుంచి 18 మంది గంజాయి తాగుతున్నట్లు ఎక్సైజ్ శాఖ అధ్యయనంలో బయటపడటం కలకలం రేపుతోంది. ఐదేళ్ల కిందటి వరకు సెక్షన్‌కు 7 నుంచి 8 మంది మా త్రమే గంజాయి తాగగా.. ఇప్పుడు 50% మేర పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. 2017లో గం జాయి పట్టుకున్న వ్యవహారంలో 17 కేసులు నమో దు చేస్తే, 2018లో ఆ çసంఖ్య 90కి చేరింది. ఈ నెల రోజుల్లో 7 కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ‘స్కోరింగ్’లో విద్యార్థులే.. ఎక్సైజ్, పోలీసులు ఎప్పటికప్పుడు గంజాయి పట్టుకుని కేసులు నమోదు చేస్తుండటంతో విద్యార్థులే గంజాయిని వైజాగ్, అరకులో కొనుగోలు చేసి తమ స్నేహితులకు విక్రయిస్తున్నారు. గంజాయి విక్రయించడాన్ని ‘స్కోరింగ్’అనే కోడ్ పేరుతో పిలుచుకుంటున్నారు. గతంలో దీన్ని కొంత మంది బ్రోకర్లు, ఏజెంట్లు విద్యార్థులకు అమ్మేవారు. తీరా ఇప్పుడు విద్యార్థులే స్కోరింగ్ దందాలోకి దిగడం గుబులు రేపుతోందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గడిచిన 2 నెలల్లో 8 మంది ఇంజనీరింగ్ విద్యార్థులపై ఎక్సైజ్ శాఖ కేసులు పెట్టింది. వీరి విచారణలో అంబర్పేట్, చిక్కడపల్లి, మెహిదీపట్నం, నాంపల్లి, సీతాఫల్మండి, ఫలక్‌నుమా, చైతన్యపురి ప్రాంతాల్లోని విద్యార్థులకు అమ్మకం సాగిస్తున్నట్లు తేలింది. అరకు వెళ్లి 2 కేజీల చొప్పున కొనుగోలు చేయడం, దాన్ని ఎక్సైజ్ పోలీసుల కంటపడకుండా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తరలించి స్నేహితులకు అందజేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని అన్ని కాలేజీలు 600 వరకు ఉన్నాయి. ఇందులోని 5 వేల మందికి పైగా విద్యార్థులు గంజాయి మత్తులో జోగుతున్నట్లు ఎౖజ్ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. నిర్బంధం నుంచి.. ఇంటర్ వరకు నిర్బంధంలాగా ఉండి ఇంజనీరింగ్‌కు వచ్చే సరికి ఒక్కసారిగా స్వేచ్ఛా జీవులుగా మారినట్లు విద్యార్థులు ప్రవర్తిస్తున్నారని, దీంతో ఎంజాయ్ పేరుతో గంజాయికి అలవాటు పడి మత్తులో జోగుతున్నారని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు ఇస్తున్న విచ్చలవిడి స్వేచ్ఛ, డబ్బు విద్యార్థులు గంజాయి వైపు మళ్లేలా చేస్తున్నాయని, దీనిపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఆల్కహాల్ తాగితే వాసన ద్వారా ఇంట్లో తెలుస్తుందని, గంజాయి అయితే పెద్దగా ఇబ్బంది ఉండదని స్నేహితులు అలవాటు చేస్తుండటంతో ఏటా దీనికి బానిసలవుతున్న వారి సంఖ్య రెట్టింపు అవుతోందని అధికారులు చెబుతున్నారు. కాలేజీల వద్ద నిఘా ఏదీ? విద్యాసంస్థలు ఆర్థిక ప్రయోజనాలకే పరిమితం కావడంతో విద్యార్థులు ఇలాంటి వ్యసనాలకు దగ్గరవుతున్నారన్న ఆరోపణలున్నాయి. కాలేజీకి విద్యార్థులు వస్తున్నారా.. ఎందుకు గైర్హాజరు అవుతున్నారు.. వారి ప్రవర్తనలో వచ్చిన మార్పులేంటి.. వస్తే ఆ మార్పు వెనుక కారణాలేంటన్న అంశాలపై దృష్టి పెట్టట్లేదని ఎక్సైజ్, పోలీస్ అధికారులు చెబుతున్నారు. కాలేజీ గ్రౌండ్స్, కాలేజీ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే గంజాయి ఎక్కువగా తాగుతున్నట్లు తమ విచారణలో తేలిందని ఎక్సైజ్ సీనియర్ అధికారి వెల్లడించారు. కాలేజీలు విద్యార్థులపై దృష్టి పెట్టి, పరిసరాల్లో నిఘా పెడితే ఈ పరిస్థితిని నియంత్రించవచ్చిని చెబుతున్నారు. సమష్టిగానే నియంత్రణ.. గంజాయి మత్తులో విద్యార్థులు జోగుతూ పోతే పంజాబ్ లాంటి పరిస్థితులు వస్తాయని దర్యాప్తు, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీని నియంత్రణ పోలీస్, ఎౖMð్సజ్తో మాత్రమే కాదని, విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు, ఉన్నత విద్యా శాఖ, రెవెన్యూ విభాగాలు సమష్టిగా చర్యలు తీసుకుంటేనే విద్యార్థుల జీవితాలు బాగుపడుతాయని, లేకుంటే ప్రమాదకర పరిస్థితులుంటాయని హెచ్చరిస్తున్నారు. తమ వంతుగా కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, కానీ వాటిని అమలు చేయడం, విద్యార్థులను కనిపెట్టడం యాజమాన్యాలు, తల్లిదండ్రులపైనే ఉంటుందని చెబుతున్నారు. -
ఇంట్లోనే గంజాయి సాగు!
సాక్షి, హైదరాబాద్: అక్కడా ఇక్కడా ఎందుకని.. నగరంలోని ఓ వ్యక్తి ఏకంగా ఇంటిలోనే గంజాయి సాగు చేశాడు.. పూల మొక్కల మాదిరిగా.. కుండీల్లో గంజాయి మొక్కలను పెంచాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఇతని గుట్టును రట్టు చేశారు. టోలిచౌకి పారామౌంట్ వీర్ స్ట్రీట్‌లో ఉన్న నవాజ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ప్రణవ్(24) అమెజాన్‌లో సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను నగరంలోని పలువురు వ్యాపారవేత్తలు, వీఐపీల పిల్లలకు విక్రయిస్తున్నాడు. రహస్యంగా ఉండటం కోసం ఇంట్లోనే గంజాయి సాగు చేపట్టాడు. ప్రణవ్ ఇంట్లో గంజాయి మొక్క ఉన్న పూల కుండీని.. కవర్లో ప్యాక్ చేసిన ఎండిన గంజాయి మొక్కను, అతని బైక్‌లో ఉన్న 75 ప్యాకెట్ల ఎల్ఎస్డీ(లిసర్జిక్ ఆసిడ్ డై ఇథలమైడ్), 8 గ్రాముల ఎండీఎంఏ, 180 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతను హైటెక్ పద్ధతిలో మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్లు నిర్ధారించారు. డ్రీమ్ మార్కెట్ వెబ్సైట్, బిట్‌కాయిన్స్ ద్వారా నగదు చెల్లించిన వారికి గంజాయిని కొరియర్ ద్వారా సరఫరా చేసినట్లు గుర్తించారు. ఇప్పటివరకు ఎంతమందికి ఇలా అమ్మాడన్న దానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. దీని కోసం అతని మొబైల్‌ను ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్యే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ (యాంటీ నార్కోటిక్) బృందం జరిపిన సోదాల్లో చింతల్‌బస్తీలో నివాసం ఉంటున్న ఆదిలాబాద్వాసి అబ్దుల్ హమీద్ వద్ద 31 గ్రాముల కొకైన్ పట్టుబడింది. ఈ కేసు తదుపరి విచారణను జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పజెప్పారు. అబ్దుల్, ప్రణవ్‌ల నుంచి పలువురు మాదకద్రవ్యాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. వీరిలో బడా వ్యాపార వేత్తలు, వీఐపీల పిల్లలున్నట్లు సమాచారం. వీరందరికీ నోటీసు లు జారీ చేసి విచారణ జరపాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించింది. ఎన్ఫోర్స్ విభాగం ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న అక్రమార్కులపై ఉక్కు పాదం మోపుతామని నగర ఎక్సైజ్ విభాగం డిప్యూటీ కమిషనర్ సి. వివేకానందరెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఏఈఎస్ ఎన్.అంజిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
ఆయుర్వేదం ముసుగులో గంజాయి!
సాక్షి, హైదరాబాద్: స్కూల్ విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ మాఫియా గంజాయి చాక్లెట్లు, బిస్కెట్లు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. బిహార్ కేంద్రంగా పనిచేస్తున్న మాఫియా ముఠా పాత బస్తీకి చెందిన నిరుద్యోగ యువత ద్వారా హైదరాబాద్ మార్కెట్లోకి వీటిని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ప్రముఖ పాఠశాలలు, కార్పొరేట్ సంస్థల వద్ద పాన్ డబ్బాలు, టీ స్టాల్స్‌లో పెట్టి ఆయుర్వేద చాక్లెట్ల పేరుతో పాఠశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు. పాతబస్తీలోని ఓ కార్పొరేట్ తరహా పాఠశాల సమీపంలో వీటిని విక్రయిస్తుండగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అసిస్టెంట్ కమిషనర్ అంజిరెడ్డి బృందం దాడి చేసి పట్టుకున్నారు. ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులే ఎక్కువగా గంజాయి ఆధారిత చాక్లెట్లకు ఆకర్షితులవుతున్నట్లు తేలింది. పాతబస్తీలో విక్రయాలు పాతబస్తీలోని ఓ కార్పొరేట్ పాఠశాల సమీపంలో గంజాయి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో హైదరాబాద్ డీసీ వివేకానందరెడ్డి ఆదేశాలతో శనివారం మధ్యాహ్నం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు ఓ ఇంటిపై దాడి చేసి లాల్ బహుదూర్‌సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ అధికారుల రాకను ముందే పసిగట్టిన బహుదూర్‌సింగ్ గంజాయిని గుర్తు తెలియని ప్రాంతంలో దాచిపెట్టి, అధికారులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. అయితే అనుమానితుని ఇంటికి సమీపంలో తిని పారేసిన గుట్కా పాకెట్ లాంటి కవర్ ఒకటి ఎన్‌ఫోర్స్‌మెంటు ఏఈఎస్ అంజిరెడ్డి దృష్టిని ఆకర్షించింది. ‘టైగర్ మునక్క’అనే లోగో, ‘పులి’ట్రేడ్ మార్కు చిత్రంతో ఉన్న కవర్‌పై ఆయుర్వేదిక్ మెడిసిన్ అని రాసి ఉంది. గతంలో ఇలాంటి గుట్కా ఏదీ మార్కెట్లో కనిపించకపోవటంతో అనుమానించిన అంజిరెడ్డి అనుమానితుని ఇంట్లో సోదాలు చేశారు. ఇంట్లోని రహస్య ప్రదేశంలో దాచిపెట్టిన రెండు దండలుగా ఉన్న 70 చాక్లెట్లు, 3 కిలోల గంజాయి పొడి, 650 గ్రాముల తడి గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులు కొనేందుకు వీలుగా రూ.20కే చాక్లెట్ విద్యార్థులు కొనేందుకు వీలుగా ఒక్కొక్క గంజాయి చాక్లెట్‌ను రూ.20 చొప్పున విక్రయిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. 50 గ్రాముల ప్యాకెట్ చొప్పున ప్యాక్ చేసిన ఒక్కొక్క ప్యాకెట్‌ను రూ.500 చొప్పున అమ్ముతున్నారు. వీటిని లోయర్ ధూల్‌పేట ప్రాంతానికి చెందిన బ్రిజ్‌రాజ్‌సింగ్ అనే డ్రగ్స్ నిందితుడు సరఫరా చేసినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. బిహార్ రాష్ట్రం నుంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ రూపంలో స్మగ్లింగ్ చేసి స్థానికంగా ఏజెంట్ల ద్వారా విక్రయిస్తున్నట్లు అంచనాకు వచ్చారు. బ్రిజ్‌రాజ్‌సింగ్ పట్టుబడితే ఇంకా ఏమేమి గంజాయి ఉత్పత్తులు సరఫరా చేస్తున్నారో తెలిసే అవకాశం ఉందని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు చెప్పారు. -
నకిలీ మద్యం గుట్టురట్టు
సాక్షి, గుంటూరు: జిల్లాలో మరో నకిలీ భాగోతం బయటపడింది. ఇప్పటికే కారం, నకిలీ పురుగు మందులు, మెడిసిన్, నూనె, నెయ్యి ఇలా ప్రతి వస్తువునూ నకిలీ మయం చేసేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా రేపల్లె మండలం తుమ్మల పంచాయతీ పరిధిలోని గాదెవారిపాలెంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న కేంద్రంపై మంగలవారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. పాడుపడిన ఇంట్లో 250 లీటర్ల స్పిరిట్, 21 కేసుల (1248 సీసాల) నకిలీ మద్యం, 20 బ్యాగుల ఖాళీ సీసాలు, క్యాప్ ఫిట్టింగ్ మిషన్, స్వాధీనం చేసుకున్నారు. బ్రాంది షాపు నిర్వాహకులు గుమ్మడి సాంబశివరావుతోపాటు, కొల్లూరు మండలం లంబాడి తండాకు చెందిన రమావత్ సాంబశివ నాయక్‌లను అరెస్టు చేశారు. స్పిరిట్‌లో రంగు నీళ్లు కలిపి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎప్పటి నుంచి ఈ వ్యవహారం సాగుతోంది, ఇక్కడ తయారు చేసిన నకిలీ మద్యం ఏయే ప్రాంతాలకు సరఫరా అవుతుందనే దానిపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఆఫీసర్స్ చాయిస్, ఓల్డ్ ట్రావెన్ అనే బ్రాండ్లకు చెందిన ఖాళీ మద్యం సీసాలను సేకరించి వాటిలో నకిలీ మద్యం నింపుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఇందులో 960 సీసాల ఆఫీసర్స్ చాయిస్ విస్కీ, 288 సీసాల ఓల్డ్ట్రావెన్ విస్కీ స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో మద్యం సిండికేట్లతో నకిలీ మద్యం తయారీ కేంద్రం దారులకు సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో కలకలం జిల్లాలో నకిలీ మద్యం కేంద్రం నడుస్తుందనే విషయం బయటపడడంతో తీవ్ర కలకలం రేపింది. నకిలీ మద్యం ఏయే దుకాణాలకు సరఫరా అవుతుందనే విషయం బయటపడకపోవడంతో మందుబాబులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ బీ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కల్తీ మద్యం తయారు చేసిన అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీని వెనుక ఎంతటివారినైనా వదిలేది లేదంటూ స్పష్టం చేశారు. దాడుల్లో ఎక్సైజ్ ఏఈఎస్ ఆవులయ్య, సీఐ సూర్యనారాయణ, ఏఈఎస్ అరుణకుమారి, ఎస్సై మోహన్‌రావు, రేపల్లె ఎక్సైజ్ సీఐ వెంకటరెడ్డి, ఎస్సై శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
సిండికేట్ల సిత్రాలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మద్యం దుకాణాలపై లిక్కర్ సిండికేట్లు పట్టు బిగిస్తున్నారు. లాటరీలో లైసెన్స్ దక్కకపోయినా లక్షలకు లక్షలు గుడ్‌విల్ పోసి దుకాణాలు సొంతం చేసుకుంటున్నారు. లిక్కర్ విక్రయాల డిమాండ్‌ను బట్టి ఒక్కో షాపునకు కనిష్టంగా రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.కోటి వరకు గుడ్‌విల్ ఇచ్చి లీజుకు తీసుకుంటున్నారు. ఎక్సైజ్ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,031 మద్యం దుకాణాలు సిండికేట్ల చేతుల్లోకి వెళ్లినట్లు అంచనా. కొత్త లైసెన్స్‌దారులు సిండికేట్ల గుడ్‌విల్ ఎరకు చిక్కి దుకాణాలు అప్పగిస్తుండగా.. మరికొందరు సిండికేట్లు ఇచ్చే డబ్బులు తీసుకోవడంతోపాటు వ్యాపారంలో భాగస్వాములుగా మారుతున్నారు. గుడ్‌విల్ పేరుతో ఎర.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కువ శాతం దుకాణాలను సిండికేట్లు చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత స్థానంలో రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రాలో లైసెన్స్‌లు దక్కని మద్యం వ్యాపారులు ఇక్కడ పెట్టుబడి పెట్టి దుకాణాలు తీసుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని 71 మద్యం దుకాణాలకుగానూ 54 మంది కొత్త వారికి లైసెన్స్ దక్కింది. వీళ్లలో దాదాపు 80 శాతం మంది సిండికేట్ల వలకు చిక్కి వ్యాపారం నుంచి తప్పుకున్నావారే. రాష్ట్రంలోనే ఎక్కువ దరఖాస్తులతో సంచలనం సృష్టించిన జాన్‌పహడ్ మద్యం దుకాణాన్ని ఆంధ్రా చెందిన ఓ సిండికేటు రూ.కోటికి సొంతం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మున గాల మండలంలోని ఓ దుకాణాన్ని రూ.63 లక్షలకు, మేళ్లచెరువులో ఓ షాపును రూ.44 లక్షలకు, గరిడేపల్లి మండ లం కీతవారిగూడెంలోని దుకాణాన్ని రూ.48 లక్షలకు, హుజూర్‌నగర్‌లోని ఓ షాపు ను రూ.40 లక్షలకు, సూర్యాపేటలో రెండు దుకాణాలకు రూ.40 లక్షలు, తుంగతుర్తి మండల కేంద్రంలోని దుకాణానికి రూ.15 లక్షలు చెల్లించి సిండికేటు గ్రూపులు వ్యాపారాన్ని సొంతం చేసుకున్నాయి. ఏజెన్సీ దుకాణాలు అన్యాక్రాంతం.. ఏజెన్సీలోని మద్యం దుకాణాలు సిండికేట్ల చేతుల్లోనే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మొత్తం 109కుగాను 98 దుకాణాలకు ఎౖక్సైజ్ అధికారులు లైసెన్స్‌లు కేటాయించారు. నిబంధనల ప్రకారం ఈ దుకాణాలను గిరిజనులే నిర్వహించాలి. కానీ, వీటిలో 90 షాపులు సిండికేట్ల చేతుల్లోకి వెళ్లాయి. గిరిజన లైసెన్స్‌దారునికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఇచ్చి వ్యాపారాన్ని సొంతం చేసుకున్నారు. ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన.. : ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ఎౖక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కఠినంగా ఉండటంతో సిండికేట్లు.. బెల్టు షాపులను సంపాదనా సాధనాలుగా మార్చుకుంటున్నారు. గత నెల వరకు ప్రతి క్వార్టర్‌పై రూ.2 అదనంగా వసూలు చేసిన సిండికేట్లు 10 రోజులుగా దీన్ని రూ.5కు పెంచారు. రెవెన్యూ గ్రామంలో సగటున 5, ప్రతి హాబిటేషన్ గ్రామంలో ఒకటి చొప్పున రాష్ట్రంలోని 65 వేలకుపైగా బెల్టుషాపులు ఉన్నాయి. ఎక్సైజ్ అధికారులే మధ్యవర్తులు? ఒకరికి వచ్చిన దుకాణాన్ని మరొకరు నడపటం ఎౖక్సైజ్ నిబంధనలకు విరుద్ధం. రూ.లక్షలు గుడ్‌విల్ ఇచ్చి లాభా లు ఆర్జించేందుకు వక్రమార్గం పడతారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటువంటి వాటిని స్థానిక ఎక్సైజ్ అధికారులు ఆదిలోనే గుర్తించి నివారించాలి. కానీ, కొన్ని చోట్ల వారే మధ్యవర్తిత్వం చేసి దుకాణాలు అప్పగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
నిషాకూ కల్తీ!
మద్యం బాటిళ్లలో నీళ్లు కలుపుతున్న డిస్టిలరీలు, వ్యాపారులు - మొలాసిస్ ధర పెరగడంతో డిస్టిలరీలపై వ్యయ భారం - భారం తగ్గించుకునేందుకు ఆల్కహాల్ శాతాన్ని తగ్గిస్తున్న వైనం పెగ్గు మీద పెగ్గు కొడితే.. నిషా నింగినంటాలె.. చుక్కలు నేలకు దిగి రావాలె.. కానీ ఒకటి.. రెండు.. మూడు.. నాలుగో పెగ్గు వేసినా ‘కిక్కు’ ఎక్కడం లేదు.. తాగీ తాగీ నాలుక మందమైందా లేక ‘మందు’కు శరీరం పూర్తిగా అలవాటు పడిపోయిందా తెలియక మందు బాబులు జుట్టు పీక్కుంటున్నారు.. కానీ అసలు కారణం మాత్రం మందు ‘పలుచబడి’పోవడమే! ఇటు డిస్టిలరీలు మద్యంలో ఆల్కహాల్ శాతాన్ని తగ్గించి నీళ్లు కలుపుతుండటం... అటు మద్యం వ్యాపారులు బాటిళ్ల నుంచి మద్యం తీసి నీళ్లు కలిపేస్తుండటంతో మందు బాబులకు ‘కిక్కు’ ఎక్కడం లేదు. వ్యాపారులు మీడియం, ప్రీమియం లిక్కర్ ఫుల్ బాటిళ్ల మూతల నుంచి సిరంజి గుచ్చి మద్యాన్ని లాగేస్తున్నారు.. ఆ మేరకు నీటితో, చీప్ లిక్కర్‌తో నింపేస్తున్నారు. డిస్టిలరీలు, మద్యం దుకాణాలపై ఎక్సైజ్ పర్యవేక్షణ కొరవడటం, నిఘా తగ్గిపోవడంతో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. అయితే ఎక్సైజ్ అధికారులు మాత్రం ఇలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. మొలాసిస్ దొరకడం లేదని.. డబ్బు మిగిలించుకోవడం కోసం డిస్టిలరీలు మద్యంలో ఆల్కహాల్ శాతం తగ్గించి నీటి శాతం పెంచుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో చక్కెర పరిశ్రమలు లేకపోవటంతో చెరుకు నుంచి ఉత్పత్తయ్యే మొలాసిస్ కొరత ఉంది. దాంతో మద్యం ఉత్పత్తికి డిస్టిలరీలు గ్రెయిన్ మొలాసిస్ వాడుతున్నాయి. చెరుకు మొలాసిస్ ఈఎన్ఏ లీటర్‌కు మార్కెట్లో ధర రూ.35 ఉండగా... గ్రెయిన్ మొలాసిస్ ఈఎన్ఏ లీటర్‌కు రూ.45 నుంచి రూ.48 వరకు ఉంది. గ్రెయిన్ మొలాసిస్ నుంచి మద్యం నాణ్యంగా ఉత్పత్తికాదు. దాంతో వివిధ రకాల ఫ్లేవర్లు, రసాయనాలు కలిపి మద్యాన్ని సాధారణ స్థితికి తీసుకువస్తారు. ఇదంతా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. ఇలా పెరిగిన ఖర్చును సర్దుబాటు చేసుకునేందుకు డిస్టిలరీల యాజమాన్యాలు మద్యంలో నీటి శాతం పెంచుతున్నట్లు విశ్వస నీయంగా తెలిసింది. లిక్కర్ తయారీలో ఈఎన్ఏ(ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కాహాల్) వాడతా రు. నిబంధనల ప్రకారం ఇది 42.8 శాతం, మిగతా శాతం నీళ్లుండాలి. కానీ డిస్టిలరీలు నీటిని పెంచి, ఈఎన్ఏను తగ్గిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలోని డిస్టిలరీలు రోజుకు 10వేల కేసులకుపైగా మద్యం ఉత్పత్తి చేయగలవు. అందులో ఒక శాతం నీళ్లు కలిపినా 5,000 లీటర్ల ఈఎన్ఏ మిగులుతుంది. దీంతో అదనంగా 550 కేసుల మద్యం ఉత్పత్తి అవుతుంది. తద్వారా రూ.3.20 లక్షల అదనపు ఆదాయం సమకూరుతుంది. చాలా ఏళ్ల నుంచి దందా.. వ్యాపారులు మద్యంలో నీళ్లు కలుపుతూ సొమ్ము దండుకుంటున్న దందా చాలా ఏళ్ల నుంచి కొనసాగుతోంది. డిస్టిలరీలు, వ్యాపారులు మద్యంలో నీళ్లు కలిపి విక్రయించడంపై నాలుగేళ్ల కింద పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దానిపై పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. దాంతో అప్పటి సికింద్రాబాద్ ఎక్సైజ్ సీఐ అంజిరెడ్డి (ప్రస్తుతం ఏఈఎస్) తన పరిధిలోని మద్యం దుకాణాల నుంచి నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. దాంతో ఆఫీసర్స్ చాయిస్, అరిస్ట్ర్రోకాట్, అశోక విస్కీ బ్రాండ్లలో కల్తీ జరిగినట్లు తేలింది. ఈ మూడు బ్రాండ్లు కూడా హైదరాబాద్ శివార్లలోని ఒకే డిస్టిలరీ సంస్థ నుంచి ఉత్పత్తి అయినట్లు గుర్తించి, నోటీసులు కూడా జారీ చేశారు. అంతకు ముందు సీగ్రామ్ బ్రాండ్లలోనూ నీళ్ల శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. సిరంజి వేసి.. మద్యం గుంజి.. ఇక నెల రోజుల్లో మద్యం దుకాణాల లీజు సమయం ముగుస్తుండటంతో వ్యాపారులు అడ్డగోలు వ్యవహారానికి తెరలేపారు. బాటిళ్ల నుంచి మద్యం తీసి.. నీళ్లు కలిపేసి అమ్ముతున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం గంజాయి, డ్రగ్స్ వ్యవహారంలో బిజీగా ఉండి.. పర్యవేక్షణను వదిలేయడం కూడా వారికి కలసి వచ్చింది. ముఖ్యంగా ప్రీమియం, మధ్యస్థాయి ధర ఉన్న బ్రాండ్ల ఫుల్ బాటిళ్ల నుంచి మద్యాన్ని తీసి.. అంతే మోతాదులో నీళ్లు కలుపుతున్నారు. వాటి మూతల ద్వారా సిరంజిలు గుచ్చి.. ఒక్కో బాటిల్ నుంచి 90 మిల్లీలీటర్ల నుంచి 150 మిల్లీలీటర్ల దాకా లాగేస్తున్నారు. ఈ మద్యాన్ని ఖాళీ క్వార్టర్ బాటిళ్లలో నింపి సీలు వేసి విక్రయిస్తున్నారు. పలు చోట్ల విడిగా గ్లాసుల్లో పోసి అమ్ముతున్నారు. కొందరు వ్యాపారులు ప్రీమియం బ్రాండ్ల బాటిళ్ల నుంచి మద్యాన్ని తీశాక.. ఆ స్థానంలో చీప్‌లిక్కర్‌ను నింపుతున్నారు. ఒకప్పుడు బార్లకే పరిమితమైన ఈ దందా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని చాలా దుకాణాలకు పాకింది. ఈ నీళ్లు కలిపే వ్యవహారమంతా రాత్రికి రాత్రే సాగుతోంది. మద్యం దుకాణం మూసేశాక.. లోపల కొందరు పనివాళ్లను ఉంచి ఉదయం దాకా కల్తీ పని కానిచ్చేస్తున్నారు. -
గ్లామర్ పార్ట్ పూర్తయింది
- సెప్టెంబర్‌లో సెకండ్ పార్ట్ మొదలవచ్చు - డ్రగ్ కేసులో ఎక్సైజ్ ఈడీ అకున్ సబర్వాల్ సాక్షి, హైదరాబాద్: డ్రగ్ కేసులో మొదటి ఎపిసోడ్ గ్లామర్ పార్ట్ విచారణ పూర్తయిందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇక రెండో జాబితా ఉండబోదని పరోక్షంగా వెల్లడించారు. శుక్రవారం ఇఫ్లూలో డ్రగ్స్ నియంత్రణపై జరిగిన అవగాహన కార్యక్రమంలో భాగంగా అకున్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు అరెస్టయిన వారి విచారణలో వెల్లడైన అంశాలను బట్టి సెప్టెంబర్‌లో రెండో జాబితా ఉంటుందని తెలిపారు. తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, స్వతంత్రంగా, స్వేచ్ఛగా విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు డ్రగ్స్ వ్యవహారంలో 11 కేసులు నమోదయ్యాయని, వాటిలో చార్జిషీట్ వేసేందుకు కసరత్తు పూర్తి చేశామన్నారు. పలువురి రక్తం, గోర్లు, వెంట్రుకల శాంపిల్స్ సేకరించామని, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని చెప్పారు. ఆ రిపోర్టుల కోసం వేచిచూస్తున్నామని, అవి అందగానే చార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు. -
అనుమానాస్పద పార్శిళ్లపై నజర్
పోస్టల్, నిఘా సంస్థలతో కలసి సిట్ పటిష్ట నిఘా - కార్గో ద్వారా వచ్చే డ్రగ్స్‌ను పట్టుకునేందుకు ఇన్ఫార్మర్ వ్యవస్థ - సినీ ప్రముఖులకు వస్తున్న కొరియర్లపై ఆరా - రామానాయుడు స్టూడియోలో తనిఖీ - పార్శిల్లో వెన్నునొప్పి పరికరం ఉండటంతో వెనుదిరిగిన అధికారులు సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసులో పలువురికి నోటీసులిచ్చి విచారణ పూర్తి చేసిన సిట్ తాజాగా అనుమానాస్పద పార్శిళ్లపై దృష్టి సారించింది. పోస్టల్, కొరియర్ సంస్థల ద్వారా వస్తు న్న అనుమానిత పదార్థాలు, వస్తువులు కస్టమర్లకు చేరుతున్నట్లు గుర్తించింది. ఎల్ఎస్డీ, ఎండీఎంఏ వంటి డ్రగ్స్ కూడా ఇలాగే సినీ ప్రముఖులతోపాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విద్యార్థులకు చేరాయని ఇప్పటికే ఆధారాలతో నిరూపించింది. దీనిలో భాగంగా పోస్టల్ శాఖ తో పాటు పలు ప్రముఖ కొరియర్ సంస్థలతో నిఘా పటిష్టం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోకి డ్రగ్స్ రాకుండా అడ్డుకునేందుకు నియంత్రణ చర్యలు చేపట్టామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. వివిధ దేశాల నుంచి విమాన సర్వీసుల్లోని కార్గోల ద్వారా వస్తున్న డ్రగ్స్‌ను అరికట్టేందుకు ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టపరుచుకున్నామని చెప్పింది. దీని నుంచి అందుతున్న సమాచారంతో మంగళవారం ముంబై నుంచి వచ్చిన దక్షిణాఫ్రికా వాసి నుంచి 10 గ్రాముల కొకైన్‌తోపాటు ఎల్ఎస్డీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని అధి కారులు తెలిపారు. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్ట మ్స్, డిటెక్టివ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కోటి క్ కంట్రోల్ బ్యూరో సహకారంతో డ్రగ్స్ ముఠాలపై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించే యోచనలో ఉన్నట్టు కీలకాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించుతామని తెలిపారు. డ్రగ్స్ కాదు.. వెన్నునొప్పి పరికరం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం ఫిల్మ్‌నగర్‌లోని రామానాయుడు స్టూడియోలో 3గంటల పాటు తనిఖీ చేశారు. విదేశాల నుంచి వచ్చిన ఓ పార్శిల్‌ను స్వాధీనం చేసుకొని తనిఖీ లు నిర్వహించారు. ఈ పార్శిల్లో వెన్నునొప్పికి సంబంధించిన పరికరం ఉందని ఇన్స్పెక్టర్ కనకదుర్గ తెలిపారు. అది తన కుమారుడు, హీరో రానాకు వచ్చిందని, అది వెన్నునొప్పికి సంబంధించినదని నిర్మాత సురేశ్‌బాబు వెల్లడించారు. -
మాపై అభాండాలు ఆపండి.
-
మాపై అభాండాలు ఆపండి
లేదంటే పరువు నష్టం దావా వేస్తాం: అకున్ సబర్వాల్ - సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే విచారణ ఎవరినీ టార్గెట్ చేయడం లేదు - ఇప్పటిదాకా 27 మందికి నోటీసులిచ్చాం.. 19 మందిని అరెస్ట్ చేశాం - విద్యార్థులను విచారించం.. తల్లిదండ్రుల ఎదుటే కౌన్సెలింగ్ ఇస్తున్నాం సాక్షి, హైదరాబాద్: తమ విభాగంపై, తమపై ఇష్టా రాజ్యంగా ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే తాము డ్రగ్స్ కేసులో దర్యాప్తు చేస్తున్నామని స్పష్టంచేశారు. కేవలం సినిమా వాళ్లనే టార్గెట్ చేసినట్టు వస్తున్న వార్తలను ఖండించారు. ఇప్పటివ రకు ఈ కేసులో 27 మందికి నోటీసులిచ్చామని, అలాగే కెల్విన్‌తో కలిపి 19 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్రెండ్లీ వాతావరణంలో విచారిస్తున్నాం.. సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులిచ్చా మని, వారిలో ఇప్పటికి ఐదుగురిని ప్రశ్నించామని అకున్ పేర్కొన్నారు. అందరినీ మర్యాదపూర్వకంగా, ఫ్రెండ్లీ వాతావరణంలో విచారిస్తున్నామన్నారు. ‘‘ప్రత్యేకమైన గదిలో విచారణ జరుగుతోంది. ప్రతీ అంశాన్ని వీడియో రికార్డు చేస్తున్నాం. శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్ నేతృత్వంలో రెండు సిట్ బృందాలు విచారి స్తున్నాయి. విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులు స్వతంత్రంగా, రాతపూర్వకంగా ఒప్పుకున్నాకే వారి నుంచి నమూనాలు సేకరిస్తున్నాం. విచారణలో ప్రతీ 8 గంటలకోసారి తమ బృందంలోని వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నాం’’ అని ఆయన వివరించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడలేం సినీ ప్రముఖుల మాదిరే విద్యార్థులను విచారిస్తారా అని వస్తున్న ప్రశ్నలపై అకున్ స్పందించారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడలేమని, అందరికీ పిల్లలున్నారని, తాము అలాంటి పొరపాటు ఎట్టి పరిస్థితుల్లో చేయమని స్పష్టంచేశారు. వారంతా మైనర్లు కావడం వల్ల తల్లిదండ్రుల ఎదుటే కౌన్సెలింగ్ ఇస్తున్నామని, అలాగే డ్రగ్స్ నియంత్రణపై పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మాకు అన్ని అధికారాలున్నాయి.. డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ విభాగానికి విచారణ అధికా రం లేదని, దర్యాప్తు అధికారులు సరిగ్గా లేరని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై అకున్ తీవ్ర స్థాయి లో స్పందించారు. గతేడాది జూన్‌లో ఎక్సైజ్ విభా గానికి ప్రభుత్వం ప్రత్యేకమైన అధికారాలు కట్టబెట్టిం దని స్పష్టంచేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఇలాంటి కేసుల్లో తమ విభాగానికి పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. సెక్షన్ 41, 42, 53 కింద నమోదైన కేసుల్లో లోతుగా దర్యాప్తు చేసే అధికారం ఉందని తేల్చిచెప్పారు. డ్రగ్స్ తీసుకున్నా, కొనుగో లు చేసినా, విక్రయించినా, ఇంట్లో పెట్టుకున్నా కేసు లు నమోదు చేసే అధికారం ఉందని వెల్లడించారు. మహిళా అధికారులే విచారిస్తారు.. నిజాయితీ కలిగిన సీనియర్ ఐపీఎస్‌లు, డిటెక్టివ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో.. తదితర విభాగాలతో ప్రతీక్షణం టచ్‌లో ఉంటున్నామని, దర్యాప్తులో సందేహాలుంటే తీర్చుకుంటున్నామని అకున్ తెలిపారు. పోలీస్ శాఖలో ఉన్న సీనియర్ ఐపీఎస్‌ల సలహాలు కూడా తీసుకుంటున్నామని వివరించారు. తమ వద్ద ఎక్సైజ్‌లో టాప్ మోస్ట్ ఇన్వెస్టిగేషన్ అధికారులు న్నారని, సిట్ బృందంలో మహిళా అధికారులను కూడా నియమించామని తెలిపారు. విచారణలో ఇన్స్పెక్టర్ జయలక్ష్మి చురుగ్గా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. డ్రగ్స్ కేసులో మహిళలను ప్రశ్నించేందుకు మహిళా అధికారులుంటారని స్పష్టంచేశారు. తనకు వస్తున్న బెదిరింపు ఫోన్‌కాల్ వ్యవహారంలో భయపడాల్సిన అవసరం లేదని, అలాంటివి చూసుకోవడానికి తన వద్ద ఉన్న ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు సరిపోతారని నవ్వుతూ బదులిచ్చారు. చట్టానికి లోబడే విచారణ: చంద్రవదన్ డ్రగ్స్ కేసు విచారణలో తమ సిట్ బృందం చట్టానికి లోబడి, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే ముం దుకు వెళ్తోందని ఎౖక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ చెప్పారు. సిట్ విచారణకు మరి కొందరు హాజరుకావాల్సి ఉందన్నారు. ఆగస్టు 2 వరకు వారంతా విచారణకు వస్తారని మీడియాకు వివరించారు. సిట్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోం దని, సమర్థవంతమైన అధికారులున్నారని, ఈ కేసులో ఎవరినీ వదలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఒకరిని టార్గెట్‌గా చేసుకొని వెళ్లాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ఇప్పటివరకు 3 వేల యూనిట్ల ఎల్ఎస్డీ డ్రగ్, 100 యూనిట్ల ఎండీ ఎంఏ, 45 గ్రాముల కొకైన్ ఇతరత్రా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సినీ నటి చార్మి హైకోర్టుకు వెళ్లడంపై చంద్రవదన్ స్పంది స్తూ... ‘‘మాకు కోర్టు నుంచి ఎలాంటి అధికారిక పత్రాలు అందలేదు. అయినా మా న్యాయ బృందం ఆ అంశాలపై కౌంటర్‌కు రెడీ అవుతోంది. బ్లడ్, ఇతర శాంపిల్స్‌ను ఎవరిని నుంచి బలవం తంగా తీసుకోవడం లేదు. స్వచ్ఛందంగా ఇస్తేనే తీసుకుంటున్నాం’’ అని అన్నారు. చార్మితోపాటు ముమైత్‌ఖాన్ సిట్ కార్యాల యంలోనే విచారణకు హాజరవుతారని భావిస్తున్నామని పేర్కొన్నారు. మంగళవారం సిట్ ఎదుట సినీ ఆర్డ్ డైరెక్టర్ ధర్మారావు అలియాస్ చిన్నా హాజరవుతారని తెలిపారు. -
డ్రగ్స్ కేసులో రేపటి నుంచి సినీ నటుల విచారణ
హైదరాబాద్ : సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు జారీ చేసిన సినీ నటులను రేపటి (బుధవారం) నుంచి, ఈ నెల 27 వరకూ రోజుకొకరిని విచారణ చేస్తామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ నటి ముమైత్ ఖాన్ మినహా అందరూ విచారణకు హాజరు అవుతారని తెలిపారు. డ్రగ్స్ మాఫియాపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని, తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. కాగా డ్రగ్స్ వ్యవహారంతో సినీ ప్రముఖుల లింకు బయటపడటంతో సినీ హీరో, హీరోయిన్లు, దర్శకుడు సహా 12 మందికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు జారీ చేసింది. వారంతా ఈ నెల 19 నుంచి 27 మధ్య సిట్ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. పేరుమోసిన డ్రగ్స్ సరఫరాదారుడు కెల్విన్ కాల్‌లిస్ట్ ఆధారంగా వీరికి తెలంగాణ ఎక్సైజ్‌శాఖ నోటీసులు జారీచేసింది. ఈ నెల 19న ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, 20న హీరోయిన్ ఛార్మీ, 22న నటుడు సుబ్బరాజు, 23న ప్రముఖ కెమెరామెన్ శ్యాం కే నాయుడు సిట్ ఎదుట హాజరుకాబోతున్నారు. ఇక ప్రముఖ హీరో రవితేజ ఈ నెల 24న సిట్‌ను ఫేస్ చేయబోతున్నాడు. 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను, 26న హీరో నవదీప్, 27న హీరో తరుణ్, 28న యువ హీరోలు తనీష్, నందులను సిట్ విచారించనుంది. కాగా ఓ టీవీ చానల్లో బిగ్ బాస్ కార్యక్రమంలో ముమైత్ ఖాన్ బిజీగా ఉండటంతో ఆమె స్వయంగా సిట్ ఎదుట హాజరు అయ్యేందుకు మినహాయింపు లభించినట్లు తెలుస్తోంది. -
అకున్ సబర్వాల్ అనూహ్య నిర్ణయం!
సెలవులు రద్దు.. ఇక ఫుల్ ఫోకస్ డ్రగ్స్ కేసుపైనే హైదరాబాద్: రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం. ఉన్నట్టుండి సెలువులపై వెళుతున్నట్టు ప్రకటించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ మనస్సు మార్చుకున్నారు. ఆయన తాజాగా తన సెలువులు రద్దు చేసుకున్నారు. డ్రగ్స్ కేసు విచారణ కీలక దశలో ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తన సెలువులు రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో డ్రగ్స్ కేసుసస దర్యాప్తు పూర్తయ్యే వరకు సెలవులు రద్దు చేసుకుంటున్నట్టు అకున్ సబర్వాల్ తెలిపారు. ‘డ్రగ్స్’ వ్యవహారాన్ని మూలాల నుంచి పెకలిస్తున్న ఆయన అనూహ్యంగా సెలువుపై వెళుతున్నట్టు శుక్రవారం ప్రకటించడంతో పలు అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఆదివారం నుంచి ఈ నెల 27 వరకు పది రోజులు విధులకు దూరంగా ఉండనున్నానని అకున్ ప్రకటించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీచేసి, విచారించనున్న కీలక సమయంలో ఆయన సెలవుపై వెళుతున్నట్టు ప్రకటించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇతర కేసుల లాగానే ఈ డ్రగ్స్ కేసు పనికూడా అయిపోయినట్లేననే విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే అకున్ సబర్వాల్ తన సెలువులను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల అసంతృప్తితో.. డ్రగ్స్ వ్యవహారం కేసు తొలి నుంచి వివాదాస్ప దం అవుతోంది. డ్రగ్స్ మాఫియా స్కూల్ పిల్లల ను కూడా వదిలిపెట్టడం లేదని.. పలు ఇంటర్నేషనల్ స్కూళ్ల పిల్లలు డ్రగ్స్ బారిన పడ్డారని అకున్ సబర్వాల్ బయటపెట్టారు. డ్రగ్స్ వ్యవహారంపై ఈనెల 18న నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని దాదాపు 40 పాఠశాలలు, 80 కళాశాల యాజమాన్యాలకు అడ్వైజరీ నోట్లు కూడా పంపారు. అయితే దీనిని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తప్పుబ ట్టారు. విచారణ అధికారి (సబర్వాల్) అత్యు త్సాహం చూపిస్తున్నారంటూ బాహాటంగానే విమర్శించారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు ఇదే సమయంలో డ్రగ్స్ వ్యవహారంతో సినీ ప్రముఖుల లింకు బయటపడింది. దీంతో సినీ హీరో, హీరోయిన్లు, దర్శకుడు సహా 12 మందికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు జారీ చేసింది. వారంతా ఈ నెల 19 నుంచి 27 మధ్య సిట్ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. అంతేగాకుండా మరింత మంది సినీ పెద్దలకూ నోటీసులు అందించేందుకు సిద్ధమైంది. ఇలా కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో విచారణాధికారి అకున్ సబర్వాల్‌కు 10 రోజుల పాటు సెలవులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం.. కలకలం రేపింది. అకున్ సబర్వాల్ ఉన్నట్టుండి సెలవుపై వెళ్తాననడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఇది కేసును నీరుగార్చడానికేనన్న ఆరోపణలు వినవచ్చాయి. సెలవు తీసుకోవడానికి సబర్వాల్ చెప్పిన పరస్పర విరుద్ధ కారణాలు ఈ ఆరోపణలకు బలాన్నిచ్చాయి. ఉదయం ఒక టీవీ చానల్‌తో మాట్లాడిన ఆయన.. సెలవు పెట్టి హిమాలయాల్లో పర్వతారోహణకు వెళ్తు న్నట్లు చెప్పారు. జాతీయ పోలీసు అకాడమీ బృందంతో కలసి వెళ్లేందుకు అనుమతించాలంటూ గతంలోనే ప్రభుత్వాన్ని కోరానన్నారు. అయితే గంట సేపటి అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సెలవుపై మాట మార్చారు. రెండు నెలల కింద తన తల్లి చనిపోయారని, మరణం అనంతరం నిర్వహించే కార్యక్రమాల కోసం పంజాబ్‌లోని స్వగ్రామానికి వెళుతున్నానని చెప్పారు. ఈ ఆరోపణలు, అనుమానాల నేపథ్యంలోనే అకున్ తన మనస్సు మార్చుకొని డ్రగ్స్ కేసు విచారణ కోసం సెలువులు రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. -
‘డ్రగ్స్’ కేసుకు సెలవు?
- రేపటి నుంచి 27వ తేదీ వరకు సెలవులో అకున్ సబర్వాల్ - పర్వతారోహణకు వెళ్తున్నా అంటూ ఓ చానల్‌కు వెల్లడి - కొద్దిసేపటికే తమ స్వగ్రామానికి వెళ్తున్నానంటూ మాట మార్పు సాక్షి, హైదరాబాద్: ‘డ్రగ్స్’వ్యవహారాన్ని మూలాల నుంచి పెకలిస్తున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ఉన్నట్టుండి సెలవుపై వెళుతున్నారు. ఆదివారం నుంచి 27 వరకు పది రోజులు విధులకు దూరంగా ఉండనున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసి, విచారించనున్న కీలక సమయంలో ఆయన సెలవుపై వెళుతుండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర కేసుల లాగానే ఈ డ్రగ్స్ కేసు పనికూడా అయిపోయినట్లేననే అభిప్రాయాలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల అసంతృప్తితో.. డ్రగ్స్ వ్యవహారం కేసు తొలి నుంచి వివాదాస్ప దం అవుతోంది. డ్రగ్స్ మాఫియా స్కూల్ పిల్లల ను కూడా వదిలిపెట్టడం లేదని.. పలు ఇంటర్నేషనల్ స్కూళ్ల పిల్లలు డ్రగ్స్ బారిన పడ్డారని అకున్ సబర్వాల్ బయటపెట్టారు. డ్రగ్స్ వ్యవహారంపై ఈనెల 18న నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని దాదాపు 40 పాఠశాలలు, 80 కళాశాల యాజమాన్యాలకు అడ్వైజరీ నోట్లు కూడా పంపారు. అయితే దీనిని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తప్పుబ ట్టారు. విచారణ అధికారి (సబర్వాల్) అత్యు త్సాహం చూపిస్తున్నారంటూ బాహాటంగానే విమర్శించారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు ఇదే సమయంలో డ్రగ్స్ వ్యవహారంతో సినీ ప్రముఖుల లింకు బయటపడింది. దీంతో సినీ హీరో, హీరోయిన్లు, దర్శకుడు సహా 12 మందికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు జారీ చేసింది. వారంతా ఈ నెల 19 నుంచి 27 మధ్య సిట్ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. అంతేగాకుండా మరింత మంది సినీ పెద్దలకూ నోటీసులు అందించేందుకు సిద్ధమైంది. ఇలా కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో విచారణాధికారి అకున్ సబర్వాల్‌కు 10 రోజుల పాటు సెలవులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన శుక్రవారమే హైదరాబాద్ నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. విరుద్ధ సమాధానాలతో.. అకున్ సబర్వాల్ ఉన్నట్టుండి సెలవుపై వెళ్లటం అనేక అనుమా నాలకు తావి స్తోంది. ఇది కేసును నీరుగార్చడానికేనన్న ఆరోపణలు వస్తున్నాయి. సెలవు తీసుకోవడానికి సబర్వాల్ చెప్పిన పరస్పర విరుద్ధ కారణాలు ఈ ఆరోపణలకు బలాన్నిస్తున్నాయి. ఉదయం ఒక టీవీ చానల్‌తో మాట్లాడిన ఆయన.. సెలవు పెట్టి హిమాలయాల్లో పర్వతారోహణకు వెళ్తు న్నట్లు చెప్పారు. జాతీయ పోలీసు అకా డమీ బృందంతో కలసి వెళ్లేందుకు అనుమతించాలంటూ గతంలోనే ప్రభు త్వాన్ని కోరానన్నారు. అయితే గంట సేపటి అనంతరం మీడియాతో మాట్లా డిన ఆయన సెలవుపై మాట మార్చారు. రెండు నెలల కింద తన తల్లి చనిపో యారని, మరణం అనంతరం నిర్వహించే కార్యక్రమాల కోసం పంజాబ్‌లోని స్వగ్రామానికి వెళుతున్నానని చెప్పారు. కేసు దర్యాప్తుకు, సెలవుకు సంబంధం లేదన్నారు. ఎన్నో సందేహాలు అకున్ సబర్వాల్ పర్వతారోహణకు వెళ్లనున్నట్ల యితే... కీలకమైన కేసు విచారణ, సంచలన అంశాలు బయటికి వస్తున్న నేపథ్యంలో సెలవును రద్దు చేసుకోవ చ్చు. ఒక వేళ తన తల్లి మర ణానంతర కార్యం అనుకుంటే... హిందూ సంప్రదాయాల ప్రకారం ఆ క్రతువులో తన జీవిత భాగస్వామి స్మితా సబర్వాల్ కూడా పాల్గొనాలి. కానీ ఆమె విధుల్లోనే సాగు తున్నారు. అయితే ప్రభుత్వమే అకున్ సబర్వాల్ ఎప్పుడో విజ్ఞప్తి చేసిన సెలవులను వ్యూహాత్మకంగా ఇప్పుడు మంజూరు చేసి, రాష్ట్రం దాటించిందనే ఆరోపణలు వస్తున్నాయి. -
మూడు విభాగాల్లో డ్రగ్స్ చిచ్చు!
♦ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయంటూ డిప్యూటీ సీఎం మండిపాటు ♦ దర్యాప్తు సంస్థ తీరుపై రాష్ట్ర పోలీసు బాస్‌కు ఫిర్యాదు ♦ టు విద్యాశాఖ, అటు పోలీస్ శాఖపై పెరుగుతున్న ఒత్తిడి ♦ లీకులతో గందరగోళంగా మారిన కేసు సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసు మూడు ప్రభుత్వ విభాగాల మధ్య చిచ్చు రేపుతోంది. ఎక్సైజ్ శాఖ పట్టుకున్న డ్రగ్స్ కేసులో స్కూళ్లు, కాలేజీలు, హోటళ్లు, సాఫ్ట్వేర్ సంస్థలు, బహుళజాతి కంపెనీలు, సినీ పరిశ్రమ.. ఇలా ఎన్నో రంగాలకు చెందినవారి భాగస్వామ్యం బయటపడుతోంది. దీంతో డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతోపాటు.. పోలీసు శాఖ, విద్యా శాఖలను కూడా ఈ కేసు ఉక్కిరిబిక్కిరి చేస్తోం ది. కొందరు విద్యార్థులు డ్రగ్స్‌ను వినియో గిస్తే మొత్తం పాఠశాలల ప్రతిష్ట దెబ్బతినేలా లీకులివ్వడంపై విద్యాశాఖ తీవ్రంగానే స్పందిస్తోంది. ఇక అసలే సరిపడా సిబ్బంది లేని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఈ కేసులో భారీ స్థాయిలో లింకులు బయట పడుతున్నా కూడా పోలీసుల సహాయం తీసుకోకపోతుండడం చర్చనీ యాంశమైంది. విచారణ సంస్థ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అత్యుత్సాహం ప్రదర్శిస్తోం దని స్వయంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండి పడ్డారు కూడా. అనవసరపు లీకులిచ్చి విద్యా సంస్థల పేర్లు బయటకు చెప్పడం వల్ల విద్యా ర్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో మునిగి పోతున్నారని ఆయన పేర్కొన్నారు. స్కూల్ లో ఒకరిద్దరు పిల్లలు డ్రగ్స్ తీసుకుంటే మిగతా విద్యార్థుల తల్లిదండ్రులంతా ఆందో ళన చెందుతారని.. ఇలాంటి సున్నితమైన విషయాల్లో సంయమనం పాటించాలని సూచించారు. అంతేగాకుండా దర్యాప్తు సంస్థ, అధికారుల అత్యుత్సాహంపై డీజీపీకి, ఉన్న తాధికారులకు కడియం ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. లీకులతో ఒత్తిళ్లు.. డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖ కాలే జీలు, స్కూళ్ల విద్యార్థులు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు లీకులివ్వడంతో.. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగినట్టు కనిపిస్తోంది. స్కూల్లో ఒకరో ఇద్దరో విద్యార్థులు డ్రగ్స్ తీసు కుంటే.. నోటీసుల పేరుతో తమను బజారుకీడ్చారంటూ ప్రముఖ ఇంటర్నేషన ల్ స్కూళ్లు విద్యాశాఖకు ఫిర్యాదులు చేయ డం గమనార్హం. డ్రగ్స్ తీసుకున్న విద్యార్థుల ను, వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తే సరిపోయేదనే అభిప్రాయం వ్యక్త మవుతోంది. అనవసరపు హడావుడితో.. డ్రగ్స్ అనగానే సాధారణంగా టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ కంట్రోల్ విభాగాలు గుర్తుకువస్తాయి. అయితే ఎక్సైజ్ శాఖకు కూడా కేసులు వేసి, దర్యాప్తు చేసే అధికారం ఉండటంతో... తొలిసారిగా భారీ కేసును చేపట్టింది. కానీ దర్యాప్తులో మాత్రం అత్యుత్సాహం ప్రద ర్శించిందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో పోలీసు శాఖ కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ కేసులు పట్టుకుని.. రెండు మూడు రోజుల్లోనే పూర్తి లింకులను ఛేదించాక బయటకు వెల్లడించేది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మాత్రం పూర్తి స్థాయిలో లింకులను ఛేదించకుండానే హడావుడిగా డ్రగ్స్ కేసును బయటపెట్టి అత్యుత్సాహం ప్రదర్శించిందనే విమర్శలు వస్తున్నాయి. ఇంత భారీ కేసులో పోలీసులు, నార్కో టిక్ కంట్రోల్ బ్యూరో సహాయం కోరాల్సి ఉన్నా.. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పట్టించు కోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
టాటూ..బ్లాసమ్!
- వాట్సాప్ గ్రూపుల్లో డ్రగ్స్‌కు కెల్విన్ కోడ్ భాష - 1,276 మందికి మాదకద్రవ్యాల సరఫరా - వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి డ్రగ్స్ దందా - నగరంలోని ప్రముఖ మహిళా కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ - రెండు ఇంటర్నేషనల్ స్కూళ్లు, పలు ఇంజనీరింగ్ కాలేజీల స్టూడెంట్స్‌కూ సరఫరా - డ్రగ్స్ కోసం కెల్విన్‌కు వారంలోనే 19 సార్లు ఫోన్ చేసిన నిర్మాత - మరో నలుగురి అరెస్ట్.. వారిలో ముగ్గురు విద్యార్థులు, ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాక్షి, హైదరాబాద్: రెండు వాట్సాప్ గ్రూప్‌లు.. వాటి పేర్లు టాటూ.. బ్లాసమ్! టాటూ అంటే ఎల్ఎస్డీ. బ్లాసమ్ అంటే ఎండీఎంఏ డ్రగ్. ఈ గ్రూపుల ద్వారా ఒక్కరిద్దరు కాదు.. ఏకంగా 1,276 మందికి మాదకద్రవ్యాల సరఫరా! స్కూళ్లు, కాలేజీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఎంఎన్సీ కార్పొరేట్లు, చివరికి ఓ ప్రముఖ మహిళా కాలేజీలో చదివే యువతులు.. అందరూ కస్టమర్లే!! రాజధాని నగరంలో కెల్విన్ డ్రగ్ సామ్రాజ్యం ఇది. మూడు ఫోన్ల ద్వారా పన్నెండు సిమ్‌కార్డులను ఎప్పటికప్పుడు మారుస్తూ కెల్విన్ డ్రగ్స్ దందాను విస్తరించినట్టు తేలింది. వాట్సాప్ గ్రూప్ లిస్ట్‌లో ఉన్న వివరాలను కూపీలాగే పనిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులున్నారు. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురిలో కెల్విన్దే ప్రధాన పాత్ర అని ఎక్సైజ్ పోలీసులు ధ్రువీకరించుకున్నారు. అతడు వాడిన మూడు ఫోన్లను సీజ్ చేసిన అధికారులు వాటి కాల్‌డేటా, వాట్సాప్ లిస్ట్‌ను చూసి బిత్తరపోయారు. ఆ కాలేజీలో 18 మంది అమ్మాయిలు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మహిళా కాలేజీ కెల్విన్ డ్రగ్ వాట్సాప్ గ్రూపులో ఉండటం సంచలనం కల్గిస్తోంది. ఈ కాలేజీకి చెందిన 18 మంది విద్యార్థినులు కెల్విన్ ఏర్పాటు చేసిన రెండు వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. అత్యంత పేరు ప్రతిష్టలు కలిగిన ఈ కాలేజీకి చెందిన విద్యార్థినులు డ్రగ్స్‌కు అలవాటుపడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇప్పటికే ఈ కాలేజీ యాజమాన్యానికి నోటీసులిచ్చామని చెప్పారు. ఈ కాలేజీకి దగ్గర్లోని ఓ బేకరీని అడ్డాగా చేసుకొని విద్యార్థినులు ఎల్ఎస్డీ స్ట్రిప్పులు స్వీకరిస్తున్నట్టు దర్యాప్తులో బయటపడిందన్నారు. వీరు డ్రగ్స్ కోసం కెల్విన్‌కు ఆర్డర్ చేసిన ప్రతీసారి ఈ బేకరీలో పనిచేసే ఓ వ్యక్తికి అబ్దుల్ వహీబ్ కవర్ ఇచ్చి వెళ్లిపోయేవాడని తెలిపారు. విద్యార్థినులు మధ్యాహ్న సమయంలో బేకరీకి వచ్చి కవర్ తీసుకొని వెళ్లిపోయినట్టు గుర్తించామన్నారు. అలాగే కూకట్‌పల్లిలోని ప్రముఖ పాఠశాల, రెండు కీలక నగరాల పేరుతో ఉన్న ఇంటర్నేషనల్ స్కూళ్లు, నగర శివారులో ఉన్న ఓ ప్రముఖ వ్యక్తి ఇంజనీరింగ్ కాలేజీ, సినిమా షూటింగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన పాత రంగారెడ్డిలోని ప్రముఖ కాలేజీలకు చెందిన విద్యార్థులు కెల్విన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఎక్సైజ్ అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటికే 25 కాలేజీలకు నోటీసులిచ్చి కౌన్సెలింగ్ నిర్వహించామని, మరో 25 కాలేజీలకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులను కాలేజీ యాజమాన్యంతోపాటు, తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. చిక్కకుండా..దొరక్కుండా! సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో డ్రగ్స్ దందా నడుపుతున్న ముఠాలు నానాటికీ తెలివి మీరుతున్నాయి. విద్యాధికులు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్లే పెడ్లర్స్ (సరఫరాదారులు)గా మారుతుండ టంతో నిఘాకు చిక్కని, పోలీసులు అందుకోలేని పంథాలో తమ ‘పనులు’ పూర్తి చేసుకుంటున్నారు. సాధారణంగా ఓ ప్రాంతంలో ఉన్న డ్రగ్ పెడ్లర్ వేరేచోట ఉన్న కస్టమర్‌కు సమాచారం చేరవేయాలంటే ఈ–మెయిల్ వాడుతాడు. అయితే ఒకవేళా ఆ పెడ్లర్ పట్టుబడితే అతడి.. మెయిల్ బాక్స్‌ను విశ్లేషించడం ద్వారా పోలీసులు మొత్తం నెట్‌వర్క్‌ను తెలుసుకో వచ్చు. దీన్ని గ్రహించిన పెడ్లర్స్ కొత్త టెక్నిక్ ఫాలో అవుతున్నారు. ఒక్క మెయిల్ కూడా పంపకుండా సమాచారాన్ని మాత్రం మార్పిడి చేసుకుంటున్నారు. అదెలాగంటే... పెడ్లర్‌కు చెందిన ఈ–మెయిల్ ఐడీలు, దాని పాస్వర్డ్స్ అతడికి డ్రగ్ సరఫరా చేసే వారితో పాటు కస్టమర్స్‌కు తెలిసే ఉంటుంది. తాను చేరవే యాలనుకునే సమాచారం, విషయాన్ని మెయిల్ బాక్స్‌లో కంపోజ్ చేసే పెడ్లర్స్ దాన్ని ‘సెండ్’ చేయకుం డా కేవలం ‘డ్రాఫ్ట్స్’ బాక్సులో సేవ్ చేసేవాడు. నిర్దేశిత సమయంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న అతడి నెట్వర్క్ మొత్తం అదే మెయిల్ బాక్స్‌ను ఓపెన్ చేసుకుని ‘డ్రాఫ్ట్స్’లో సేవ్ చేసి ఉన్న సమాచా రాన్ని తెలుసుకునేవారు. తర్వాత ఆ సమాచారాన్ని డిలీట్ చేసేవారు. మరికొం దరు పెడ్లర్స్ డిస్పోజబుల్ ఈ–మెయిల్ అడ్రస్ (డీఈఏ) అనే టెక్నిక్ వినియోగిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండటం, ఆ సమయం మించిన తర్వాత ఈ–మెయిల్‌తో పాటు దాని సమాచారం నమూనాలు చిరవకు సర్వర్లోనూ లభించకపోవడం ఈ–మెయిల్ ఐడీల ప్రత్యేకత అని వివరిస్తున్నారు. సోషల్ మీడియా.. డార్క్ వెబ్! డ్రగ్స్ ముఠాలు సోషల్ మీడియాతోపాటు డార్క్‌వెబ్/నెట్‌ను కూడా వినియోగిస్తు న్నట్టు పోలీసులు చెబుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్, టెలిగ్రాం వంటి సోషల్ మీడియా సైట్లతోపాటు డార్క్‌నెట్‌ను వాడు తున్నట్టు పేర్కొం టున్నారు. ఈ డార్క్‌నెట్‌ను ఇంటర్నెట్లో అథోజగత్తుగా చెబుతున్నారు. వీటిని సాధారణ సెర్చ్ ఇంజన్లు, సాఫ్ట్‌వేర్స్‌తో చూడలేరు. ముందు ఫ్రీగా.. తర్వాత డబ్బుకు.. ఇంటర్నేషనల్ స్కూళ్లు, ప్రముఖ కాలేజీల్లో విద్యార్థులు, ఎంఎన్సీ కంపెనీల ఉద్యోగులకు ముందుగా కెల్విన్ ఉచితంగా డ్రగ్స్ సరఫరా చేశాడని అధికారులు గుర్తించారు. వారం, పది రోజులు డ్రగ్స్‌కు అలవాటు చేసి, తర్వాత అవి లేకుండా ఉండలేని స్థితికి తీసుకువచ్చి అప్పట్నుంచి డబ్బులకు విక్రయించేవారు. ఇలా డ్రగ్స్‌కు బానిసలుగా మార్చి వారి నుంచి కెల్విన్ భారీగా డబ్బులు దండుకున్నట్టు తెలిసింది. 9, 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులను టార్గెట్‌గా ఎంచుకొని వారికి డ్రగ్స్ ముఠా మత్తు అలవాటు చేసేదని, 19 ఎంఎన్సీ కంపెనీల్లోని పలువురు ఉద్యోగులను కూడా ట్రాప్ చేసిందని అధికారులు తెలిపారు. సిల్లీగా గంజాయి ఏంటి? 2013లోనే నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కెల్విన్‌ను గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్ట్ చేశారు. రెండు నెలల పాటు జైలులో ఉన్న అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. మ్యూజీషియన్ కావడంతో స్టార్ హోటళ్లలో పలు ప్రోగ్రామ్‌లు కూడా చేశాడు. ఈ క్రమంలో గోవా నుంచి ఓ ఆఫర్ వచ్చింది. 2014 సంవత్సరంలో గోవాలోనూ ప్రోగ్రామ్ చేసేందుకు వెళ్లిన కెల్విన్‌కు అక్కడ ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడి ద్వారా డ్రగ్స్ లింకును అందిపుచ్చుకున్న కెల్విన్... షికాగో పెడ్లర్లను పట్టుకున్నాడు. అప్పట్నుంచి సిల్లీగా గంజాయి ఎందుకు సరఫరా చేయాలనుకున్న కెల్విన్.. ఎల్ఎస్డీ, ఎండీఎంఏ తదితర డ్రగ్స్‌ను సరఫరా చేయడం మొదలుపెట్టినట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. వారంలో 19 సార్లు ఫోన్ కాల్ ఇక ఈ డ్రగ్స్ కేసులో తెరపైకి వచ్చిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు.. కెల్విన్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నాడని, ఇందుకు కాల్ డేటా ఆధారాలున్నట్టు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోని కీలక అధికారి ఒకరు పేర్కొన్నారు. గోవాలో ఉండి కూడా తనకు డ్రగ్స్ కావాలంటూ సదరు నిర్మాత కెల్విన్‌ను ఆశ్రయించాడని ఆయన తెలిపారు. కేవలం వారం రోజుల్లో 19 సార్లు కెల్విన్‌కు ఫోన్ చేశాడని, లక్షల విలువైన ఎల్ఎస్డీ స్ట్రిప్స్‌ను కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో బయటపడింది. ఇందుకు గోవాలో ఉన్న కెల్విన్ స్నేహితుడు బ్యాంక్ అకౌంట్లోకి ఆ నిర్మాత రూ.3.5 లక్షల నగదును ఆన్లైన్ ద్వారా బదిలీ చేసినట్టు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆ నిర్మాతను ఇప్పుడు ప్రశ్నించం డ్రగ్ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న ప్రముఖ నిర్మాత, దర్శకుడిని ఎప్పుడు ప్రశ్నిస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సమాధానం దాటేశారు. దానికింకా చాలా సమయం పడుతుందని, నాలుగు రోజల తర్వాత పూర్తి వివరాలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్లో డ్రగ్ కేసు దర్యాప్తునకు సరైన టెక్నికల్ ఎక్విప్మెంట్, సిబ్బంది లేరని, దీంతో అంతరాయాలు ఏర్పడుతున్నాయని ఆ విభాగం అధికారులు చెబుతున్నారు. తమ విభాగంలో సరిగ్గా 40 మంది కూడా లేరని, ఇంత పెద్ద కేసును ఛేదించేందుకు ఇంకా సమయం పడుతుందని పేర్కొన్నారు. పోలీస్ శాఖకు సమాచారమే లేదు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వెలుగులోకి తెచ్చిన ఈ డ్రగ్ రాకెట్లో అనేక స్కూళ్లు, కాలేజీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, సినీ పెద్దలు.. ఇలా అనేక రంగాలకు చెందిన వారుండటం ఇప్పుడు పోలీస్ శాఖను ఇరకాటంలో పడేసింది. కేసును పట్టుకున్నది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగమే అయినా.. ఈ రంగాలపై నిత్యం నిఘా పెట్టాల్సింది పోలీస్ శాఖనే. దీంతో ఆరోపణలెదుర్కొంటున్న స్కూళ్లు, కాలేజీల జాబితాను నగర పోలీస్తో పాటుసైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు అందించాల్సి ఉంటుంది. ఈ కాలేజీలు, పాఠశాలల్లోని విద్యార్థులపై నిఘా వేసి ఉంచాలని సూచించాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్సైజ్ విభాగం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి డ్రగ్ రక్కసిని ఎక్సైజ్ విభాగం నియంత్రించడం సా«ధ్యం కాదని, అందుకు తాము కూడా తోడ్పాటు అందిస్తామని వారు అంటున్నారు. నిర్మాతే పెడ్లర్‌గా మారి.. కెల్విన్ ద్వారా గోవాలో డ్రగ్స్ స్వీకరించిన నిర్మాత.. పలువురు సినీ సెలబ్రిటీలకు కూడా డ్రగ్స్ సరఫరా చేసి ఉంటాడని ఎక్సైజ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ నిర్మాత కాల్‌డేటాను విశ్లేషించాలని భావిస్తున్నారు. కెల్విన్ విచారణలో కూడా పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. పెద్దగా సినిమాలు లేకుండా ఉన్న పలువురు సెలబ్రిæటీలకు సదరు నిర్మాత డ్రగ్స్ రవాణా చేసినట్టు కెల్విన్ చెప్పినట్లు సమాచారం. వాట్సాప్ ద్వారా ఒకట్రెండు సార్లు వారి పేర్లను కెల్విన్‌కు నిర్మాత షేర్ చేశాడని దర్యాప్తు వర్గాల ద్వారా తెలిసింది. సంబంధిత సెలబ్రిటీల కార్ల నంబర్లు, ఎక్కడ వెయిట్ చేయాలో వాటి లోకేషన్ తదితర వివరాలను నిర్మాత.. కెల్విన్‌కు షేర్ చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. మాదాపూర్‌లోని ప్రముఖ మాల్‌కు ఎదురుగా ఉన్న ఖాళీ ప్రాంతంలో ఉండాలని, హోండా యాక్టివాపై రెడ్ కలర్ టీషర్ట్ వేసుకొని వచ్చే అబ్దుల్ వహీబ్ అనే వ్యక్తి ప్యాకెట్ ఇస్తాడని కెల్విన్ చెప్పినట్టు వాట్సాప్ సందేశాల్లో వెల్లడైనట్టు అధికారులు తెలిపారు. కాలేజీ విద్యార్థుల బైక్‌లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కార్ల నంబర్ల ద్వారా కస్టమర్లను గుర్తించి డ్రగ్స్ విక్రయాలు జరిపినట్టు కెల్విన్ తన విచారణలో బయటపెట్టాడు. మరో నలుగురి అరెస్ట్.. డ్రగ్స్ స్వాధీనం డ్రగ్ కేసు దర్యాప్తులో భాగంగా కెల్విన్ అండ్ గ్యాంగ్ వెల్లడించిన అంశాల ఆధారంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఎల్ఎస్డీ డ్రాప్స్ ఉన్న 2 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో అమన్ నాయుడు(25), రవి కిరణ్(34), నిఖిల్షెట్టి(23), కుందన్‌సింగ్(23) ఉన్నారు. వీరిలో రవి కిరణ్ ఓ గేమింగ్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్. మిగతా ముగ్గురు అమన్ నాయుడు, నిఖిల్షెట్టి, కుందన్లు ఇంజనీరింగ్ విద్యార్థులని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వీరు గోవా నుంచి ఈ డ్రగ్ తెప్పించారని, వీరికి కెల్విన్‌కు సంబంధాలున్నట్టు వాట్సాప్ గ్రూపుల ద్వారా బయటపడినట్లు తెలిపారు. ఈ కేసులో మరో ముగ్గురు కీలక నిందితులున్నారని, వారిని పట్టుకుంటే షికాగో, గోవాల నుంచి వస్తున్న ఎల్ఎస్డీ డ్రగ్‌కు పూర్తి అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తున్నారు. కేసులు పెట్టం.. సహకరించండి ఇప్పటివరకు డ్రగ్స్ తీసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విచారణకు సహకరించాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేసే వారే తమ టార్గెట్ అని, వారి వివరాలు చెప్పిన విద్యార్థుల వివరాలను గోప్యంగా పెడతామని, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు. కేసు దర్యాప్తు అతి రహస్యం - బడాబాబులు, వారి పిల్లలు ఉండటమే కారణం! సాక్షి, హైదరాబాద్: మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు ఎంత రహస్యంగా జరుగుతున్నాయో.. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్న డ్రగ్స్ కేసు దర్యాప్తు అంతకంటే ఎక్కువ గోప్యంగా సాగుతోంది. మొదట్లోనే కొన్ని లీకులు ఇచ్చిన అధికారులు ఆ తర్వాత పూర్తి గోప్యతను పాటిస్తున్నారు. ఇందులో పలువురు సెలబ్రిటీలు, వీఐపీల పేర్లున్నాయని, కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు, స్కూళ్ళు, కాలేజీల విద్యార్థులు సైతం డ్రగ్స్‌కు బానిసలుగా మారినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. అయితే ఆ విద్యా సంస్థలు ఏవి అన్న అంశంపై అధికారులు నోరుమెదపటం లేదు. అరెస్టు చేసిన నిందితులపై కేసులు నమోదు చేయించారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్లను కూడా అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. ఆయా ఠాణాల ఇన్స్పెక్టర్లను సంప్రదిస్తే.. ఎఫ్ఐఆర్లు తమ వద్ద లేవని, దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో వారి వద్దనే ఉన్నాయని చెబుతున్నారు. బడాబాబులు, వారి పిల్లలతో ముడిపడి ఉన్న వ్యవహారం కావడం వల్లే ఈ గోప్యత పాటిస్తున్నట్టు తెలుస్తోంది. వరంగల్లోనూ గంజాయి మాఫియా కాజీపేట అర్బన్: విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న ముఠా వరంగల్ నగరంలో వెలుగుచూసింది. నగరంలోని షెట్టి సత్యనారాయణరెడ్డి పద్మాక్షి కాలనీలో పాన్‌షాప్ నిర్వహిస్తున్నాడు. నిత్యం ధూమపాన ప్రియులకు విదేశీ సిగరెట్లను అమ్ముతుంటాడు. దీనికి మరో అడుగు ముందుకేసి గంజాయి విక్రయాలను కూడా కొనసాగిస్తున్నాడు. నగరంలో కళాశాలల విద్యార్థుల కు గంజాయి సరఫరా చేస్తున్నాడనే పక్కా సమాచారం మేరకు పోలీసులు నిఘా పెట్టారు. సత్యనారాయణరెడ్డి మంగళవారం వరంగల్ రైల్వేస్టేషన్లో గంజాయిని దిగుమతి చేసుకుని పద్మాక్షికాలనీకి బయలుదేరాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కిలో 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా. నగరంలో పలు ప్రతిష్టాత్మకమైన కళాశాల విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నట్లు వెల్లడించాడని సుబేదారి సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
రాష్ట్రంలో మరో కల్తీ మద్యం కుంభకోణం
* బ్రాండ్ మిక్సింగ్‌కు మద్యం మాఫియా సరికొత్త రూటు * కేశినేని కార్గో సర్వీసు కేంద్రంగా మద్యం బాటిళ్ల మూతల సరఫరా * శ్రీకాకుళంజిల్లాలో తీగ లాగితే కదిలిన కల్తీ మద్యం డొంక * ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ అదుపులోకి మూతల సరఫరా దారులు, కేశినేని ట్రావెల్స్ నిర్వాహకులు సాక్షి, హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లాలో తీగ లాగితే మరో భారీ కల్తీ మద్యం కుంభకోణం డొంక కదిలింది. మద్యం బ్రాండ్ మిక్సింగ్ కోసం మూతల్ని ట్యాపింగ్ చేసిన వందల బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు బుధవారం శ్రీకాకుళం జిల్లాలో గుర్తించారు. వెంటనే ఎన్ఫోర్సుమెంట్ డైరక్టర్ వెంకటేశ్వరరావుకు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి సమగ్ర విచారణ చేయాలని డైరక్టర్ ఆదేశించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఎన్ఫోర్సుమెంట్ విభాగం హైదరాబాద్‌లోని నాచారంలో కేశినేని కార్గో సర్వీసు కేంద్రంగా బాటిళ్ల మూతలు పార్శిల్ చేస్తున్నారని తేల్చారు. వెంటనే నాచారంలోని కేశినేని కార్గో సర్వీస్ కార్యాలయంలో ఎన్ఫోర్సుమెంట్ అధికారులు గురువారం తనిఖీలు చేసి మద్యం బాటిళ్ల మూతల బాక్సులు కనుగొన్నారు. అన్ని ప్రముఖ మద్యం బ్రాండ్లకు సంబంధించిన మూతల్ని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలకు పార్శిల్ చేస్తున్నట్లు తేల్చారు. కేశినేని ట్రావెల్స్ నిర్వాహకుల్ని ప్రశ్నించి మూతల్ని సరఫరా చేస్తున్న సరఫరాదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎంత కాలం నుంచి బ్రాండ్ మిక్సింగ్‌కు మూతలు సరఫరా చేస్తున్నారో.. ఏ ఏ జిల్లాలకు సరఫరా చేశారో.. ఇందులో కేశినేని కార్గో సర్వీసు పాత్ర ఎంతో నిర్ధారించే పనిలో ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ విభాగం ఉంది. బ్రాండ్ మిక్సింగ్ అంటే? బ్రాండ్ మిక్సింగ్ అంటే మద్యాన్ని డైల్యుషన్ చేయడం. ప్రీమియర్ బ్రాండ్లలో కొంత మద్యం తీసేసి చీప్ లిక్కర్ కలపడాన్ని బ్రాండ్ మిక్సింగ్ అంటారు. ఇలాంటివాటిపై ఎక్సైజ్ అధికారులు విధిగా తనిఖీ చేయాలి. అయితే బ్రాండ్ మిక్సింగ్‌ను తేల్చి చెప్పే సాధనాలు ఏవీ ఎక్సైజ్ శాఖ వద్ద లేవు. అనుమానమున్న మద్యం బాటిళ్లను ఎక్సైజ్ ల్యాబొరేటరీలకు పంపాలి. రాష్ట్రంలో ప్రయోగశాలలున్నా అవి అలంకార ప్రాయమయ్యాయి. బెల్టుషాపుల ద్వారా విక్రయాలు.. మద్యం మాఫియా సరికొత్త రూటును ఎంచుకుని ప్రీమియం బ్రాండ్ల మూతలు బాటిళ్లపై టాపింగ్ చేసి బెల్టు షాపుల ద్వారా విక్రయాలు చేస్తున్నారు. మద్యం డైల్యుషన్స్ అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. డైల్యుషన్ మద్యం సేవించి పలు జిల్లాల్లో మందుబాబులు మరణిస్తున్నారు. ఇటీవలే గుంటూ రు, అనంతపురం జిల్లాల్లో డైల్యుషన్ మద్యం తాగి పలువురు మత్యువాత పడ్డారు. ఇలా పలు ఘటనలు జరుగుతున్నా.. ప్రభుత్వం నియంత్రణ దిశగా చర్యలు చేపట్టడం లేదు. -
కల్తీతో కడతేరుతున్న బతుకులు
ఫార్స్‌గా తయారైన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సాక్షి, హైదరాబాద్ మద్యం వ్యాపారుల స్వార్ధం అమాయకుల ఉసురు తీస్తోంది. మొన్న అనంతపురం.. నేడు విజయవాడలో కల్తీ మద్యం తాగి దినసరి కూలీలు మృత్యువాత పడుతున్నారు. కల్తీ మద్యం అరికట్టాల్సిన ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంటు విభాగం మామూళ్ల మత్తులో జోగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎన్డీపీ లిక్కర్ భారీగా దిగుమతి అవుతున్నా.. స్టేట్ టాస్క్ఫోర్సు విభాగం (ఎస్టీఎఫ్) చేష్టలుడిగి చూస్తోంది. మరోవైపు చెక్‌పోస్టుల్లో 'నిఘా' నిద్దరోతోంది. ఎక్సైజ్ అధికారులు మామూళ్ల 'మత్తు'లో జోగుతున్నారు. ఫలితంగా సుంకం చెల్లించని మద్యం (నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్) రాష్ట్రంలో ఏరులై పారుతోంది. కర్ణాటక, తమిళనాడు, యానాంల నుంచి సరఫరా అవుతున్న ఎన్డీపీ మద్యం విక్రయాలు రాష్ట్రంలో జోరుగా సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తరలిరాకుండా ఉండేందుకు ఎక్సైజ్ శాఖ 39 చెక్‌పోస్టుల్ని ఏర్పాటు చేసింది. వీటిలో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కొత్తగా 14 చెక్‌పోస్టుల్ని ఏర్పాటుచేసింది. అయినా.. తెలంగాణ నుంచే భారీగా సుంకం చెల్లించని మద్యం ఏపీకి దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో అబ్కారీ చెక్‌పోస్టులు పేరుకే ఏర్పాటయ్యాయే తప్ప ఇక్కడ మొక్కుబడిగానే విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోకి అక్రమ మద్యం ప్రవేశిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖకు పూర్తి సమాచారమున్నా, కేసులు నమోదు, వాహనాల సీజ్ మాత్రం అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అక్రమ మద్యంపై నమోదైన కేసులు, ఎన్ని వాహనాలు సీజ్ చేశారనే సమాచారం కూడా ఆ శాఖ వద్ద లేదంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. యానాం నుంచి ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు, తమిళనాడు నుంచి చిత్తూరు, నెల్లూరు, కర్ణాటక నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలకు అక్రమ మద్యాన్ని సిండికేట్లు దిగుమతి చేసుకుంటున్నారు. మద్యం డిమాండ్‌ను బట్టి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మద్యం సరఫరా అవుతుంది. ఈ సరఫరాకు ట్రూ ట్రాన్స్‌పోర్టు పర్మిట్లు కేటాయిస్తారు. వీటిని అంతరాష్ట్ర చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేస్తారు. ఏపీలో ఐదు అంతరాష్ట్ర చెక్‌పోస్టులున్నాయి. వీటిని ట్రాన్స్‌పోర్టు, కమర్షియల్ ట్యాక్స్ తదితర శాఖలతో కలిసి ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులుగా నిర్వహిస్తున్నారు. ఈ ట్రూ ట్రాన్స్‌పోర్టు పర్మిట్లను అడ్డుపెట్టుకుని మద్యం మాఫియా ఎన్డీపీ మద్యం దిగుమతి చేసుకుంటోంది. ఇవన్నీ తెలిసినా ఎక్సైజ్ అధికారులు నెలవారీ మామూళ్లతో చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేపట్టడం లేదని విమర్శలున్నాయి. ఎక్సైజ్ శాఖ సమీక్షల్లో చెక్‌పోస్టుల్ని బలోపేతం చేసి అక్రమ మద్యం అడ్డుకుంటామని సర్కారు బీరాలు పలుకుతున్నా.. కార్యాచరణకు నోచుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. -
మళ్లీ సిండి‘కేటు’
* పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా అక్రమ మద్యం దిగుమతి *రాష్ట్రంలో మైనస్‌లోకి ఏపీబీసీఎల్ మద్యం విక్రయాలు *డీల్ కుదురుస్తున్న ప్రజా ప్రతినిధులు *నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలకే ప్రమాదం *ఏసీబీకి సిఫారసు చేస్తామంటూ అధికారులకు ఎన్‌ఫోర్స్‌మెంటు డెరైక్టర్ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మైలవరం, అమలాపురం తరహా కల్తీ మద్యం సంఘటనలు మళ్లీ పునరావృతం కానున్నాయా? మద్యం తాగే అలవాటున్న ప్రజల ప్రాణాలు గాలిలో దీపమై ఊగుతున్నాయా? లిక్కర్ సిండికేటు ఒక్కసారిగా తెగబడిన తీరు, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు డెరైక్టర్ హెచ్చరికలు చూస్తుంటే ప్రజల ప్రాణాలకు మళ్లీ ముప్పు వచ్చిందని తెలుస్తోంది. ఏసీబీ దెబ్బకు 22 నెలల పాటు సెలైంట్‌గా ఉన్న లిక్కర్ సిండికేటు మళ్లీ జూలు విదిల్చడమే దీనికి కారణం. సిండికేటు దెబ్బతో సరిహద్దు రాష్ట్రాల నుంచి ఇబ్బడిముబ్బడిగా నకిలీ మద్యం పల్లెలకు చేరుతోంది. రెక్టిఫైడ్ స్పిరిట్‌తో విచ్చలవిడిగా నకిలీ మద్యం తయారు చేసి గుప్పిస్తున్నారు. ఈ సిండికేటు దెబ్బకు రాష్ట్రంలో ఇంతకుముందెప్పుడూ లేనంతగా ప్రభుత్వ మద్యం అమ్మకాలు మైనస్‌లోకి పడిపోయాయి. పాత కమిషనర్ సమీర్‌శర్మ బదిలీపై వెళ్లడం, కొత్త కమిషనర్ ఇంకా శాఖపై పట్టు సాధించకపోవడంతో సిండికేట్లు మళ్లీ పాత జమానా మొదలు పెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మధ్యవర్తులుగా ఉంటూ సిండికేట్ ‘డీల్’ కుదురుస్తున్నారు. ప్రజాప్రతినిధులు తమ ఏరియాల్లోని దుకాణాల్లో వాటాలు తీసుకొని అక్రమ దందాకు తెరలేపారు. వీళ్లకు స్థానిక ఎక్సైజ్ అధికారుల వత్తాసు ఉందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంటుకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు డెరైక్టర్ ఇటీవల అధికారుల సమావేశం నిర్వహించి ఎస్‌హెచ్‌వో స్థాయిలో ఏదో జరుగుతుందని, అధికారుల ప్రవర్తన మార్చుకోకపోతే ఏసీబీకి సిఫారసు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీం హడావుడిగా జిల్లాలు తిరుగుతూ అధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించి పరిస్థితి సమీక్షిస్తున్నారు. పెరగాల్సిన విక్రయాలు తగ్గాయి! రాష్ట్రంలో నిరుపేద, సామాన్య ప్రజలు ఎక్కువగా తాగే చవక, మధ్యతరహా బ్రాండ్ల మద్యం విక్రయాలు ఇటీవల గణనీయంగా పడిపోయాయి. పొరుగు రాష్ట్రాల నుంచి సుంకం లేని మద్యం (ఎన్డీపీఎల్) దొంగచాటుగా దిగుమతి చేసుకొని వైన్‌షాపుల్లో పెట్టి అమ్మడం వల్లనే ప్రభుత్వ మద్యం విక్రయాలు తగ్గుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఎన్డీపీఎల్ మద్యాన్ని కొంతమంది ముఠాగా ఏర్పడి పక్కరాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేస్తున్నారని ఎక్సైజ్ అధికారులు తేల్చారు. అధికారుల అంచనా మేరకైనా, గత రికార్డులను బట్టి చూసినా మద్యం విక్రయాలు ఏటా కనీసం 10 శాతం చొప్పున పెరగాలి. అందుకు తగ్గట్లుగానే ఆంధ్రప్రదేశ్ బ్రివరేజెస్ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) వివిధ రకాల బ్రాండ్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఎక్సైజ్ అధికారుల అంచనాల్లో గత పదేళ్లుగా తేడా రాలేదు. కానీ గడచిన 18 రోజులలో ఏపీబీసీఎల్లో మద్యం అమ్మకాల రేటు గణనీయంగా పడిపోయింది. వాస్తవానికి ఈ ఏడాది మొదట్లో కూడా విక్రయాల రేటు బాగానే ఉంది. మద్యం ధరలు రెండుసార్లు పెరిగినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. పై లీన్ తుపాను, సమైక్య ఉద్యమం జరిగిన సమయంలో కూడా మద్యం విక్రయాల రేటు పెరుగుతూనే వచ్చింది. కానీ ఎకై ్సజ్ కమిషనర్ సమీర్‌శర్మ మారిన తరువాత ఈ నెల మొదటి వారం నుంచీ అన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు ఊహించని విధంగా మైనస్‌లోకి పడిపోయాయి. పొరుగు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో మద్యం విక్రయాలు భారీగా తగ్గడం, మిగిలిన జిల్లాల్లో పెద్దగా మార్పు లేకపోవడం ఎన్డీపీఎల్ మద్యం దిగుమతిని నిర్ధారిస్తోంది. ఆ నాలుగు రాష్ట్రాల నుంచీ దిగుమతి.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒడిశా నుంచి.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తమిళనాడు నుంచి.. ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు మహారాష్ట్ర నుంచి.. పశ్చిమగోదావరి జిల్లాకు గోవా నుంచి అక్రమంగా ఎన్డీపీఎల్ మద్యం రవాణా అవుతున్నట్లు ఎక్సైజ్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల్లోని డిస్టిలరీల నుంచి వ్యాపారులు మద్యాన్ని కొనుగోలు చేసి ప్రత్యేకంగా డిజైన్ చేసిన లారీల ద్వారా ఇక్కడకు తరలిస్తున్నారు. మీడియం లిక్కర్‌ను కేసు (12 ఫుల్ బాటిల్స్) రూ.1,100 చొప్పున కొనుగోలు చేసి రాష్ట్రంలో రూ.4,200 చొప్పున అమ్ముతున్నారు. రోజుకు కనీసం 5 నుంచి 7 లారీల మద్యం రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా అవుతున్నట్లు అంచనా. చౌక మద్యంతో ప్రజల ఆరోగ్యానికి హాని ఉన్నా ఎక్సైజ్ అధికారులు తేలుకుట్టిన దొంగల్లా చూస్తున్నారు.