
సీఎం ఫండ్ చెక్కులు చెల్లడంలేదు
గవర్నర్‌కు షబ్బీర్ అలీ లేఖ
హైదరాబాద్: పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి ఇచ్చిన చెక్కులు సంబంధిత బ్యాంకుల్లో చెల్లడం లేదని, దీంతో బాధితులు బ్యాంకులు, సీఎం కార్యాలయం చుట్టూ తిరగలేక ఇబ్బం దులు పడుతున్నారని శాసన మండలిలో తెలం గాణ శాసనమండలిలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ షబ్బీర్ అలీ తెలిపారు. సీఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బ్యాంకుల్లో బౌన్సు అయిన చెక్కులను జత చేసి ఆయన, రాష్ర్ట గవర్నర్ న రసింహన్‌కు ఓ లేఖ రాశారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి జూన్ 2వ తేదీ వరకు జారీ అయిన సుమారు 3,600 చెక్కుల పరిస్థితి ఇలాగే ఉందన్నారు. కేవలం నెల రోజుల కాల పరిమితితో జారీ చే సిన ఈ బ్యాంకు చెక్కులను పట్టుకుని బాధితులు సీఎం కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని పేర్కొన్నారు.